హోం మంత్రిత్వ శాఖ

రు.541 కోట్ల విలువ గల 7 పట్టణ మౌళిక ప్రాజెక్టులకు పునాది వేసిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర హోం మంత్రి శ్ అమిత్ షా

“2014 సంత్సరం నుండి బిహార్ రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తోంది”

“ఈ అభివృద్ధి పథకాల ద్వారా బిహార్ రాష్ట్ర ప్రజలకు పరిశుభ్రమైన త్రాగు నీరు మరియు మురికి నీటి యాజమాన్య సౌకర్యాలను కల్పించడం ద్వారా మౌళిక వసతులను మెరుగు పరచడానికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తోంది”

“ముజఫర్పూర్ నది ముందు భాగం పర్యాటక రంగం మరియు పర్యావరణానికి భారీ తోడ్పాటును అందించడంతోపాటు అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది”

Posted On: 15 SEP 2020 4:54PM by PIB Hyderabad

బీహార్లో  రు.541 కోట్ల విలువ గల మౌళిక వసతుల సదుపాయాల ప్రాజెక్టులకు పునాదిని వేసిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీకి కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు.

2014 సంత్సరం నుండి బిహార్ రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగా త్రాగునీరు, మురికి నీటి యాజమాన్యం మరియు నదీ తీర అభివృద్ధికి సంబంధించిన 7 మౌళిక సదుపాయాల ప్రాజెక్టులకు పునాదివేసిన ప్రధానికి కృతజ్ఞతలుతెలుపుతున్నట్లు అమిత్ షా తన ట్వీట్లో తెలిపారు.

ఈ అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా బిహార్ రాష్ట్రంలో మౌళిక సదుపాయాలైన పరిశుభ్రమైన త్రాగు నీరు మరియు మురికి నీటి యాజమాన్యాల్లో మార్పు తెస్తుందని అన్నారు. అలాగే ముజఫర్పూర్ నదీ అభివృద్ధి అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పనలో, పర్యాటక రంగ అభివృద్ధిలో మరియు పర్యావరణ పరంగా భారీ తోడ్పాటును అందిస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు.

 భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఈ రోజు బీహార్లో 7 కీలక మౌళిక సదుపాయాల ప్రాజెక్టులకు వీడియో సమావేశం ద్వారా పునాది వేశారు. ఇందులో 4 త్రాగు నీటికి సంబంధించినవి కాగా రెండు మురుగు నీటి యాజమాన్యం మరొకటి నదీ తీర అభివృద్ధికి సంబంధించినవి. ఈ ప్రాజెక్టులన్నీ బియుఐడిసిఓ క్రింద బీహార్ పట్టణ అభివృద్ధి మరియు గృహ విభాగం క్రింద అమలుపరచబడుతాయి. ఈ సందర్భంగా  బీహార్ ముఖ్య మంత్రి శ్రీ నితీష్ కుమార్ కూడా సమావేశం పాల్గొన్నారు.

***



(Release ID: 1654640) Visitor Counter : 104