ఆయుష్
యోగ, ప్రకృతిచికిత్సలో కేంద్ర పరిశోధన సంస్థలను ఏర్పాటు చేయడానికి భూములను కేటాయించడానికి ముందుకొచ్చిన రాష్ట్రాలు.
Posted On:
15 SEP 2020 4:10PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు యోగ, ప్రకృతిచికిత్సలో కేంద్ర పరిశోదన సంస్థల (సిఆర్ఐవైఎన్) ను ఏర్పాటు చేయడానికి స్థలాలను ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద స్వయంప్రతిపత్తి గల యోగా ప్రకృతిచికిత్స (సిసిఆర్వైఎన్)ఆధ్వర్యంలో ఇవి ఏర్పాటు అవుతాయి. ఇప్పటివరకు, హర్యానా, కర్ణాటక, ఒడిశాలో మూడు సిఆర్ఐలను స్థాపించడానికి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈ రాష్ట్రాలలో ప్రభుత్వం అందించిన నిధుల వివరాలు, దాని వినియోగం ఇలా ఉన్నాయి: -
రాష్ట్రం
|
ఇచ్చిన నిధులు
|
వినియోగించిన నిధులు
|
హర్యానా
|
రూ. 59.21 కోట్లు
|
రూ. 56.55 కోట్లు
|
కర్ణాటక
|
రూ. 59.67 కోట్లు
|
రూ. 56.35 కోట్లు
|
ఒడిశా
|
రూ. 1.58 కోట్లు
|
రూ. 0.09 కోట్లు
|
ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రకృతిచికిత్సని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కింద విధంగా ఉన్నాయి: -
- అంతర్జాతీయ ప్రోత్సాహం కింద కేంద్ర ప్రభుత్వ పథకం (ఐసి స్కీమ్) ద్వారా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచవ్యాప్తంగా యోగా, ప్రకృతిచికిత్సతో సహా ఆయుష్ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి, ప్రచారం చేయడానికి వివిధ చర్యలు తీసుకుంటుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ నిపుణులను అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు, సెమినార్లలో పాల్గొనడానికి ఆయుష్ ప్రక్రియల ప్రమోషన్ ప్రచారం కోసం కేంద్రం ప్రత్యేకంగా విదేశాలలో నియమిస్తుంది. అంతర్జాతీయ సమావేశాలు, వర్క్షాపులు, సెమినార్ మొదలైన వాటిలో ఆయుష్ సంబంధిత శాస్త్రీయ పరిశోధనా పత్రాలను ప్రదర్శించడానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది.
- ప్రతి జూన్ 21వ తేదీని ఏకగ్రీవంగా అంతర్జాతీయ యోగ దినోత్సవంగా 2015లో ప్రకటించిన దరిమిలా అయుష్ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగ సదస్సును నిర్వహిస్తోంది. గుండె సంరక్షణకు యోగ అంతర్జాతీయ సదస్సును 2019 నవంబర్ 15-16 తేదీన మైసూరు లో నిర్వహించారు. సుమారు 17 దేశాల నుండి 35 మంది యోగా నిపుణులు / ఔత్సాహికులతో సహా దాదాపు 1000 మంది భారతీయ, విదేశీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విదేశాల నుండి వచ్చి పాల్గొన్నవారికి యోగా వివిధ కోణాలను సంగ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, ఆయా దేశాలలో మరింత ప్రచారం చేయడానికి వారికి అవకాశం కల్పించింది.
- ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినంగా జూన్ 21 వేడుకలు జరుపుకునేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం విదేశాలలో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలకు సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. 2019 లో భారతదేశంతో పాటు 820 గ్లోబల్ ప్రదేశాలలో 189 దేశాలలో ఐడివై జరుపుకున్నారు.
- సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ చేసిన సమిష్టి కృషి ఫలితంగా, యోగాను యునెస్కో ప్రతినిధి జాబితాలో 2016 డిసెంబర్ 1 న మానవజాతితో విడదీయలేని సాంస్కృతికవారసత్వంగా పొందుపరిచారు, ఇతర దేశాలతో శాంతి, సహనం అనే ఆలోచనలను మరింత ప్రచారం చేస్తుంది.
- ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) ద్వారా భారతదేశంలోని ప్రీమియర్ యోగా ఇన్స్టిట్యూట్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ (యుజి), పిహెచ్ డి కోర్సులను అభ్యసించడానికి 98 దేశాల నుండి అర్హత కలిగిన విదేశీ పౌరులకు ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. యోగా, ప్రకృతిచికిత్సతో సహా ఆయుష్ మెడిసిన్ వ్యవస్థల గురించి ప్రామాణికమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి 30 దేశాలలో 33 ఆయుష్ సమాచార కేంద్రాలను మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
ఈ సమాచారాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.
*****
(Release ID: 1654595)