ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రైవేటు ఆసుపత్రుల అధిక చార్జీలపై నియంత్రణ

Posted On: 15 SEP 2020 2:58PM by PIB Hyderabad

    దేశంలో కోవిడ్-19 ప్రభావిత పరిస్థితులను అదుపు చేయడానికి, భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. విషయంలోయావత్ ప్రభుత్వం”, “యావత్ సమాజంఅన్న పద్థతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రతిస్పందనపై పర్యవేక్షణకోసం గౌరవ ప్రధానమంత్రి, ఉన్నత స్థాయి మంత్రుల బృందం, కేబినెట్ కార్యదర్శి, ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శుల కమిటీ, శాఖలోని సీనియర్ అధికారులు నిరాటంకంగా విధులు నిర్వహిస్తూ వస్తున్నారు.

  కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఎప్పటికప్పుడు తలెత్తే పరిణామాలకు అనుగుణంగాప్రజారోగ్య శాఖ తరఫున చర్యలు క్రమ పద్ధతిలో తీసుకున్నారు. అంతర్జాతీయ పర్యాటకులపై ఆంక్షల విధిస్తూప్రజల ప్రయాణాలపై ప్రభుత్వం అనేక సూచనలు జారీ చేస్తూ వచ్చింది. వాణిజ్య ప్రాతిపతికపై నడిచే విమాన సర్వీసులను 2020 మార్చి 23 రద్దు చేశారు. అప్పటి వరకూ, ఆయా విమానాశ్రయాల్లో 15,24,266 మంది ప్రయాణికులతో కూడిన 14,154 విమానాలపై స్క్రీనింగ్ పరీక్షలు జరిపారు. 12 ప్రధాన ఓడరేవులు,  65 మైనర్ ఓడరేవులు, భూభాగంలోని సరిహద్దు ద్వారా ప్రయాణాలపై తనిఖీలు జరిపి స్క్రీనింగ్ నిర్వహించారు. వైరస్ వ్యాప్తి చెందిన ప్రారంభంలో కోవిడ్ ప్రభావిత దేశాలైన చైనా, ఇటలీ, ఇరాన్, జపాన్, మలేసియాలలో పెద్దసంఖ్యలో చిక్కుకుపోయిన ప్రయాణికులను భారత ప్రభుత్వం ఖాళీ చేయించింది. లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తున్న తరుణంలో కూడా లక్షలాది మంది ప్రయాణికులను స్వదేశానికి తీసుకువచ్చారు. 2020, సెప్టెంబరు 9నాటి సమాచారం ప్రకారం మొత్తం 12,43,176 మంది ప్రయాణికులను స్వదేశానికి తీసుకువచ్చారు.

  ప్రజాసమూహంపై నిఘా ద్వారా వ్యాధిపై అప్రమత్తతకోసం సమగ్ర కార్యక్రమాన్ని (.డి.ఎస్.పి.ని) ప్రభుత్వం అమలు జరుపుతూ ఉంది. మహమ్మారి వైరస్ ప్రబలిన తొలి రోజుల్లో నిఘాను  ప్రయాణాలకు సంబంధించిన వ్యవహారాలపై అమలు చేశారు. తర్వాత వ్యాధి కట్టడి వ్యూహంలో భాగంగా ప్రజాసమూహంనుంచి నమోదయ్యే కేసులకు ఇదే నిఘాను వర్తింపజేశారు. 2020, సెప్టెంబరు 10నాటికి మొత్తం 40లక్షలమందిపై నిఘా పర్యవేక్షణను అమలు చేశారు. ఇక కోవిడ్-19పై నిర్ధారణ పరీక్షలకోసం 1,697 లాబరేటరీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలో పదిలక్షల నమూనాలపై పరీక్షలు జరుగుతున్నాయి. 2020 సెప్టెంబరు 10 నాటికి 5.4కోట్ల శాంపిల్స్ పై కోవిడ్ పరీక్షలు జరిగాయి.

   2020 సంవత్సరం సెప్టెంబరు 10 నాటికి దేశంలో మొత్తం 15,290 కోవిడ్ చికిత్సా కేంద్రాలు, సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆక్సిజన్ సదుపాయంతో 13,14,171 ఐసొలేషన్ పడకలు సిద్ధమయ్యాయి. అంతేకాక, ఆక్సిజన్ సదుపాయం కలిగిన 2,31,269 ఐసొలేషన్ పడకలు, 62,694 ఇన్ టెన్సివ్ కేర్ యూనిట్ (.సి.యు.) పడకలు (వాటిలో 32,241 పడకలు కృత్రిమ శ్వాస ఏర్పాట్లు కలిగినవి) కూడా  అందుబాటులోకి వచ్చాయి.

   కోవిడ్ చికిత్సకు సంబంధించిన సదుపాయాలు, ఏర్పాట్ల విషయంలో రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వ తగిన తోడ్పాటు అందించింది. ఇప్పటి వరకూ (2020 సెప్టెంబరు 10నాటి సమాచారం ప్రకారం)  కోటీ 39 లక్షల వ్యక్తిగత రక్షణ పరికర సామగ్రి (పి.పి.. కిట్స్), 3.42కోట్ల ఎన్.95 మాస్కులు, 10.84కోట్ల హైడ్రాక్సీన్ క్లోరోక్వీన్ మాత్రలు, 29,779 కృత్రిమ శ్వాస పరికరాలు, 1,02,400 ఆక్సిజన్ సిలిండర్లను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా కేంద్రం సరఫరా అయ్యాయి.

  కోవిడ్ సంబంధమైన పనులు, నిత్యావసర వైద్య సర్వీసుల నిర్వహణా విధులకోసం వివిధ రంగాలకు, శాఖల్లో పనిచేసే వివిధ హోదాల్లోని సిబ్బందిని, వలంటీర్లను తీసుకున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్,  iGOT పోర్టల్ (https://igot.gov.in/igot/) ద్వారా సిబ్బంది శిక్షణా వ్యవహారాల విభాగం (డి..పి.టి.) శిక్షణ ఇచ్చింది.

  దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తికి సంబంధించిన తాజా పరిస్థితిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ సాధారణ ప్రజలకు రోజువారీ ప్రాతిపదికపై సమాచారం అందిస్తూ వస్తోంది. దీనితో పాటు సోషల్ మీడియా వేదికలపై కూడా సమాచారం పొందుపరుస్తూ వస్తున్నారు. కోవిడ్ సమాచారం అందించేందుకు, మార్గదర్శకంగా వ్యవహరించేందుకు 1075నంబరులో ఒక హెల్ప్ లైన్ ను క్రమం తప్పకుండా సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారు.

   కోవిడ్ నిరోధం లక్ష్యంగా రూపొందే 30కి పైగా వ్యాక్సీన్లపై వివిధ దశల్లో ప్రయోగాత్మక పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. వాటిలో 3 వ్యాక్సీన్లపై పరీక్షలు బాగా పురోగమనంలో అంటే I/II/III ప్రయోగాత్మక దశల్లో ఉన్నాయి. మరో నాలుగు పైగా వ్యాక్సీన్లపై పరీక్షలు క్లినికల్ ట్రయల్స్ కు ముందస్తుగా జరిగే రూపకల్పన దశలో ఉన్నాయి. కోవిడ్-19 వైరస్ పై వ్యాక్సీన్ల వినియోగానికి సంబంధించి ఒక జాతీయ స్థాయి నిపుణుల బృందాన్ని నీతీ ఆయోగ్ నియమించింది. 2020 ఆగస్టు 7 తేదీన బృందం నియమితమైంది.

  ఆరోగ్యం అనేది రాష్ట్రం పరిధిలోని అంశం. కోవిడ్ కేసులపై చికిత్సకోసం ప్రైవేటు ఆసుపత్రులను వినియోగించుకునే బాధ్యత కూడా ఆయా రాష్ట్రప్రభుత్వాల పరిధిలోకే వస్తుంది. నేపథ్యంలో, కోవిడ్ చికిత్సకోసం పరస్పరం ఆమోద యోగ్యమైన ఏర్పాట్ల ప్రాతిపదికగా ప్రైవేటు ఆసుపత్రులను వినియోగించుకోవచ్చని సూచిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పి.ఎం.-జె..వై), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సి.జి.హెచ్.ఎస్.) ప్యాకేజీల రేట్ల ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులను వినియోగించుకోవచ్చని లేఖలో సూచించారు. ఇందుకు అనుగుణంగా పలు రాష్ట్రప్రభుత్వాలు కూడా మేరకు ఆదేశాలు జారీ చేశాయి.

  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే రోజు రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వివరాలన్నీ తెలియజేశారు.

 

*****

 

 

 



(Release ID: 1654535) Visitor Counter : 130