వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఒంటెల జాతీయ పరిశోధన కేంద్రం

Posted On: 15 SEP 2020 4:03PM by PIB Hyderabad

ఒంటెల జాతీయ పరిశోధన కేంద్రం (ఎన్‌ఆర్‌సీసీ) శాఖను గుజరాత్‌లోని బికనీర్‌లో ఏర్పాటు చేయడానికి, సరిపడినంత స్థలం, 
ఇతర వనరులను నామమాత్రపు ఖర్చు లేదా లీజు ప్రాతిపదికన గుజరాత్‌ ప్రభుత్వం నుంచి కోరడమైనది.

ఖరై ఒంటెల సంరక్షణ చర్యలు:

1. డేర్‌/ఐసీఏఆర్‌ ద్వారా, జాతి వారీగా ఖరై ఒంటెల లక్షణాలను వర్గీకరించి, నమోదు చేసి, గెజిట్‌ ప్రకటన ఇవ్వడం జరిగింది.
2. ఖరై జాతి పరిరక్షణ, అభివృద్ధి కోసం గుజరాత్‌లోని కామధేను విశ్వవిద్యాలయంతో ఎన్‌ఆర్‌సీసీ అవగాహన ఒప్పందం చేసుకుంది. (i) శాస్త్రీయంగా ఒంటెల పరిరక్షణకు రైతులకు శిక్షణ (ii) శాస్త్రవేత్తలు-రైతుల సమావేశాలు నిర్వహణ (iii) జంతు ఆరోగ్య శిబిరాలు నిర్వహణ (iv) ఒంటె పాల పరిశ్రమల అభివృద్ధికి సాంకేతిక సహకారం అందించడం ఈ ఒప్పందంలో భాగం.
 
లద్దాఖ్‌లోని రెండు మూపురాల ఒంటెలను సంరక్షించడానికి బికనీర్‌లోని ఎన్‌ఆర్‌సీసీ ఈ క్రింది చర్యలు తీసుకుంది:

నుబ్రా లోయలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ఒంటెల ఆరోగ్య నిర్వహణ
స్థానిక దాణా వనరులను ఉపయోగించడం ద్వారా పోషకాహారం నిర్వహణ

కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు సమర్పించారు.

***



(Release ID: 1654531) Visitor Counter : 139