ఆయుష్

కోవిడ్ నుంచి కోలుకోవటంలో యోగా సాయం

Posted On: 15 SEP 2020 4:10PM by PIB Hyderabad

కోవిడ్ -19  బాధితులు వేగంగా కోలుకోవటంలో యోగా ఏ మేరకు సమర్థంగా పనిచేస్తున్నదో పరిశోధించేందుకు  ఢిల్లీలోని రాజివ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎయిమ్స్, ఎయిమ్స్ ఋషీకేశ్, ఆర్ ఎం ఎల్ ఆస్పత్రుల సహకారంతో కేంద్ర యోగా, నేచరోపతి పరిశోధన మండలి ఒక ప్రాజెక్ట్ చేపట్టింది. గుంపులుగా చేరటం వలన కరోనా వైరస్ సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో సమూహాలుగా గుమికూడటం మీద ఆంక్షలు ఉండగా 2020 యోగా దినోత్సవ నినాదాలే ఇంటి దగ్గర యోగా, కుటుంబంతో యోగా అనే విధంగా తయారైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయుష్ మంత్రిత్వశాఖ యోగా పోర్టల్ లాంటి అనేక డిజిటల్ వేదికలను, యుట్యూబ్, ఫేస్ బుల్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా సోషల్ మీడియా వనరులను అందుబాటులో ఉంచింది. దీనివలన ప్రజలు ఇంట్లోనే ఉండి యోగా నేర్చుకోవటానికి  అనేక అవకాశాలు కల్పించినట్టయింది. అదే విధంగా మై లైఫ్ మై యోగా పేరుతో జీవన యోగం వీడియో బ్లాగింగ్ పోటీలు నిర్వహించి ఆకర్షణీయమైన బహుమతులు ప్రకటించింది. దీనికి తోడు ప్రసార భారతి తో కలిసి ఆయుష్ మంత్రిత్వశాఖ ఆరవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక ట్రెయినర్ సాయంతో యోగా నేర్పే సెషన్ ను డిడి నేషనల్ లో ప్రసారం చేసింది.

ప్రముఖ యోగా గురువులు, నిపుణుల ఆన్ లైన్ యోగా కోర్సులు కూడా ఏర్పాటృ చేయటం ద్వారా 2020 అంతర్జాతీయ యోగా దినం పట్ల అవగాహన కల్పించటం సాధ్యమైంది.  16 మంది యోగా గురువులు, నిపుణులు 2020 జూన్ 5 నుంచి 20 వరకు యోగా మీద ఉపన్యాసాలు అందించారు. వీటన్నిటినీ ఆయుష్ మంత్రిత్వశాఖ తన ఆధికారిక ఫేస్ బుక్ పేజ్ లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. అంతర్జాతీయ యోగా దినం  పాటించటంలో భాగంగా ఈ మంత్రిత్వశాఖ గ్రామ ప్రధాన్ లను చేరుకొని, గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టాల్సిందిగా సూచించింది. ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వశాఖ వారి కామన్ సర్వీస్ సెంటర్లను కూడా గ్రామాలలో యోగా ప్రచారానికి వాడుకున్నారు.

ఇంటినుంచే యోగా శిక్షణ పొందటానికి వెసులుబాటు కల్పిస్తూ డిడి భారతి లో ప్రతిరోజూ సాధారణ యోగా విధి విధానాలు ప్రసారం చేశారు. దీనివలన మరింతమంది ప్రజలు యోగా గురించి తెలుసుకోవటానికి, ప్రధాన ఘట్టానికి సిద్ధం కావటానికి వీలు కుదిరింది. వినోద రంగానికి చెందిన పలువురు ప్రముఖులు యోగా ను ప్రోత్సహించే దిశగా తమ సందేశాలనిచ్చి ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఇళ్ళలోనే యోగా లో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈరోజు  ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని రాజ్యసభకు తెలియజేశారు.

***



(Release ID: 1654526) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Manipuri , Assamese