సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డానికిగాను ప‌లు కేంద్ర ప్ర‌భుత్వ

ప‌థ‌కాల కింద రూ. 5462.69 ల‌క్ష‌ల గ్రాంటు విడుల: శ్రీ ప్ర‌హ్లాద్‌ సింగ్ ప‌టేల్‌
క‌ళాకారులకు 927. 83 ల‌క్ష‌ల ఆర్దిక స‌హాయాన్ని అందించిన ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలు

Posted On: 14 SEP 2020 6:34PM by PIB Hyderabad

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలోని క‌ళాకారులు త‌మ ఉపాధిని కోల్పోయి ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వున్నారు. ఈ క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డానికిగాను ప‌లు కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల కింద ఆయా క‌ళాకారుల‌కు సాయం చేయ‌డానికిగాను గ్రాంట్లు విడుద‌ల‌య్యేలా కేంద్ర సాంస్కృతిక శాఖ కృషి చేసింది. 
రూ. ల‌క్ష‌ల్లో

సీరియ‌ల్ నెంబ‌ర్

ప‌థ‌కం పేరు

అందిస్తున్న గ్రాంట్ వివ‌రాలు

i.

రెప‌ర్ట‌రీ గ్రాంట్ ప‌థ‌కం కింద ఆర్ధిక స‌హాయం

1517.04

ii.

బౌద్ధ /  టిబెట్ క‌ళ‌లు మ‌రియు సంస్కృతి అభివృద్ధికోసం ఆర్ధిక స‌హాయం

1329.00

iii.

సాంస్కృతి కార్య‌క్ర‌మాలు మ‌రియు ప్రొడ‌క్ష‌న్ గ్రాంట్ ప‌థ‌కం

886.00

iv.

క‌ళలు మ‌రియు సంస్కృతి ప్రోత్సాహ‌క ఉప‌కార‌వేత‌నం మ‌రియు ఫెలోషిప్ ప‌థ‌కం

881.00

v.

జాతీయ స్థాయి క‌లిగిన సాంస్కృతిక సంస్థ‌ల ఆర్ధిక స‌హాయం

427.25

vi.

హిమాల‌యాల సాంస్కృతిక వార‌స‌త్వ ప‌రిర‌క్ష‌ణ మ‌రియు అభివృద్ధికి ఆర్ధిక స‌హాయం అందించే ప‌థ‌కం

165.00

vii

క‌ళాకారుల‌కు పింఛ‌న్లు మ‌రియు వైద్య స‌హాయం

160.00

viii.

సేవా భోజ్ యోజ‌న కింద ఆర్ధిక స‌హాయం

74.00

ix.

సాంస్కృతిక కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ స్టూడియో, థియేట‌ర్ల నిర్మాణంకోసం చేసే ఆర్దిక స‌హాయం గ్రాంట్లు

23.40

మొత్తం

5462.69


దేశంలోని ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలు (జెడ్ సిసి) త‌మ క‌ళాకారుల‌కు రూ. 927. 83 ల‌క్ష‌ల ఆర్ధిక స‌హాయాన్ని అంద‌జేశాయి. సంగీత‌, నృత్య‌, నాట‌క రంగాల‌కు చెందిన జాతీయ సంస్థ సంగీత నాట‌క అకాడ‌మీ ( ఎస్ ఎన్ ఏ) ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప‌లు విర్చువ‌ల్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించింది. వీటి ద్వారా దేశంలోని ప‌లువురు క‌ళాకారులు ల‌బ్ధి పొందారు. 
1. కోవిడ్ మ‌హ‌మ్మారి త‌ర్వాత సంగీత నాట‌క అకాడ‌మీ 32 వెబినార్ల‌ను నిర్వ‌హించింది. వీటి ద్వారా 32 మంది క‌ళాకారులు ఆర్ధికంగా ల‌బ్ధి పొందారు. 
2. దీక్ష అనే పేరు మీద ఆన్ లైన్ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇంత‌వ‌ర‌కూ 15 దీక్షా శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. దాదాపు రూ. 11 ల‌క్ష‌లను ఆయా క‌ళాకారులు, గురువుల‌కు, వారి స‌హాయకులకు అంద‌జేయ‌డం జ‌రిగింది. 
3. యోగ్ ప‌ర్వ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌ళ‌కారుల‌కు రూ. 16 ల‌క్ష‌లు విడుద‌ల‌
కేంద్ర సాంస్కృతిక శాఖ కింద వున్న ప‌లు సంస్థ‌లు అనేక అన్ లైన్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంద్వారా ఆయా రంగాల్లోని క‌ళాకారుల‌కు ల‌బ్ధి చేకూరింది. కేంద్ర సాంస్కృతిక శాఖకు దేశంలో ఏడు ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలున్నాయి. వీటిద్వారా నిర్వ‌హించిన ప‌లు ఆన్ లైన్ కార్య‌క్ర‌మాల్లో జాన‌ప‌ద‌, గిరిజ‌న క‌ళాకారులు పాల్గొని త‌మ ప్ర‌తిభ‌ను చూపారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ ప‌థ‌కాల ద్వారా క‌ళాకారులు సాయం పొందాల‌నే ఉద్దేశ్యంతో ఆయా ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలు హెల్ప్ లైన్లు ప్రారంభించి వివ‌రాలు తెలుపుతున్నాయి.  రిజిస్ట‌ర్ చేయించుకున్న క‌ళాకారులను విర్చువ‌ల్ వేదిక‌ల మీద ప్రోత్స‌హించ‌డానికిగాను ప‌లు ఎన్జీవోల‌తో జెడ్‌సిసిలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 
సంగీత నాట‌క అకాడ‌మీ సోష‌ల్ మీడియా వేదిక ద్వారా అభివ్య‌క్తి అనే పేరుతో ప‌లు కార్య‌క్ర‌మాలు, పండ‌గ‌ల‌ను వ‌రుస‌గా ప్ర‌ద‌ర్శిస్తోంది. అక్టోబ‌ర్ నెల‌లో ఆ త‌ర్వాత‌ ప‌లు క‌ళా రంగాల్లో విర్చువ‌ల్ ఫెస్టివ‌ల్స్ నిర్వ‌హించ‌డానికిగాను ఎస్ ఎన్ ఏ స‌న్నాహాలు చేస్తోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రినుంచి ఫిజిక‌ల్ ఫెస్టివ‌ల్స్ వుంటాయి. 
ఈ స‌మాచారాన్ని లోక్ స‌భ‌లో.. కేంద్ర సాంస్కృతి, ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్ సింగ్ పటేల్ రాత‌పూర్వ‌కంగా ఇచ్చారు. 

*****



(Release ID: 1654390) Visitor Counter : 121


Read this release in: English , Urdu , Marathi , Manipuri