వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
2020-21 ఖరీఫ్ పంట సీజన్‌లో 495.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అంచనా
Posted On:
14 SEP 2020 6:39PM by PIB Hyderabad
'కేంద్ర ఆహారం&ప్రజా పంపిణీ విభాగం' కార్యదర్శి, అన్ని రాష్ట్రాల ఆహార విభాగం కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం ధాన్యం సేకరణ ఏర్పాట్లపై సమీక్షించారు. 2019-20 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సేకరణ అంచనా అయిన 416 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంతో పోలిస్తే, 2020-21లో 19.07 శాతం వృద్ధితో, 495.37 ల.మె.ట. సేకరించాలని అంచనా వేశారు. 2019-20 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో అంచనాను మించి 420.22 ల.మె.ట. ధాన్యం సేకరించారు. ఇది రికార్డు స్థాయి సేకరణ.
2019-20 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం సేకరణ అంచనాలతో పోలిస్తే, ఈసారి తమిళనాడు, మహారాష్ట్రకు 100 శాతం కంటే ఎక్కువ సేకరణను అంచనాగా నిర్ణయించారు. మధ్యప్రదేశ్, తెలంగాణ, బిహార్, ఝార్ఖండ్‌కు 50 శాతం కంటే ఎక్కువను అంచనాగా నిర్ణయించారు. అంచనా సేకరణల్లో ముందున్న రాష్ట్రాలు.. పంజాబ్ 113 (ల.మె.ట.), ఛత్తీస్‌గఢ్ (60 ల.మె.ట.), తెలంగాణ (50 ల.మె.ట.), హర్యానా (44 ల.మె.ట.) ఆంధ్రప్రదేశ్ (40 ల.మె.ట.), ఉత్తరప్రదేశ్ (37 ల.మె.ట.) ఒడిశా (37 ల.మె.ట).
ధాన్యం సేకరణ ప్రక్రియలో కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలని అన్ని రాష్ట్రాలకు 'కేంద్ర ఆహారం&ప్రజా పంపిణీ విభాగం' కార్యదర్శి సూచించారు. ఆహార రాయితీ వంటి ఇతర అంశాలపైనా వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చ జరిగింది.
***
(Release ID: 1654289)
Visitor Counter : 119