మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

బాధిత సమూహాలకు నాణ్యమైన విద్య

అందించటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు

నాడు పోస్టు చేయడమైనది: 14 SEP 2020 4:43PM by PIB Hyderabad

ఆన్ లైన్/డిజిటల్ విద్యను పరోక్షంగా అందించినప్పటికీ అందరికీ సమానంగా అందించేందుకు కట్టుబడి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది.  ’ స్వయం’ ద్వారా నాణ్యమైన ఆన్ లైన్ కోర్సులు నడుపుతూ,  వాటిని స్వదేశీ పరిజ్ఞానంతో   భారీ ఓపెన్ ఆన్ లైన్ కోర్సులు (మూక్స్) ద్వారా రూపొందించింది. అయితే, ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ందుబాటులో ఉండదు గనుక స్వయం ప్రభ ద్వారా విద్యామంత్రిత్వశాఖ 34 విద్యా సంబంధ చానల్స్ ద్వారా పాఠశాల, ఉన్నత విద్యాసంస్థల పాఠాలని బోధిస్తోంది.  పాఠ్యాంశాల ఆధారంగా రూపొందించిన వీడియో పాఠాలను ప్రతిరోజూ ముందుగా నిర్దేశించిన ప్రణాళికకు అనుగుణంగా ప్రసారం చేయటం వలన విద్యార్థులు తమ వెసులుబాటును బట్టి చూడవచ్చు. పాఠశాల విద్యకు ఒక్కో తరగతికి ఒక్కో చానల్ ప్రత్యేకంగా కేటాయించారు. ఇదే కాకుండా సమగ్రమైన ఈ-విద్య అన్ని రకాల డిజిటల్/ఆన్ లైన్/ఆన్ ఎయిర్ విద్యను ఏకీకృతం చేసి అందించటం వలన బహుళమార్గాలలో విద్యను అందుకునే వీలుంది. ఆ చొరవలలో కొన్ని ఇలా ఉన్నాయి:

                     i.జాతీయ అక్రెడిటేషన్ లో 3.26  స్కోరుతో మొదటి వంద రాంకుల్లో ఉన్న ఉన్నత విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం (యుజిసి) నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులూ లేకుండానే ఆన్ లైన్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. 

                    ii.సంప్రదాయ కోర్సులకు ఆన్ లైన్ పాఠ్యాంశాలను  రెగ్యులర్ డిగ్రీ కోర్సులలో  20% నుంచి 40% వరకు పెంచారు.

                  iii. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నాణ్యమైన ఈ-పాఠ్యాంసాలు అందించేందుకు వీలుగా జాతీయ డిజిటల్ మౌలికసదుపాయం  ’దీక్ష’  రూపకల్పన జరిగింది.  అన్ని తరగతులకూ పాఠ్యగ్రంథాలు అందుబాటులో ఉండేలా క్యు ఆర్ కోడ్ లో వాటిని చేర్చారు. ఆ విధంగా ఒకదేశం - ఒక డిజిటల్ వేదిక నినాదం సాకారమైంది.

                  iv. 1 నుంచి 12  తరగతులదాకా 12 చానల్స్ కు స్టడీ మెటీరియల్ కూడా ప్రయోగాత్మకంగా అందజేయబడింది. ఈ చానల్స్ ను పూర్తి స్థాయిలో నడపటానికి తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. 

                    v.రేడియో, కమ్యూనిటీ రేడియో, సిబిఎస్ఇ పాడ్ కాస్ట్-శిక్షావాణి లాంటివి విస్తృతంగా వాడుకుంటున్నారు.

                  vi. దృష్టి, వినికిడి లోపమున్నవారి కోసం ప్రత్యేకమైన ఈ-పాఠ్యాంశాలు రూపొందించి డిజిటల్ రూపంలో అందుకోగల సమాచార వ్యవస్థ ( డైసీ) ద్వారా, ఎన్ ఐ ఎస్ వెబ్ సైట్/ యుట్యూబ్ ద్వారా సంకేత భాషలో అందుబాటులో ఉంచారు.

బాధిత సమూహాలను సైతం పరోక్ష విద్యనుంచి దూరం కాకుందా చూసేందుకు ప్రభుత్వం పైన పేర్కొన్న చర్యలు తీసుకుంది.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ ’నిశాంక్’ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానం రూపంలో లోక్ సభకు ఈరోజు అందజేశారు. 

***


(రిలీజ్ ఐడి: 1654164) సందర్శకుల సూచీ సంఖ్య : : 139
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , Bengali , Punjabi