రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్-జపాన్ రక్షణ దళాల మధ్య సరఫరా, సేవల పరస్పర కేటాయింపులపై ఒప్పందం
Posted On:
10 SEP 2020 12:08PM by PIB Hyderabad
దేశ రక్షణకు సంబంధించి భారత్-జపాన్ మధ్య ఒప్పందం కుదిరింది. భారత సాయుధ దళాలు, జపాన్ ఆత్మరక్షణ దళాల మధ్య సరఫరాలు, సేవల పరస్పర కేటాయింపులపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత రక్షణ శాఖ కార్యదర్శి డా.అజయ్ కుమార్, జపాన్ రాయబారి సుజుకి సతోషి ఒప్పందంపై సంతకాలు చేశారు.
శిక్షణ కార్యక్రమాలు, ఐరాస శాంతి పరిరక్షణ కార్యాచరణలు, అంతర్జాతీయ మానవత సాయంతోపాటు పరస్పరం అంగీకారం కుదిరిన ఇతర కార్యకలాపాల్లో భారత్-జపాన్ పాల్గొన్న సందర్భాల్లో, రెండు దేశాల సాయుధ దళాల మధ్య పరస్పర సహకారం కోసం అవసరమైన విధానాలను ఈ ఒప్పందం రూపొందిస్తుంది.
రెండు దేశాల మధ్య అంతఃకార్యాచరణను కొత్త ఒప్పందం బలోపేతం చేస్తుంది. దీనివల్ల, భారత్-జపాన్ మధ్య 'ప్రత్యేక వ్యూహం&అంతర్జాతీయ భాగస్వామ్యం' కింద ద్వైపాక్షిక రక్షణ బంధం మరింత పెరుగుతుంది.
***
(Release ID: 1652959)
Visitor Counter : 236