రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద రూ. 10వేలకోట్లను
విడుదల చేసిన రహదారుల మంత్రిత్వ శాఖ
మరో రూ. 2,500కోట్లు చెల్లింపునకు కొనసాగుతున్న ప్రక్రియ
Posted On:
09 SEP 2020 2:04PM by PIB Hyderabad
కోవిడ్-19 వైరస్ వ్యాప్తి సంక్షోభం నేపథ్యంలో,..ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద. సరళీకృత చెల్లింపుల ప్రక్రియకు అనుగుణంగా రూ. 10,339 కోట్లను కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మరో రూ. 2,475కోట్ల మొత్తాన్ని త్వరలోనే విడుదల చేయడానికి ప్రక్రియ కొనసాగుతోంది.
సులభంగా వాణిజ్య నిర్వహణ జరిగేలా చూసేందుకు, రహదారుల రూపంలో నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాల నిర్మాణంపై భాగస్వామ్య వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద చెల్లింపుల ప్రక్రియను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సరళతరం చేసింది. చెప్పుకోదగిన కార్యక్రమాల ప్రాతపదికన కాకుండా, సరళీకృత ప్రక్రియ ద్వారా కంట్రాక్టర్లకు ప్రతినెలా చెల్లింపులు జరుగుతున్నాయి. దేశంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేందుకు ఈ ప్రక్రియ ఎంతో ప్రయోజనకరంగా ఉందని రుజువైంది.
కోవిడ్-19 వ్యాప్తి సంక్షోభం నేపథ్యంలో కాంట్రాక్టర్లకు, రాయితీదార్లకు సహాయంగా అనేక ప్యాకేజీలను రహదారుల మంత్రిత్వ శాఖ అందించింది. కాంట్రాక్ట్ నిబంధనలకు అనుగుణంగా ఇప్పటికే పూర్తయిన పనుల నిష్పత్తికి తగినట్టుగా రిటెన్షన్ మనీ మొత్తాన్ని చెల్లిస్తూ వస్తున్నారు. పైగా, కాంట్రాక్టర్లు పెట్టిన బిల్లులనుంచి రిటెన్షన్ మనీ మొత్తాన్ని ఆరునెలల వరకూ మినహాయించుకోకుండా చర్యలు తీసుకున్నారు. హైబ్రిడ్ ఆన్యుటీ మోడల్ (హెచ్.ఎ.ఎం.)/ నిర్మాణం, నిర్వహణ, బదిల (బి.ఒ.టి.) కాంట్రాక్టులకు పనితీరు గ్యారంటీ మొత్తాన్ని ప్రో-రాటా ప్రాతిపదికన చెల్లించారు. ఈ సహాయ ప్యాకేజీ కింద 1,155 ప్రాజెక్టులకు 1,253 దరఖాస్తులు అందగా, రూ. 3,527 కోట్లు విడుదలైంది. రూ. 189కోట్లకుపైగా విడుదలకు ప్రక్రియ కొనసాగుతోంది.
పూర్తి చేసిన పనికి కాంట్రాక్టకు నెలవారీ చెల్లింపు జరిపేందుకుగాను, షెడ్యూల్-హెచ్ లో తగిన సడలింపు ఇచ్చారు. ఇ.పి.సి./హెచ్.ఎ.ఎం. ప్యాకేజీ కాంట్రాక్ట్ నిబంధనల మేరకు ఈ చెల్లింపునకు ఆమోదం లభించింది. ఈ ప్యాకేజీ కింద 774 ప్రాజెక్టులకు గాను మొత్తం 863 దరఖాస్తులకు రూ. 6,526కోట్ల రూపాయలు విడుదలైంది. ఇంకా, రూ.2,241కోట్ల రూపాయలు చెల్లింపునకు ప్రక్రియ కొనసాగుతోంది.
పని ప్రదేశంలోని పరిస్థితులను బట్టి కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లకు, రాయితీదార్లకు వారి వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆరునెలల వరకూ గడువు పొడిగింపునకు అవకాశం ఇస్తున్నారు. ఈ ప్యాకేజీ కింద 196 ప్రాజెక్టులకుగాను మొత్తం 207 దరఖాస్తులకు 34కోట్ల రూపాయల సహాయం విడుదలైంది. ఇంకా 15కోట్ల రూపాయల విడుదలకు ప్రక్రియ కొనసాగుతోంది.
కొత్త కాంట్రాక్ట్ కుదిరినపుడు ఫర్ఫార్మెన్స్ సెక్యూరిటీ లేదా బ్యాంకు గ్యారంటీ సమర్పణ ప్రక్రియలో జాప్యం జరిగినపుడు విధించే పెనాల్టీని మాఫీ చేసే ప్యాకేజీకి సంబంధించి 2020 మార్చినుంచి సెప్టెంబర్ వరకూ 17 ప్రాజెక్టులకు గాను మొత్తం 17 దరఖాస్తులకు 9కోట్ల రూపాయలు విడుదలైంది.
పని ప్రాంతంలో పరిస్థితిని బట్టి కాంట్రాక్ట్ గడువు పొడిగింపు (ఐ.ఇ. లేదా ఎ.ఇ.) సదుపాయాన్ని 3 నెలలనుంచి 6 నెలల వరకూ అనుమతిస్తున్నారు. ఈ ప్యాకేజీ కింద 31 ప్రాజెక్టులకుగాను మొత్తం 31 దరఖాస్తులకు 2కోట్ల రూపాయలు విడుదలైంది. మరో కోటి రూపాయల చెల్లింపునకు ప్రక్రియ కొనసాగుతోంది.
నిర్మాణం, నిర్వహణ, బదిలీ/టి.ఒ.టి. రాయితీ: సి.ఒ.డి. ప్రక్రియకు ముందు నిర్మాణం, నిర్వహణ, బదిలీ (బి.ఒ.టి.) షరతుల నమూనాపై పనిచేసే కాంట్రాక్టర్లకు రాయితీ గడువు3నుంచి 4 నెలల వరకూ ఉండేది. పైగా,..వినియోగ చార్జీల వసూలులో నష్టం జరిగినపుడు దినసరిగా వసూలయ్యే సగటు ఫీజు మొత్తం 90 శాతంకంటే తక్కువగా ఉంటే, అందుకు అనుగుణంగా రాయితీ గడువును పొడిగిస్తారు. ఈ ప్యాకేజీకింది రెండు కోట్ల రూపాయల మొత్తానికి అందిన దరఖాస్తుకు సంబంధించి చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది.
జాతీయ రహదారులపై అమలులో ఉన్న టోల్ రుసుం కాంట్రాక్టులకు సంబంధించి, రుసుం వసూలులో నష్జం జరిగిపునడు కాంట్రాక్ట్ నిబంధనలకు అనుగుణంగా నష్టపరిహారం చెలిస్తారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన దరఖాస్తు ఇంకా పరిశీలనలో ఉంది.
మధ్యవర్తిత్వం ద్వారా బకాయిల చెల్లింపుతో సహా కాంట్రాక్టర్లకు సంబంధించిన పలు సమస్యల పరిష్కార ప్రక్రియను కూడా రహదారుల మంత్రిత్వ శాఖ చేపట్టింది. ఇందుకోసం రాజీ కుదిర్చేందుకు స్వతంత్ర ప్రాతిపదికపై పనిచేసే నిపుణులతో కూడిన కమిటీలను (సి.సి.ఐ.ఇ.లను) కూడా ఏర్పాటు చేశారు. తమ క్లెయిములను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు, చెల్లింపులను సత్వరం పొందేందుకు వీలుగా రాజీ ప్రక్రియకు ముందుకు రావాలని కాంట్రాక్టర్లందరికీ సూచించారు. ఈ ఏడాదిలో రూ. 14,248కోట్లకు సంబంధించి 47 కేసులను పరిష్కరించారు. మరో 59 కేసుల పరిష్కారానికి చర్చల ప్రక్రియ కొనసాగుతోంది.
***
(Release ID: 1652786)
Visitor Counter : 188