రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

కాంట్రాక్టర్ల చెల్లింపు వ్యవస్థను బలోపేతం చేయడానికి గట్టి చర్యలు ప్రారంభించిన ఎంఓఆర్టీహెచ్

స్వతంత్ర నిపుణులతో సయోధ్య కమిటీలు ఏర్పాటు; అన్ని సమస్యలకు స్నేహపూర్వక పరిష్కారం

ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద చెల్లింపు నిర్మాణం సరళీకృతం అయింది

Posted On: 08 SEP 2020 6:57PM by PIB Hyderabad

రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ పెద్ద ఎత్తున మధ్యవర్తిత్వం ద్వారా బకాయిలతో సహా  కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించడానికి సంకల్పించింది. ఇది సులభతర వ్యాపారానికి మార్గం వేయడమే కాకుండా, దేశంలో నాణ్యమైన రహదారి మౌలిక సదుపాయాలను నిర్మించడంలో వాటాదారుల విశ్వాసాన్ని పెంచడానికి ఉపకరిస్తుందని భావిస్తుంది. ఈ ప్రయోజనం కోసం స్వతంత్ర నిపుణులతో కూడిన సయోధ్య కమిటీ (సిసిఐఇలు)లను ఏర్పాటు చేశారు.  కాంట్రాక్టర్ల క్లైములను త్వరితగతిన పరిష్కరించడానికి, వారి చెల్లింపులను వెంటనే విడుదల చేయడానికి సంప్రదింపులు కోసం పిలిచి ఒక రాజీకి వస్తారు. రూ. 14,248 కోట్లకు సంబంధించిన 47 కేసులు ఈ ఏడాది పరిష్కరించారు. మరో 59 కేసులపై చర్చలు జరుగుతున్నాయి.

ఎన్హెచ్ఏఐ ఏడాదికి చేసే చెల్లింపులు (యాన్యుటీ) సుమారు. రూ. 5000 కోట్లుంటుంది. అన్ని యాన్యుటీల చెల్లింపులు సకాలంలో జరుగుతాయి. హెచ్ఏఎం ప్రాజెక్టులలో, పని ప్రగతిని బట్టి ఎన్హెచ్ఏఐ బిడ్ ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం నిర్మాణానికి మద్దతుగా అందిస్తుంది. వివిధ మైలురాళ్ళు దాటినప్పుడల్లా చెల్లింపులు వెంటనే జరుగుతాయి. బిఓటి (టోల్) ప్రాజెక్టుల కింద గ్రాంట్ / విజిఎఫ్ చెల్లింపులు రాయితీ ఒప్పందం నిబంధనల ప్రకారం జరుగుతాయి. అలాగే ఈ చెల్లింపులు భౌతికంగా ప్రాజెక్టు పురోగతి, ఈక్విటీ, రుణ సమీకరణ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.  ఎన్హెచ్ఏఐ వద్ద వాయిదాకి మీరిన బకాయలు పెండింగ్‌లో లేవు. బకాయిలను వెంటనే చెల్లించడానికి వివిధ వ్యవస్థలను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రారంభమైన మొదటి తొమ్మిది రోజులలో ప్రత్యేక చర్యలు చేపట్టడం వల్ల పదివేల కోట్ల రూపాయలకు పైగా వివిధ చెల్లింపుల కోసం పంపిణీ చేశారు. 

ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద చెల్లింపు విధానం మరింత సరళీకృతం చేశారు. మైలురాళ్లు దాటుతున్న కొలది దశలవారీ సాధించిన ప్రాతిపదికకు బదులుగా ప్రతి నెలా కాంట్రాక్టర్ల చెల్లింపులు జరుగుతున్నాయి. దేశంలో జాతీయ రహదారి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంది.

కోవిడ్-19 దృష్టాంతం కారణంగా మంత్రిత్వ శాఖ తన కాంట్రాక్టర్లు, రాయితీదారుల కోసం అనేక సహాయ ప్యాకేజీలను విస్తరించింది. కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్ ప్రకారం ఇప్పటికే అమలు చేసిన పనికి అనులోమానుపాతంలో నిలుపుదల డబ్బు (ఇది నిర్మాణ పూర్తయ్యే వరకు తీసుకున్న భద్రత నిధిలో భాగం) విడుదల చేయడం జరుగుతోంది. ఆరు నెలల కాలానికి ఈ నిలుపుదల డబ్బును కాంట్రాక్టర్ సమర్పించే బిల్లుల నుండి కోత పెట్టరు.హెచ్ఏఎం/బాట్ కాంట్రాక్టుల కోసం, పనితీరు హామీ ప్రో-రాటా ప్రాతిపదికన విడుదల చేస్తారు. ఈ ఉపశమనం కోసం 1155 ప్రాజెక్టుల కింద మొత్తం 1253 దరఖాస్తులలో రూ .3527 కోట్లు విడుదల చేయగా, ఇంకా రూ .189 కోట్లకు పైగా ప్రాసెస్ లో ఉంది.

క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి ఆరు నెలల వరకు కాంట్రాక్టు కింద కాంట్రాక్టర్ / రాయితీదారుడు బాధ్యతాయుతంగా చెల్లించాల్సిన దానికి గడువు పెంచారు. ఈ ఉపశమనం కోసం 196 ప్రాజెక్టుల కింద మొత్తం 207 దరఖాస్తులలో రూ .34 కోట్లు విడుదల చేయగా, రూ .15 కోట్లు ప్రాసెస్ లో  ఉన్నాయి.

ఈపీసీ/హామ్ కాంట్రాక్ట్ నెలలో దాని స్పెసిఫికేషన్ ప్రకారం కాంట్రాక్టర్‌కు నెలవారీ చెల్లింపును అందించే  షెడ్యూల్ హెచ్ లో ఉపశమనం కలిపించారు. ఈ ఉపశమనం కోసం 774 ప్రాజెక్టుల కింద మొత్తం 863 దరఖాస్తులలో రూ .6526 కోట్లు విడుదల చేయగా, రూ .2241 కోట్లకు పైగా ప్రాసెస్ జరుగుతోంది. 

ఎస్క్రో ఖాతా ద్వారా ఆమోదం పొందిన సబ్ కాంట్రాక్టర్‌కునేరుగా చెల్లింపు జరుగుతుంది. ఈ ఉపశమనం కోసం 19 ప్రాజెక్టుల కింద మొత్తం 21 దరఖాస్తులలో రూ .241 కోట్లు విడుదల చేయగా, రూ .27 కోట్లకు పైగా ప్రాసెస్ లో ఉన్నాయి. 

2020 మార్చి నుండి 2020 సెప్టెంబర్ వరకు ప్రవేశించిన కొత్త కాంట్రాక్టులో పనితీరు భద్రత / బ్యాంక్ గ్యారెంటీని సమర్పించడంలో ఆలస్యం చేసినందుకు జరిమానా మాఫీ చేయడం జరిగింది. ఈ ఉపశమనం కింద మొత్తం 17 దరఖాస్తులలో, తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేశారు. సైట్ లో పరిస్థితిని బట్టి 3 నుండి 6 నెలల వరకు కన్సల్టెంట్లకు అంటే IE / AE కి గడువు పెంచారు. ఈ ఉపశమనం కోసం సమాన సంఖ్యలో ప్రాజెక్టుల కింద మొత్తం 31 దరఖాస్తులలో, రెండు కోట్ల రూపాయలు విడుదల చేయగా, ఒక కోటి రూపాయలు ప్రాసెస్‌లో ఉన్నాయి. అన్ని జాతీయ రహదారి టోలింగ్ కాంట్రాక్టుల కోసం, రుసుము వసూలు (చెల్లింపులు) కు నష్టం కాంట్రాక్టు ప్రకారం భర్తీ చేస్తారు. ఈ ఉపశమనం కోసం ఒక దరఖాస్తు పరిశీలనలో ఉంది.

 

***



(Release ID: 1652472) Visitor Counter : 122


Read this release in: English , Urdu , Marathi , Hindi