సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

"మహమ్మారి సమయంలో సుపరిపాలనా పద్ధతులు" అనే అంశంపై 117 ఆశాజనక జిల్లాల కలెక్టర్ల కోసం నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్ నుద్దేశించి ప్రసంగించిన - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్.

కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆశాజనక జిల్లాల్లోని జిల్లా కలెక్టర్లు అనేక ఆశాజనకంకాని జిల్లాలను అధిగమించి పనిచేశారు : డాక్టర్ జితేంద్ర సింగ్.

ఆశాజనక జిల్లాలు అనే భావన భారతదేశ పాలన నమూనాలో టెక్టోనిక్ మార్పును సూచిస్తోంది : డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 04 SEP 2020 7:04PM by PIB Hyderabad

ఆశాజనక జిల్లాలలో మహమ్మారి సమయంలో సుపరిపాలన పద్ధతులపై ఈరోజు వెబినార్ ద్వారా నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్ లో, కేంద్ర సిబ్బంది, పి.జి, పింఛన్లు శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముగింపు ప్రసంగం చేశారు.  ఈ సందర్భంగా, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆశాజనక జిల్లాల్లోని జిల్లా కలెక్టర్లు అనేక ఆశాజనకంకాని జిల్లాలను అధిగమించి పనిచేశారని పేర్కొన్నారు.   ఆశాజనక జిల్లాల పనితీరు భారతీయ దేశం యొక్క స్థితిస్థాపకతను నిరూపించే అవకాశాన్ని సూచిస్తోందని ఆయన అన్నారు.  ఈ అధిక నాణ్యతతో కూడిన పనితీరుకు ఒక కారణం ఏమిటంటే, భారత ప్రభుత్వంలో సహాయ కార్యదర్శులుగా పనిచేసిన ఐ.ఎ.ఎస్. అధికారులు కేంద్ర ప్రభుత్వంలో వారి గురువుల నుండి శిక్షణ పొందారు.  మహమ్మారి ఉన్నప్పటికీ "ప్రదర్శన తగిన జాగ్రత్తలతో ముందుకు సాగాలి" , జె.ఈ.ఈ. / నీట్ / సి.ఎస్.ఈ. వంటి అనేక ప్రవేశ పరీక్షల నిర్వహణలో - ఇవన్నీ తెలియజేయబడ్డాయి అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రజల సామూహిక ప్రయత్నం వల్ల మాత్రమే భారతదేశం ఇతర దేశాల కంటే మహమ్మారిని బాగా ఎదుర్కోగలిగింది.  అభివృద్ధి సూచికలలో నిరంతర వృద్ధిని సాధించడానికి అనుగుణంగా దృష్టి పెట్టాలని ఆశాజనక జిల్లాల జిల్లా కలెక్టర్లను ఆయన కోరారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భావించిన ఆశాజనక జిల్లాల భావన, భారతదేశంలో ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం అనంతరం, పాలన పట్ల రాజకీయ విధానంలో ప్రధాన మార్పును సూచిస్తోందని, డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. పరిపాలన యొక్క అన్ని స్థాయిలలో పని సంస్కృతిలో పెద్ద మార్పును తీసుకురావడంతో పాటు,  అభివృద్ధి కార్యకలాపాల యొక్క మరింత శాస్త్రీయ మరియు లక్ష్యం అంచనాకు ఇది ఒక మార్పు అని ఆయన అన్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లోని ఆశాజనక జిల్లాల్లోని పాలన పద్ధతులపై, ఈ రోజు, ఒక నిర్దిష్ట సెషన్ ‌తో ఒక రోజు వర్క్‌షాప్‌లో ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఈ ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలు మరియు రైలు సేవలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగిందని, ఆయన పేర్కొన్నారు.  ఇంకా, ఈశాన్య రాష్ట్రాలు కరోనావైరస్ మహమ్మారి నిర్వహణలో ఒక నమూనాగా నిలిచాయి, త్రిపుర, మణిపూర్, సిక్కిం ప్రాంతాలు సుదీర్ఘకాలం కరోనావైరస్ లేకుండా ఉన్నాయి.  పి.పి.ఈ., కిట్లు, మాస్కులు, హ్యాండ్ శానిటైజర్ల అందుబాటు విషయంలో ఈశాన్య ప్రాంతం ఎప్పుడూ కొరతను ఎదుర్కోలేదు.  ఈ ఒకరోజు వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు, జాతీయ సుపరిపాలనా కేంద్రం, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియెన్స్ విభాగం మరియు ఎన్.‌ఐ.టి.ఐ. లను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు.

ముగింపు సదస్సు నుద్దేశించి, ఎన్.‌ఐ.టీ.ఐ. సి.ఈ.ఓ.  శ్రీ అమితాబ్ కాంత్, డి.ఏ.ఆర్.పి.జి. మరియు డి.పి.పి.డబ్ల్యూ. కార్యదర్శి డాక్టర్ కె. శివాజీ ప్రసంగించారు. శ్రీ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ,  ఆశాజనక జిల్లాల కార్యక్రమం కింద, భారతదేశంలోని వివిధ ప్రాంతాలు కలిసికట్టుగా సమస్యలను పరిష్కరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో హజారీబాగ్, గోల్ ‌పారా మరియు బంకా వంటి ఆశాజనక జిల్లాల విజయ గాథలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.  కోవిడ్ -19 మహమ్మారి సమయంలో, సి.పిజి.ఆర్.ఎమ్. ‌లతో స్టేట్ పోర్టళ్ళను ఏకీకృతం చేయడం, ఫిర్యాదుల నిర్వహణ సమయాన్ని తగ్గించడం మరియు ప్రతిస్పందన కోసం బ్యాక్ కాల్ సెంటర్లను నెలకొల్పడం వంటి సంస్కరణల్లో, డి.ఏ.ఆర్.పి.జి. గణనీయమైన ప్రగతి సాధించిందని డాక్టర్ కె. శివాజీ అభినందించారు.  ఇవన్నీ మహమ్మారి సమయంలో పౌరుని కష్టాలను తగ్గించాయని చెప్పారు. 

ఈ ఒక రోజు సమావేశంలో -  ఆరోగ్య రంగ పాలనలో ఉత్తమ పద్ధతులు, ఈ-పాలన; వ్యవసాయం మరియు జల వనరుల నిర్వహణ; ఈశాన్య రాష్ట్రాలు మరియు విద్య సంబంధమైన పాలన తో సహా ఐదు సాంకేతిక సదస్సులు జరిగాయి.  ఈ సదస్సుల్లో - రామనాథపురం, సిరోహి, నర్మదా, వాషిమ్, విరుధ్ నగర్,  నందూర్ ‌బార్, వయనాడ్, రాయచూర్, రాంచీ, నౌపాడా, బస్తర్, నోహ్, కాచర్, ఈస్ట్ గారో హిల్స్, ధాలై,  నమ్సాయ్, బరణ్, బంకా, విజయనగరం మరియు సుక్మా నుండి వచ్చిన 20 మంది జిల్లా కలెక్టర్లు, తమ తమ జిల్లాల్లో, కోవిడ్-19 మహమ్మారి ని కట్టడి చేయడంలో తమ అనుభవాలను తెలియజేశారు.  ఈ సదస్సులకు అధ్యక్షత వహించినవారిలో - డి.ఓ.ఎన్.ఈ.ఆర్. ప్రత్యేక కార్యదర్శి,  శ్రీ ఇందివర్ పాండే;  విద్య మరియు అక్షరాస్యత శాఖ మాజీ కార్యదర్శి, శ్రీ అనిల్ స్వరూప్; కర్ణాటక రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, డాక్టర్ షాలిని రజనీష్;  జల్ శక్తి మంత్రిత్వ శాఖ,  తాగునీరు మరియు పారిశుద్ధ్య విభాగం, అదనపు కార్యదర్శి (నీరు), శ్రీ భారత్ లాల్;  తమిళనాడు  ఈ -గవర్నెన్స్ అథారిటీ సి.ఈ.ఓ.  మరియు ఈ-గవర్నెన్స్  కమీషనర్ డాక్టర్ సంతోష్ మిశ్రా;  ఉన్నారు. ఇంకా, ఈ వర్క్ షాప్ లో - డి.ఏ.ఆర్.పి.జి; ఎన్.ఐ.టి.ఐ. తో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు, ఆశాజనక జిల్లాల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తున్న భారత ప్రభుత్వ సీనియర్ సివిల్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు, ఆశాజనక జిల్లాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా స్థాయి అధికారులు. పాల్గొన్నారు. 

డి.ఏ.ఆర్.పి.జి, అదనపు కార్యదర్శి, జాతీయ సుపరిపాలన కేంద్రం,  డైరెక్టర్ జనరల్,  శ్రీ వి.శ్రీనివాస్,  మాట్లాడుతూ, వర్క్‌ షాప్ నుండి వచ్చిన గొప్ప సందేశం ఏమిటంటే, ఆశాజనక జిల్లాలు సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రయోజనాలను పెంపొందించుకుని, మహమ్మారిపై పోరాడటానికి అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేశాయని, పేర్కొన్నారు. 

<><><>



(Release ID: 1651502) Visitor Counter : 104


Read this release in: English , Urdu , Hindi , Punjabi