రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మాస్కోలో జరిగిన ఎస్‌సీఓ, సీఎస్‌టీఓ, సీఐఎస్ సభ్య దేశాల రక్షణ మంత్రుల సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్

- ఎస్‌సీఓ ప్రాంతంలో శాంతి భ‌ద్ర‌త‌ల ఆవ‌శ్య‌క‌త‌ను నొక్కి చెప్పిన మంత్రి

- ఈ ప్రాంతం ప‌ర‌స్ప‌ర విశ్వాసం, స‌హకారం, దురాక్రమణలు లేకుండ‌టంతో పాటు అంతర్జాతీయ నియమాలు మరియు నిబంధనలను త‌గినట్టుగా గౌరవించే వాతావరణాన్ని కోరుకుంటోందన్న ర‌క్ష‌ణ మంత్రి

Posted On: 04 SEP 2020 5:03PM by PIB Hyderabad

“శాంతియుత, స్థిరమైన, సురక్షితమైన ఎస్‌సీవో ప్రాంత‌ స‌భ్య దేశాలు మొత్తం ప్రపంచ జనాభాలో 40 శాతానికి పైగా మందికి ఆవాసంగా ఉన్నాయి. ఈ ప్రాంత దేశాలు ‌ప‌ర‌స్ప‌ర విశ్వాసం, స‌హకారం, దురాక్రమణలు చేయ‌క‌పోవ‌డంతో పాటు వివిధ‌ అంతర్జాతీయ నియమ నిబంధనలను గౌరవించ‌డం, ప‌ర‌స్ప‌ర ఆస‌క్తుల ప‌ట్ల సున్నిత‌త్వంతో మెద‌ల‌డం, బేదాభిప్రాయాల విష‌యంలో త‌గిన విధంగా శాంతియుత ప‌రిష్కారంతో ముందుకు సాగాలి" అని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
మా ల‌క్ష్యం అంద‌రి భ్ర‌ద‌త మ‌రియు వృద్ధి..‌
ఈ రోజు మాస్కో న‌గ‌రంలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ), సామూహిక భద్రతా ఒప్పంద (సీఎస్‌టీఓ) మరియు కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సీఐఎస్) సభ్య దేశాల రక్షణ మంత్రుల సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. “మా ప్రధానమంత్రి వివిధ సందర్భంలో వెల్ల‌డించిన ఆలోచనను నేను ఈ సంద‌ర్భంగా మీ దృష్టికి తీసుకువ‌స్తూ విన్న‌వించేంది ఏమిటంటే.. మా లక్ష్యం ఈ ప్రాంతంలోని అందరి భద్రత మరియు వృద్ధి" అని అన్నారు. ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న వివిధ ప్ర‌మాదాల‌ను గురించి శ్రీ రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ, “సంప్రదాయ మరియు సంప్రదాయేతర స‌వాళ్ల‌ను ఎదుర్కోవటానికి మ‌న‌కు త‌గిన సంస్థాగత సామర్థ్యం అవసరం- మ‌రీ ముఖ్యంగా ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల రవాణాతో పాటుగా దేశాంత‌ర‌ నేరాలులాంటి సంప్ర‌దాయేత‌ర ప్ర‌మాదాలు ఎదుర్కొనేందుకు ఇది ఎంతో అవ‌స‌రం" అని అన్నారు. మీ అందరికీ తెలిసినట్లుగా, భారత్ ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో మరియు వ్యక్తీకరణలలో ఎలాంటి సందేహాలు లేకుండా ఖండిస్తుంది మరియు దాని ప్రతిపాదకుల చ‌ర్య‌ల‌ను ఖండిస్తుంది. ఎస్‌సీఓ ప్రాంతీయ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ (రాట్స్‌) కార్య‌కాలాపాల‌ను భారతదేశం ఎంత‌గానో గౌర‌విస్తోంది. సైబర్ డొమైన్‌లో రాడికలిజం మరియు ఉగ్రవాదం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి గాను ఇటీవల రాట్స్ చేసిన కృషిని మేము అభినందిస్తున్నాము. ఉగ్రవాద ప్రచారం, డి-రాడికలైజేషన్‌ను ఎదుర్కోవడానికి ఎస్సీఓ కౌన్సిల్ ఉగ్రవాద నిరోధక చర్యలను అవలంబించడం ఒక ముఖ్యమైన నిర్ణయం.”
పెర్షియన్ గల్ఫ్ ప్రాంత పరిస్థితులపై ఆందోళన..
పెర్షియన్ గల్ఫ్ ప్రాంత పరిస్థితులపై ర‌క్ష‌ణ‌ మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “భారత్‌ గల్ఫ్‌లోని అన్ని దేశాల‌ నాగరికత మరియు సంస్కృతి ప‌ట్ల‌ ముఖ్యమైన ఆసక్తులు మరియు సంబంధాలు క‌లిగి ఉన్నాయి. ఇవన్నీ మా భారతదేశానికి ప్రియమైన మరియు స్నేహపూర్వక దేశాలు. పరస్పర గౌరవం, సార్వభౌమాధికారం, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడంతో పాటుగా చ‌ర్చ‌ల‌ ద్వారా అభిప్రాయ‌బేధాల‌ పరిష్కరానికి గాను.. మేము ఈ ప్రాంతంలోని దేశాలకు పిలుపునిస్తున్నాము” అని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితి గురించి శ్రీ రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. "ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రతా పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఆఫ్ఘన్ నేతృత్వం, ఆఫ్ఘన్ యాజమాన్యంలోని మరియు ఆఫ్ఘన్ నియంత్రణలో ఉన్న సమగ్ర శాంతి ప్రక్రియ కోసం ప్రజలు మరియు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఉంటుంది. ఆఫ్ఘనిస్థాన్ ఎస్‌సీఓ కాంటాక్ట్ గ్రూప్ ఎస్‌సీఓ సభ్య దేశాల మ‌ధ్య‌న నోట్లను మార్పిడి చేయడానికి ఉపయోగపడుతుంది” అని అన్నారు. బహిరంగ, పారదర్శక, కలుపుకోలు, నియమాల ఆధారిత మరియు అంతర్జాతీయ చట్టాలతో కూడిన ప్రపంచ భద్రతా నిర్మాణ‌ పరిణామానికి భారతదేశం యొక్క నిబద్ధతను రక్ష‌ణ మంత్రి ఈ సంద‌ర్భంగా పునరుద్ఘాటించారు.
ర‌ష్యాకు కృత‌జ్ఞ‌త‌లు..
వార్షిక ఉగ్రవాద నిరోధక క‌స‌రత్తు ‘పీస్ మిషన్’ నిర్వహించినందుకు ర‌క్ష‌ణ‌ మంత్రి రష్యన్ ఫెడరేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ దళాల మధ్య నమ్మకాన్ని పెంపొందించడానికి మరియు అనుభవాన్ని పంచుకోవడానికి ఇది దోహదపడుతుంద‌ని అన్నారు. రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయిగు ఆహ్వానం మేరకు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 3-5 వరకు మాస్కో అధికారిక పర్యటనలో ఉన్నారు.

***



(Release ID: 1651439) Visitor Counter : 209