రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఎస్ఐఏఎం 60 వ వార్షిక సదస్సు ఉద్దేశించి ప్రసంగించిన గడ్కరీ ; ఉపాధి కల్పనలో ఆటో పరిశ్రమది బృహత్తర బాధ్యత అని చెప్పిన శ్రీ గడ్కరీ
Posted On:
04 SEP 2020 5:33PM by PIB Hyderabad
సమీప భవిష్యత్తులో రహదారి భద్రతా లక్ష్యాలను సాధించడంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఆ దిశగా చాలా పురోగతి సాధించిందని ఆయన అన్నారు. ఈ రోజు ఎస్ఐఏఎం 60 వ వార్షిక సదస్సులో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. వాహన తయారీదారులు వాహన భద్రతకు కీలకమైన నిబంధనలైన ఎబిఎస్, ఎయిర్‌బ్యాగులు, క్రాష్ నిబంధనలు, సీట్ బెల్ట్ హెచ్చరికలు, రివర్స్ పార్కింగ్ అసిస్ట్, విటిఎస్ మొదలైనవి అమలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ నిబంధనలు ప్రపంచ ఆటో పరిశ్రమతో సమానంగా మన దేశ పరిశ్రమ వచ్చిందని, భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ అసాధారణ సమన్వయం, నిబద్ధతతో ఇది సాధ్యమైందని శ్రీ గడ్కరీ అన్నారు.
దేశ జిడిపిలో అతిపెద్ద వాటా కలిగి , అత్యధిక సంఖ్యలో ఉపాధి ఉన్న రంగంగా, ప్రస్తుత కాలంలో ఈ పరిశ్రమ భుజస్కందాలపై చాలా ఆధారపడి ఉన్నదని మంత్రి అన్నారు. సమాజం, ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల కోసం పరిశ్రమల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రస్తుతానికి రోజుకు రహదారి నిర్మాణ రేటు సగటున 30 కి.మీ.గా ఉందని, అత్యధికంగా రోజుకు 40 కి.మీ హైవేలు ఉన్నాయని శ్రీ గడ్కరీ తెలియజేశారు. ఎక్స్‌ప్రెస్‌వేలు, రహదారుల నిర్మాణంలో భారీ వృద్ధి దిశగా ఉరకలు పెడుతున్న ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ భారతదేశానికి ఇప్పుడు ఉందని ఆయన అన్నారు.
వాహనాలను సురక్షితమైన చర్యలతో తయారుచేస్తేనే ప్రమాదాలు, మరణాలు గణనీయంగా తగ్గవని నొక్కిచెప్పిన శ్రీ గడ్కరీ, సరైన రహదారి నమూనాలు పూర్తి స్థాయిలో నియమనిబంధనలు అమలు చేయడం కూడా ముఖ్యమని అన్నారు. ఇందులో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సన్నద్ధం కావడం, భవిష్యత్తు కు అనువుగా సిద్ధంగా ఉండటం అవసరమని తెలిపారు. గమనం భవిష్యత్తు, మౌలిక సదుపాయాలతో అనుసంధానం కావాలని ఆయన అన్నారు. ఈ మేరకు, అన్ని హైవేలు / ఎక్స్‌ప్రెస్‌వేలను అధునాతన డ్రైవర్-అసిస్టెంట్ టెక్నాలజీల అమలుకు అనువైన సరిహద్దులు గల రోడ్లు, లేన్ గుర్తులతో తయారు చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ శతాబ్దం డిజిటల్, దానికి అనుసంధానమైన విషయాల తోనే ముడిపడి, జీవితాల్లో అంతర్భాగమైపోయాయని మంత్రి తెలిపారు. డిజిటలైజేషన్ ప్రభావాన్ని గుర్తించి, మోటారు వాహన సవరణ చట్టం 2019 ట్రాఫిక్ భద్రత, నియమాల అమలు కోసం డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రోత్సహించిందన్నారు. పరిశ్రమ సహకారంతో, ఫాస్ట్‌టాగ్‌తో ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ విజయవంతంగా అమలు అయిందని, వాహన్ పోర్టల్‌కు అనుసంధానించడంతో, ఫాస్ట్‌టాగ్ లు టోల్ క్రాసింగ్‌ల వద్ద సజావుగా సాగే పరిస్థితులు నెలకొన్నాయని శ్రీ గడ్కరీ చెప్పారు.
ఇప్పటికే అనుసంధానించబడిన వాహనాల కోణం నుండి మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ & ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల కోణం నుండి కూడా మౌలిక సదుపాయాల వృద్ధి, మెరుగుదలలను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచాలని ఆయన కోరారు, దేశవ్యాప్తంగా ఇథనాల్ ఇంధనం లభ్యతపై కూడా దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఈ వాహనాల ప్రవేశం పెరిగేకొద్దీ, ఛార్జింగ్ స్టేషన్లు, ఇంధన కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాల కోసం డిమాండ్ పెరుగుతుందని, ఆ అవసరాలను కూడా నెరవేర్చాల్సి ఉంటుందని అన్నారు. వివిధ ఇంధన ఎంపికల దశల వారీగా పరిచయం చేస్తూ భవిష్యత్ అవసరాలకు అనువుగా మౌలిక సదుపాయాలకు సహకరించే సమగ్ర ఇంధన విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు శ్రీ గడ్కరీ వెల్లడించారు.
*****
(Release ID: 1651381)
Visitor Counter : 137