ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భారతదేశ రక్షణ, భద్రత మరియు ప్రజల భద్రతకు హానికరమైన 118 మొబైల్ యాప్ లను ప్రభుత్వం నిషేధించింది

Posted On: 02 SEP 2020 5:26PM by PIB Hyderabad

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం,సెక్షన్ 69 ఎ కింద, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క సంబంధిత నిబంధనలతో చదవబడుతుంది (ప్రజల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడాన్ని నిరోధించే విధానం మరియు రక్షణ) నియమాలు 2009 మరియు బెదిరింపుల వల్ల ఉద్భవిస్తున్న స్వభావం దృష్ట్యా, 118 మొబైల్ యాప్ లను (అనుబంధం చూడండి), అందుబాటులో ఉన్న సమాచారం దృష్ట్యా, అవి, భారతదేశం యొక్క సార్వభౌమాధికారం, సమగ్రత, భారతదేశ రక్షణ, భద్రత మరియు ప్రజా భద్రతకు హాని కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న కారణంగా, వాటిని నిషేధించాలని, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.   

ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు వివిధ వనరుల నుండి, భారతదేశం వెలుపల ఉన్న సర్వర్ ‌లకు వినియోగదారుల డేటాను అనధికారికంగా దొంగిలించడం మరియు రహస్యంగా ప్రసారం చేయడం కోసం, ఆండ్రాయిడ్ మరియు ఐ.ఓ.ఎస్. ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న కొన్ని మొబైల్ యాప్ ల దుర్వినియోగం గురించి అనేక నివేదికలతో సహా, చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమాచార సంకలనం, జాతీయ భద్రత, భారత దేశ రక్షణకు విరుద్ధమైన అంశాల ద్వారా దాని మైనింగ్ మరియు ప్రొఫైలింగ్, చివరికి భారత దేశ సార్వభౌమత్వాన్నీ, సమగ్రతను ప్రభావితం చేస్తుంది. ఇది చాలా లోతైన మరియు తక్షణం ఆందోళన కలిగించేది,  అత్యవసర చర్యలు తీసుకోవలసిన అంశం. 

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన భారత ‌సైబర్ నేరాల సమన్వయ కేంద్రం కూడా ఈ హానికరమైన యాప్ లను నిరోధించడానికి సమగ్ర సిఫార్సును పంపింది.  అదేవిధంగా, భారత పార్లమెంటు వెలుపల మరియు లోపల వివిధ ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన ఇలాంటి ద్వైపాక్షిక ఆందోళనలు కూడా చాలా ఉన్నాయి.  భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి మరియు మన పౌరుల గోప్యతకు హాని కలిగించే యాప్ లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా గట్టిగా కోరుతున్నారు. 

వీటి ఆధారంగా మరియు ఇటువంటి సమాచారాన్ని పంపిన ఇటీవలి విశ్వసనీయ పోస్టులను స్వీకరించిన తరువాత, కోరిన అనుమతులు,  పొందుపరచిన కార్యాచరణతో పాటు పైన పేర్కొన్న యాప్ లు సమాచారాన్ని చేరవేయడానికి అనుసరిస్తున్న పద్ధతులు తీవ్రమైన ఆందోళనలను కలిగించాయి.  ఈ యాప్ లు డేటాను రహస్యంగా సేకరించి పంచుతున్నాయి, ఈ విధంగా వ్యక్తిగత డేటా మరియు వినియోగదారుల సమాచారాన్ని పంచుకోవడంతో, దేశ భద్రతకు తీవ్రమైన ముప్పు కలుగుతోంది. 

 

 

 

భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భారతదేశ రక్షణ, భద్రత కోసం,  మొబైల్ ఫోన్ల లోనూ, మొబైల్ కాని ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న పరికరాల్లో ఉపయోగించే కొన్ని యాప్‌ల వాడకాన్ని నిరోధించాలని, తనకు గల సార్వభౌమ అధికారాలతో, భారత ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ యాప్ ల వివరాలను జత చేసిన జాబితాలో పేర్కొనడం జరిగింది. 

కోట్లాది మంది భారతీయ మొబైల్ మరియు ఇంటర్నెట్ వినియోగదారుల ప్రయోజనాలను ఈ చర్య పరిరక్షిస్తుంది. భారతీయ సైబర్‌స్పేస్ భద్రత, రక్షణ మరియు సార్వభౌమత్వాన్ని నిర్ధారించడాన్ని లక్ష్యంగా చేసుకుని, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

*****


(Release ID: 1650821) Visitor Counter : 987