ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఎమ్.డి.ఓ.ఎన్.ఈ.ఆర్. సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర.

బుట్టలు, బొగ్గు, అగర్ బత్తి తయారీ వంటి సంస్థలలో, జమ్మూ, కత్రా మరియు సాంబాలోని వెదురు క్లస్టర్లు 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి : జితేంద్ర సింగ్


జమ్మూలో వెదురు ఇండస్ట్రియల్ పార్కు మరియు వెదురు శిక్షణా కేంద్రం కూడా ఏర్పాటు కానున్నాయి.

Posted On: 28 AUG 2020 5:28PM by PIB Hyderabad

కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డి.ఓ.ఎన్.ఈ.ఆర్) శాఖ సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి,  డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, వెదురు బుట్టలు, అగర్ బత్తి, వెదురు బొగ్గు తయారీ కోసం జమ్మూ, కత్రా, సాంబా ప్రాంతాల్లో మూడు వెదురు సమూహాలను అభివృద్ధి చేయనున్నట్లు, చెప్పారు.  ఇది సుమారు 25 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.  వీటితో పాటు, జమ్మూ సమీపంలోని ఘాటి వద్ద ఒక మెగా వెదురు పారిశ్రామిక పార్కు మరియు వెదురు సాంకేతిక శిక్షణా కేంద్రం ఏర్పాటు కానున్నాయి.  జమ్మూ, కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క పరిపాలనా విభాగం స్థలాన్ని కేటాయించిన రెండు సంవత్సరాలలోపు, ఈ ప్రాంతంలో వీటిని నెలకొల్పుతారు.  అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తరువాత జమ్మూ-కశ్మీర్‌లోని వెదురు రంగంలో మౌలిక సదుపాయాల పెంపు, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి తీసుకోవలసిన తదుపరి చర్యలపై డి.ఓ.ఎన్.ఈ.ఆర్. మంత్రిత్వ శాఖ సమీక్షా సమావేశంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇది రాబోయే రోజుల్లో, ప్రధాన ప్రాధాన్యతగా అనుసరించబడుతుందని పేర్కొన్నారు. 

జమ్మూ-కశ్మీర్ మరియు లడఖ్ అంతటా భారీ స్థాయిలో వెదురు నిల్వలు ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. వాటిని ఎవరూ గుర్తించడం లేదనీ, ఎక్కువగా ఉపయోగించటం లేదనీ, అని చెప్పారు.  కొత్తగా సృష్టించిన కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ-కశ్మీర్‌లోని అన్ని మంత్రిత్వ శాఖలకు చెందిన మంచి పద్ధతులను ప్రతిబింబించేలా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా,  కేన్ మరియు వెదురు సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం (సి.బి.టి.సి) ద్వారా డి.ఓ.ఎన్.ఈ.ఆర్. మంత్రిత్వ శాఖ కు చెందిన ఈశాన్య మండలి కూడా జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వ సహకారంతో, కార్యశాలతో కూడిన ప్రదర్శన రూపంలో, జమ్మూ-కశ్మీర్ లోని వెదురు రంగంలో సాంకేతిక పరిజ్ఞానం మరియు అనుభవాలను, జమ్మూలోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్ 2020 జనవరి, 11, 12 తేదీలలో స్వీకరించిందని, ఆయన తెలియజేశారు. 

జమ్మూ, సాంబా మరియు కథువా ప్రాంతాలలో వెదురు సాగు ప్రాంతాలు గణనీయంగా ఉండటంపై కార్యశాల దృష్టి పెట్టిందనీ, వెదురు ఆధారిత సూక్ష్మ స్థాయి సంస్థలు, వ్యవస్థాపకులు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నారని మంత్రి చెప్పారు.  ఈ నేపథ్యంలో, కేన్ మరియు వెదురు టెక్నాలజీ పార్కులు, కేన్ మరియు వెదురు పారిశ్రామిక పార్కులు, ఎఫ్.పి.ఓ.,  బి.ఓ.టి. (బిల్ట్-ఆపరేట్-ట్రాన్స్ఫర్), టర్న్‌ కీ ప్రాతిపదికన క్లస్టర్లు, హైటెక్ నర్సరీలను వారి నిధుల మద్దతుతో ఏర్పాటు చేయడానికి, ఉమ్మడి సదుపాయాల కేంద్రాలు, సి.బి.టి.సి. సాంకేతిక సహకారాన్నీ, జమ్మూ-కశ్మీర్ (కేంద్ర పాలిత ప్రాంతం) ప్రభుత్వ భాగస్వామ్యాన్నీ పరిస్థితులకు అనుగుణంగా త్వరలో తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు.

త్వరలో మంత్రిత్వ శాఖ బృందం జమ్మూను సందర్శించి, ఈ ప్రాంతంలో వెదురు పెంపకం కోసం క్షేత్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  ఈశాన్య రాష్ట్రాల అనుభవం జమ్మూ, కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని కళాకారులకు వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకోడానికీ, ఈ ప్రాంతంలో పండించిన వెదురును వాణిజ్యపరంగా పూర్తిగా వినియోగించుకోడానికీ తోడ్పడుతుందని ఆయన చెప్పారు. 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, చివరికి, వెదురు తక్కువ ఖర్చుతో కూడిన గృహాల నిర్మాణానికీ, ఇతర నిర్మాణ సామగ్రిగా ఉపయోగించబడుతోందని చెప్పారు. ఈ విషయంలో, రాబోయే సంవత్సరాలలో, దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెదురు అవగాహనా శిబిరాలు నిర్వహిస్తామని, ఆయన తెలియజేశారు. 

ఈ సమావేశంలో - డి.ఓ.ఎన్.ఈ.ఆర్. మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఇందర్ ‌జిత్ సింగ్;  ప్రత్యేక కార్యదర్శి శ్రీ ఇందేవర్ పాండే;  ఎన్.ఈ.సి. కార్యదర్శి, శ్రీ మోజెస్ కే. చలై;  సి.బి.టి.సి. మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ శైలేంద్ర చౌదరి తో పాటు విభాగానికి చెందిన ఇతర సీనియర్ అధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు. 

<><><><>



(Release ID: 1649391) Visitor Counter : 174