రక్షణ మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్ కింద తీసుకుంటున్న చర్యలను రక్షణ పరిశ్రమ ఔట్‌రీచ్ వెబినార్‌లో ప్రముఖంగా ప్రస్తావించిన రక్షణమంత్రి శ్రీరాజ్‌నాథ్ సింగ్
Posted On:
27 AUG 2020 7:10PM by PIB Hyderabad
సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫాక్చరర్స్ (ఎస్.ఐ.డి.ఎం), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), డిపార్టమెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ (డిడిపి), రక్షణమంత్రిత్వశాఖ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఔట్ రీచ్ వెబినార్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్‌సింగ్ ఇటీవల ప్రకటించిన రక్షణ ఉత్పత్తులు, ఎగుమతలు ప్రోత్సాహక విధానానికి సంబంధించిన ముఖ్యాంశాలను ప్రముఖంగా పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 మే 12న 20 లక్షల కోట్ల రూపాయల మేరకు కోవిడ్ -19 సంబంధిత ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించే సందర్భంలో , రక్షణ ఉత్పత్తిలో స్వావలంబన సాధించేందుకు ఆత్మనిర్భర్‌భారత్ అభియాన్‌కు పిలుపునిచ్చారు. 2020 జూన్ 2 వ తేదీన ప్రధాన మంత్రి ఇందుకు సంబంధించి తన ఆలోచనలను వివరించారు. ఇందులో ఆత్మనిర్భర్ కు సంబంధించి ఐదు ముఖ్య అంగాలను గుర్తించారు. అవి ఆర్ధికరంగం, మౌలికసదుపాయాలు, వ్యవస్థలు, చైతన్యవంతమైన ప్రజలు, డిమాండ్ .
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కీలకమైన రంగంగా రక్షణ రంగాన్ని ఇప్పటికే గుర్తించారు. ఈ రంగంలో తక్షణ పరివర్తన అవసరం ఉంది. రాగల ఐదు సంవత్సరాలలో రక్షణ రంగ పరికరాలలో నికర ఎగుమతిదారుగా భారత్ ఎదిగి, 5 బిలియన్ అమెరికన్ డాలర్ల ( 35 , 0000 కోట్లరూపాయల) మేరకు ఎగుమతి సంబంధ లక్ష్యాలను సాధించాలన్నది తన ఆలోచన అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు.ఈ దిశగా , ఉత్పత్తి, ఎగుమతి ప్రోత్సాహక ముసాయిదా విధానాన్ని రూపొందించారు. దీనిని పబ్లిక్ డొమైన్‌లో ఉంచి వివిధ స్టేక్ హోల్డర్ల నుంచి సలహాలు, సూచనలు కోరారు.
ఉత్పత్తి , ఎగుమతుల ప్రోత్సాహక విధానం ముసాయిదా, సాయుధ దళాల అవసరాలను మరింతగా రక్షణ రంగ తయారీ పరిశ్రమకు తెలిసేట్టు చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ విధానం, ఎయిరో ఇంజిన్ కాంప్లెక్సు ఏర్పాటుకు , అలాగే నిర్వహణ, రిపెయిర్, ఓవర్‌హాల్ (ఎం.ఆర్.ఒ), కీలక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టిపెడుతుంది., ఈ విధానం కింద ఎగుమతుల లక్ష్యం, రెవిన్యూలో లో 25 శాతంగా నిర్ణయించారు. 2025 నాటికి ఈ విధానం 1.75 లక్షల కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది.
రక్షణ తయారీ రంగంలో ఆత్మనిర్భర భారత్‌ను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా 52,000 కోట్ల రూపాయల బడ్జెట్‌ను దేశీయ వెండర్ల నుంచి ప్రొక్యూర్‌మెంట్‌కు పక్కన పెట్టారు..
రక్షణ మంత్రిత్వశాఖ పై మాట్లాడుతూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి 101 రక్షణ రంగ ఉత్పత్తులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచన మేరకు , నెగటివ్ జాబితాలో ఉంచినట్టు తెలిపారు. “కొంతకాలం తర్వాత ఈ ఐటమ్‌లను ఇతర దేశాలనుంచి సేకరించరు. రక్షణ రంగ పరివర్తనకు ఈ జాబితా తొలి అడుగు.ఈ 101 ఉత్పత్తుల జాబితాలో స్వల్ప విడిభాగాలే కాకుండా యుద్ధంలో ఉపకరించే భారీ ఆయుధాలు, సమీకృత ప్లాట్‌ఫారంలు , పోరాట వాహనాలు, ఉన్నాయి. ఈ జాబితా ఒక ప్రారంభం మాత్రమే. దీనితో రాగల రోజులలో 1.40 లక్షల కోట్ల రూపాయల రక్షణ ఉత్పత్తులను దేశీయంగా నే కొనుగోలు చేయనున్నారు.”
రక్షణరంగంలో స్వావలంబనను ప్రోత్సహించేందుకు పలు విధానపరమైన సంస్కరణలు తీసుకువచ్చినట్టు రక్షణ మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో ఆటోమేటిక్ రూట్ ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74 శాతానికి పరిమితం చేయడం , ఉత్తరప్రదేశ్, తమిళనాడులలో రక్షణ కారిడార్ల ఏర్పాటు , పెట్టుబడులు, సరళీకృత పారిశ్రామిక లైసెన్సు పాలనా విధానం, ఇన్వెస్టర్ల సమస్యల పరిష్కరానికి రక్షణ ఇన్వెస్టర్ సెల్ ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి.
స్వావలంబన అనేది మన విశ్వాసం, బలానికి మరో రూపమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ఐదు ఐ లు అంటే ఉద్దేశం, చేరిక, పెట్టుబడి, మౌలిక సదుపాయాలు ,ఆవిష్కరణ ద్వారామనం మన బలాన్ని పెంచుకునే దిశగా చర్యలు తీసుకున్నాం. వీటి ఫలితాలు మనకు కనిపించడం మొదలు పెట్టాయి అని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.
స్వావలంబన సాధించాలని దేశప్రజలకు గల ఆకాంక్షలను ప్రస్తావిస్తూ రక్షణ మంత్రి, స్వావలంబన స్ఫూర్తి మన సమాజంలో, విద్యలో, మన విలువలలో ఉంటూ వచ్చింది. ఇది మన భాగస్వామిగా ఉంటూ వచ్చింది. ఇది మన సంస్కృతి నుంచి ఆధునిక కాలం వరకూ ఉంటూ వచ్చింది.ఇది వేదాల నుంచి వివేకానందుడి వరకు , గీత నుంచి గాంధీజీ వరకు ఉపనిషత్ నుంచి ఉపాధ్యాయ(దీన్ దయాళ్)జి వరకు ఉంటూ వచ్చింది. ప్రతి ఒక్కరూ, ప్రముఖులు, లేక మన ప్రభుత్వాలు తమతమ మార్గంలో స్వావలంబన ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది. అయితే ఇటీవలి కాలంలో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు అయిన ఆత్మనిర్భర్ భారత్ పై పెట్టిన ప్రత్యేక దృష్టి మున్నెన్నడూ చూడనటువంటిది.
ఈ సమావేశంలో పాల్గొన్న వారు వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రక్షణ మంత్రి, ఆర్డినెన్సు ఫ్యాక్టరీ బోర్డు (ఒఎఫ్‌బి) కార్పొరేటైజేషన్ ను ఏడాదిలో పూర్తి చేయనున్నట్టు తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రేదేశ్, తమిళనాడులలోని రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లు రాగల ఐదు సంవత్సరాలలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
రక్షణ రంగ సేకరణ ప్రక్రియలో ప్రవేశ పెట్టిన పలు సంస్కరణలపై పరిశ్రమ ప్రతినిధులు ఈ సమావేశంలో పలు వివరణలు కోరారు. ఆఫ్‌సెట్ ప్రొవిజన్లు, రిజర్వేషన్ ఆఫ్ ఐటమ్లు, ఎం.ఎస్.ఎం.ఇల నుంచి ప్రొక్యూర్‌మెంట్, ఇండియన్ వెండర్ అన్నదానికి నిర్వచనం వంటి వాటిపై వారు వివరణలు అడిగి తెలుసుకున్నారు.
ప్రశ్నలు సమాధానల సెషన్ అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ వెబినార్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈరోజు జరిగిన వెబినార్, పరిశ్రమ వర్గాలను చేరుకునేందుకు వేసిన మరో ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఇది పరిశ్రమ ఆకాంక్షలు, సమర్ధతకు అనుగుణంగా ఉభయులకూ ప్రయోజనకరంగా , ఆచరణాత్మక మార్గాన్ని సూచించేందుకు ఉద్దేశించినది.
ఫిక్కి వెబినార్ లో త్రివిధ దళాలు, రక్షణ మంత్రిత్వశాఖ, డి.ఆర్.డి.ఒ, పరిశ్రమ వర్గాలకు చెందిన వారు పాల్గొన్నారు. వీరు ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అబివృద్ధిచేసే వ్యూహాలను బలోపేతం చేయడం గురించి చర్చించారు.
స్టేక్ హోల్డర్లు, ఎంఎస్‌ఎంఇలు, టైర్- II ,టైర్ -3 సరఫరాదారులు, స్టార్ట్-అప్‌లు, ఆవిష్కర్తలుగా విద్యాసంస్థలు , అగ్రిగేటర్లుగా , టెస్టింగ్ , క్వాలిటీ అస్యూరెన్స్ సర్వీసు ప్రొవైడర్లుగా పరిశ్రమ వర్గాలు ఉంటూ వారి వారి పాత్రలను చక్కగా నిర్వచించి అందుకు అనుగుణంగా సానుకూల వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు ఈ వెబినార్, ఇండియాను అంతర్జాతీయ సరఫరా చెయిన్‌లో అంతర్భాగంగా చేస్తూ ఆవిష్కరణలను ప్రోత్సహించింది.అలాగే ఉన్నత శ్రేణి రక్షణ పరికరాల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సహించింది.
డిఆర్‌డిఓ , ప్రైవేట్ పరిశ్రమల వద్ద ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించడం ద్వారా ప్రపంచ స్థాయి పరీక్ష, మూల్యాంకన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ఈ సమావేశం నొక్కి చెప్పింది. దేశీయ పరికరాల తయారీకి సహాయపడటానికి సానుకూల వాతావరణం ఏర్పరిచే మార్గాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు.
ఛీఫ్ ఆఫ్ డిఫెన్సు స్టాఫ్, డిపార్టమెంట్ ఆఫ్ మిలటరీ అఫైర్సు కార్యదర్శి, బిపిన్ రావత్, ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ జనరల్ ఎం.ఎం. నారావనే, ఛీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్, ఛీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్ బహదురియా, ప్రభుత్వానికి ముఖ్య శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ విజయరాఘవన్, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, సెక్రటరీ (డిఫెన్స్ ఉత్పత్తులు) శ్రీ రాజ్ కుమార్, డిపార్టమెంట్ ఆఫ్ డిఫెన్సు ఆర్.అండ్ డి సెక్రటరీ, డి.ఆర్.డి.ఒ ఛైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి, ఎస్.ఐ.డి.ఎం అధ్యక్షుడు శ్రీ జయంత్ డి పాటిల్, ఫిక్కి అధ్యక్షులు శ్రీమతి సంగీతా రెడ్డి, ఎస్.ఐ.డి.ఎం మాజీ అధ్యక్షుడు శ్రీ బాబా ఎన్. కల్యాణి, ఫిక్కి డిఫెన్స్ కమిటీ ఛైర్మన్ ఎస్.పి.శుక్లా, రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ సివిల్ మిలిటరీ అధికారులు, ఆర్డినెన్సు బోర్డు, డిపిఎస్.యులు, ప్రైవేటు పరిశ్రమల వారు ఈవెబినార్‌లో పాల్గొన్నారు.దీనిని పరిశ్రమకు చెందినవారు, విద్యాసంస్థలకు చెందిన వారు సుమారు 2వేల మంది వీక్షించారు.
***
(Release ID: 1649219)
Visitor Counter : 248