వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సహకారం, భాగస్వామ్యం, నిబద్ధత భారతదేశం మరియు ఆసియాన్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి మార్గనిర్దేశం చేస్తున్నాయి : శ్రీ పీయూష్ గోయల్.
భారతదేశం ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా తనను తాను ప్రదర్శించుకుంది, ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో : శ్రీ గోయల్.
प्रविष्टि तिथि:
27 AUG 2020 4:33PM by PIB Hyderabad
భారతదేశం మరియు ఆసియాన్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి, 3 'సి' లు- సహకారం, భాగస్వామ్యం మరియు నిబద్ధత, మార్గనిర్దేశం చేస్తాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు చెప్పారు. ఆసియాన్-ఇండియా వాణిజ్య మండలి ఆన్ లైన్ సమావేశంలో శ్రీ గోయల్ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి కాలం భారతదేశం ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా తనను తాను నిరూపించుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించిందని, ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో అందించిందని పేర్కొన్నారు. ఆసియాన్ ప్రాంతానికి శ్రీ గోయల్ స్నేహ హస్తాన్ని అందిస్తూ, ఇది లోతైన మరియు విలువైన భాగస్వామ్యం మరియు పురోగతితో కూడిన భాగస్వామ్యం అని అభివర్ణించారు.
ఆత్మ నిర్భర్ భారత్ స్వావలంబన గల దేశాన్ని సూచిస్తుంది, ఇది బలం మరియు విశ్వాసం యొక్క స్థానం నుండి మరియు సమాన మరియు న్యాయమైన నిబంధనలతో ప్రపంచంతో నిమగ్నమవ్వడానికి సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల భారతదేశం మరియు ఆసియాన్ పూర్తి వాణిజ్య సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేకపోయాయనీ, అయితే, వాణిజ్యాన్ని విస్తరించడానికి, అన్ని దేశాలు మరియు వ్యాపారాల సమస్యలను పరిష్కరించడానికి మరియు తేడాలను సరిదిద్దడానికీ, మాతృకను తెరవడానికి ఇది అనువైన సమయమని ఆయన తెలియజేశారు. వ్యాపారాల ద్వారా భారతదేశ స్నేహాన్ని మరియు భాగస్వామ్యాన్ని ఆసియాన్‌కు ఆయన విస్తరించారు. తద్వారా భాగస్వాములిద్దరూ కలిసి విజయవంతం కాగలరు, భవిష్యత్తును భద్రపరచగలరు, కలిసి పనిచేయగలరు, శ్రేయస్సు సాధించగలరు, 300 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని సాధించగలరు. వ్యాపార మండలి సమావేశం ఆందోళనలు మరియు ఉత్తమ పద్ధతులను చర్చించడానికి, ఆలోచనలను పంచుకోవడానికి మరియు సమస్యలను పరిష్కరించుకోడానికీ ఒక మంచి వేదిక అని శ్రీ గోయల్ అన్నారు.
మహమ్మారి ప్రారంభ రోజుల్లో, కోవిడ్ -19 తో పోరాడవలసిన అవసరాల కోసం భారతదేశం ప్రపంచ దేశాలను సహాయం కోరింది, అయితే ప్రతి ఒక్కరూ తమ సొంత అవసరాల కోసం ఆరాటపడుతున్నందున, భారతదేశానికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, శ్రీ గోయల్ పేర్కొన్నారు. కానీ, మరోవైపు, ఔషధాలను అందించగల సామర్థ్యంతో భారతదేశం ప్రపంచానికి ఫార్మసీగా పనిచేసింది. ప్రపంచంలోని 150 కి పైగా దేశాలకు, ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి, ముఖ్యంగా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు మేము మందులు సరఫరా చేసాము. ప్రారంభంలో కొన్ని ఆంక్షలు విధించినప్పటికీ, పేద దేశాలకు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలనే గొప్ప ఉద్దేశ్యంతోనే ఇది జరిగింది. ఇవన్నీ భారతదేశం స్థితిస్థాపకంగా ఉన్న దేశం, విశ్వసనీయ భాగస్వామి మరియు నిజంగా స్నేహితుడు అని ప్రపంచానికి చూపించింది.
పి.పి.ఇ.లు; మాస్కులు తయారు చేయడానికి దేశం తగిన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసిందనీ, మా పరీక్షా సామర్థ్యాలను రోజుకు 1000 లోపు నుండి రోజుకు మిలియన్ కు పైగా పెంచామనీ, శ్రీ గోయల్ చెప్పారు. “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మేము స్వయం సమృద్ధిగా ఉన్నాము. ఈ కాలంలో, భారతీయులు సామాజిక దూరాన్ని కొనసాగించడానికి, వ్యక్తిగత పరిశుభ్రతను తగినంతగా చూసుకోవటానికి, అన్ని సమయాల్లో మాస్కును ధరించడానికి మరియు సన్నిహితులను జాగ్రత్తగా సంరక్షించుకోడానికీ నిబద్ధత మరియు స్పృహను అభివృద్ధి చేసుకున్నారు. ” అని, మంత్రి వివరించారు. భారతదేశం తన స్థితిస్థాపకత, సమస్యలను అధిగమించే సామర్థ్యాన్ని ప్రదర్శించిందనీ, మా సమిష్టి కృషి జీవితాలను, జీవనోపాధిని కాపాడుకోగలదని ఆయన అన్నారు. ప్రాణాలను కాపాడటానికి మేము కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేసాము, ఆపై జీవనోపాధి సమస్యలను జాగ్రత్తగా చూసుకోవటానికి త్వరితగతిన అన్ లాక్ డౌన్ ఉండేలా చూసుకున్నాము, అని ఆయన పేర్కొన్నారు.
*****
(रिलीज़ आईडी: 1649008)
आगंतुक पटल : 302