శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
"ఒక బలమైన వాతావరణ విపత్తు యాజమాన్య విధానం దేశాన్ని ప్రభావితం చేసే వివిధ వాతావరణ మార్పుల నష్టాలను నిర్ణయించడానికి దేశవ్యాప్తంగా బహుళ-స్థాయి విధానాన్ని కోరుతుంది, అదే సమయంలో ఈ విపత్తు వల్ల కలిగే నష్టం మరియు హాని గురించి విస్తృతమైన అవగాహనను కల్పిస్తుంది" : డాక్టర్ హర్ష వర్ధన్.
"స్వావలంబన వైపు మన ప్రయాణానికి దోహదం చేసే విపత్తు స్థితిస్థాపకత మరియు స్థిరత్వాన్ని పెంపొందించడంలో సహాయపడటానికి వాతావరణ అనుకూల ప్రణాళికలో శాస్త్ర, సాంకేతికతకు కీలక పాత్ర ఉంది" --- డాక్టర్ హర్ష వర్ధన్.
అనుభవాలు, పాఠాలు, అంతరాలతో పాటు సాంప్రదాయ, స్థానిక విజ్ఞాన శాస్త్రం మరియు వాటిని అభివృద్ధి చేసే సంస్థల పాత్రతో సహా, ఎస్. & టి. విభాగాలు, ఆవిష్కరణల శ్రేణిని ఉపయోగించుకునే అవకాశాలపై చర్చలు మరియు సంభాషణల ద్వారా సమగ్ర ప్రణాళిక, అభివృద్ధి లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది.
"భారతదేశం వాతావరణ మార్పు సమస్యలో భాగం కాదు, కానీ పరిష్కారంలో భాగం కావాలి" : ప్రొఫెసర్ అశుతోష్ శర్మ
Posted On:
26 AUG 2020 7:27PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర, సాంకేతికత, భూ విజ్ఞానం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు మాట్లాడుతూ, "ఒక బలమైన వాతావరణ విపత్తు యాజమాన్య విధానం దేశాన్ని ప్రభావితం చేసే వివిధ వాతావరణ మార్పుల నష్టాలను నిర్ణయించడానికి దేశవ్యాప్తంగా (జాతీయ, ఉప-జాతీయ, ప్రాంతీయ, స్థానిక) బహుళ-స్థాయి విధానాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది, కోరుతుంది, అయితే, ఈ విపత్తు వల్ల కలిగే నష్టం మరియు హాని గురించి విస్తృతమైన అవగాహనను కల్పిస్తుంది" అని పేర్కొన్నారు. “వాతావరణ విపత్తు యాజమాన్యం కోసం ఎస్. & టి. పరిశోధన-విధానం-ఆచరణల సమన్వయం" అనే అంశంపై జాతీయ విపత్తు యాజమాన్య సంస్థ సంయుక్తంగా న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన మూడు రోజుల సదస్సు లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వీడియో కాన్ఫరెన్సు ద్వారా కీలకోపన్యాసం చేశారు.
"ఆత్మ నిర్భర్ భారత్ కోసం ప్రధానమంత్రి యొక్క విస్పష్టమైన పిలుపులో భాగంగా, స్వావలంబన వైపు మన ప్రయాణానికి దోహదం చేసే విపత్తు స్థితిస్థాపకత మరియు సుస్థిరతను పెంపొందించడంలో సహాయపడటానికి వాతావరణ అనుకూల ప్రణాళికలో శాస్త్ర, సాంకేతికతకు కీలక పాత్ర ఉంది" అని మంత్రి పేర్కొన్నారు. "వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్.ఐ.పి.సి.సి) లో భాగంగా వాతావరణ మార్పుపై రెండు జాతీయ మిషన్ల అమలులో శాస్త్ర, సాంకేతిక విభాగం (డి.ఎస్.టి) కొన్ని భారీ విజయాలను సాధించింది." అని ఆయన చెప్పారు. "రెండు మిషన్ల క్రింద, వివిధ పరిమాణాలలో 200 ప్రాజెక్టులకు మద్దతు ఉంది, వీటిలో 15 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, 30 భారీ పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు, 14 నెట్ వర్కు కార్యక్రమాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 100 ప్రాజెక్టులు, 6 టాస్కు ఫోర్సులతో పాటు 25 రాష్ట్ర స్థాయి వాతావరణ మార్పు కేంద్రాలు మొదలైనవి ఉన్నాయి. గత 6 సంవత్సరాలలో, అత్యున్నత ప్రభావంతమైన పత్రికల్లో దాదాపు 1,500 పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. ఈ మిషన్లలో భాగంగా 100 కి పైగా కొత్త పద్ధతులు అభివృద్ధి చేయబడ్డాయి, దాదాపు 50,000 మంది శిక్షణ పొందారు. ఈ మిషన్ ప్రాజెక్టులలో 1200 మందికి పైగా శాస్త్రవేత్తలు, విద్యార్థులు పనిచేస్తున్నారు. ” అని ఆయన వివరించారు. "కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు కొత్త సవాళ్లు మరియు సామాజిక-ప్రవర్తనా మార్పులతో మారుతున్న కాలంలో, శాస్త్ర విధానం ఆచరణలో కొత్త నమూనా అవసరం చాలా ఉంది." అని ఆయన నొక్కిచెప్పారు.
డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, “ప్రపంచంలోని 18 దేశాలకు గ్లోబ్ స్కాన్ మరియు నేషనల్ జియోగ్రాఫిక్స్ వంటి స్వతంత్ర ఏజెన్సీలు చేసిన ఒక సర్వే ప్రకారం, గ్రీన్ డెక్స్ అనే విషయ పరంగా భారతదేశం ప్రధమ స్థానంలో ఉంది. గ్రీన్ డెక్స్ అనేది స్థిరత్వం మరియు జీవన శైలి యొక్క కొలత." అని పేర్కొన్నారు. సుస్థిరత మరియు పర్యావరణానికి ఎంతో సహకారం ఉన్నప్పటికీ, విపరీత సంఘటనల పరంగా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దేశాలలో భారతదేశం ఒకటి. భూకంపం, ఉష్ణమండల తుఫానులు, వరద, సునామీ, ఉరుములతో కూడిన తుఫానులు, వడగళ్ళు, మెరుపు, వేడి గాలులు వంటి దాదాపు అన్ని రకాల విపత్తులను చూసిన కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి. మెరుగైన హెచ్చరికల వ్యవస్థలు ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో బాగా సహాయపడ్డాయి, కాని ఆర్థికాభివృద్ధి కారణంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు విపత్తులకు గురవుతున్నందున ఆస్తి నష్టం పెరుగుతూనే ఉంది.” అని ఆయన వివరించారు.
డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ “తరచుగా వాతావరణ మార్పులు సంభవించడం మరియు వాటి తీవ్రత భారీగా ఉండడంతో వాతావరణ సంబంధిత విపత్తులు విపరీతంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ప్రమాదాలు హాని కలిగించే వ్యక్తులు, సంఘాలు మరియు దేశాలను వారి భౌతిక మరియు సామాజిక ఆర్థిక అనుసరణ స్థాయిలకు నెట్టివేస్తున్నాయి ”, అని పేర్కొన్నారు. "విపత్తుల నుండి ప్రజలను కాపాడటమే కాకుండా విపత్తుల వైపు స్థితిస్థాపకత పెంపొందించడానికి సరైన వ్యూహాలను రూపొందించవలసిన అవసరం ఉంది. విపత్తు యొక్క రకాలు మరియు స్వభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మరియు స్థితిస్థాపకత నిర్మించే మార్గాలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఈ విపత్తులను ఎదుర్కోవటానికి సంఘాల సామర్ద్యాన్ని పెంపొందించవలసిన అవసరం ఉంది.” అని ఆయన అభిప్రాయపడ్డారు.
డి.ఎస్.టి. కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ ఈ సదస్సులో కీలకోపన్యాసం చేస్తూ, “వాతావరణ మార్పు ఒక ప్రపంచ సమస్య. కానీ, భారతదేశంలో తలసరి ఉద్గారాలు (వాతావరణ మార్పులకు కారణమయ్యే సంచిత ఉద్గారాలు) చాలా తక్కువ, అదేవిధంగా మనం ఈ సమస్యలో భాగం కాదు. అయినప్పటికీ, ఈ సమస్య పరిష్కారంలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ” అని వివరించారు.
విపత్తులు వాతావరణంతో ముడిపడి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోందనీ, అందువల్ల విపత్తు సంసిద్ధతను అమలుచేయడంలో మనం ఆత్మ నిర్భారతను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా, వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధి మరియు యాంటీ బాక్టీరియల్ నిరోధకతను పరిష్కరించడంలో స్వావలంబన అవసరం. “ఇది జరగడానికి, మన వ్యవస్థలను అనుసంధానం చేయడం మరియు సమాజ భాగస్వామ్యం చాలా ముఖ్యం. జ్ఞాన సృష్టికర్తలు మరియు జ్ఞాన వినియోగదారులు కలిసి పనిచేయడం అవసరం. పరిశ్రమ మరియు ప్రైవేట్ రంగం మరియు విఘాతకర సాంకేతిక పరిజ్ఞానం యొక్క పాత్ర ముఖ్యమైనది.”అని ఆయన ఎత్తిచూపారు.
దేశవ్యాప్తంగా వాతావరణ మార్పుల కార్యక్రమాలకు డి.ఎస్.టి ఎలా సహకరిస్తోందో, డి.ఎస్.టి, జి.ఓ.ఐ. (చైర్), ఎస్.పి.ఎల్.ఐ.సి.ఈ. హెడ్ మరియు వాతావరణ మార్పు కార్యక్రమం సలహాదారులు డాక్టర్ అఖిలేష్ గుప్తా ప్రత్యేకంగా తెలియజేశారు. “మనకు వరద, తుఫాను వంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. వీటికి అదనంగా, కోవిడ్-19 మహమ్మారి తో పాటు, ఈ సమయంలో విపత్తు సంసిద్ధతను కూడా కలిగి ఉండటం చాలా కీలకమైనది. శాస్త్ర, సాంకేతిక పరిష్కారాలతో విపత్తు నిర్వహణపై మనం కృషి చేయాలి,” అని ఆయన నొక్కి చెప్పారు.
డ్యూయిష్ గెసెల్స్‌చాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసామెనార్బీట్ (జి.ఐ.జెడ్) జి.ఎమ్.బి.హెచ్. సహకారంతో భారత ప్రభుత్వ దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ విపత్తు యాజమాన్య సంస్థ (ఎన్.ఐ.డి.ఎం) మరియు శాస్త్ర,సాంకేతిక విభాగం ఈ సదస్సును నిర్వహించాయి.
పర్యావరణ, భౌగోళిక, అభివృద్ధి వైవిధ్యాల కారణంగా భారతదేశం ఇప్పటికే బహుళ విపత్తులకు గురవుతున్న సందర్భంలో మరియు వాతావరణం మరియు అనుబంధ పర్యావరణ మార్పులతో ప్రజల విపత్తుల దుర్బలత్వం తీవ్రతరం అవుతున్న సందర్భంలో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.
అనుభవాలు, పాఠాలు, అంతరాలతో పాటు సాంప్రదాయ, స్థానిక విజ్ఞాన శాస్త్రం మరియు వాటిని అభివృద్ధి చేసే సంస్థల పాత్రతో సహా, ఎస్. & టి. విభాగాలు, ఆవిష్కరణల శ్రేణిని ఉపయోగించుకునే అవకాశాలపై చర్చలు మరియు సంభాషణల ద్వారా సమగ్ర ప్రణాళిక, అభివృద్ధి లక్ష్యంగా ఈ మూడు రోజుల సమావేశం జరిగింది.
సమావేశంలో పాల్గొన్న ఇతర ప్రముఖ వక్తల్లో - ఎన్.ఐ.డి.ఎం., ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మేజర్ జనరల్ మనోజ్ కె. బిందాల్; ఎన్.డి.ఎమ్.ఏ. సభ్య కార్యదర్శి, జి.వి.వి. శర్మ; జి.ఐ.జెడ్. ఇండియా, సీనియర్ పోర్ట్‌ఫోలియో మేనేజర్, ఫర్హాద్ వానియా ఉన్నారు. కాగా, ఫెసిలిటేటర్లుగా - ఎన్.డి.ఎం.ఏ., సభ్యుడు, కమల్ కిషోర్; ఇ.సి.డి.ఆర్.ఎమ్. ఎన్.ఐ.డి.ఎమ్., హెడ్ మరియు పి.డి-సి.ఏ.పి.ఆర్.ఈ.ఎస్. డి.ఎస్.టి. ప్రాజెక్ట్ (కన్వీనర్), ప్రొఫెసర్ అనిల్ కె గుప్తా; ఎన్.ఐ.డి.ఎం., ఫ్యాకల్టీ, శ్రీ ఆశిష్ కె.పాండా వ్యవహరించారు. వీరితో పాటు - సంబంధిత ప్రభుత్వ సంస్థలు / విభాగాలు / మంత్రిత్వ శాఖలు, సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలకు చెందిన నిపుణులు, పరిశోధకులు, వృత్తి నిపుణులు, అధికారులు, విద్యావేత్తలతో పాటు క్షేత్ర స్థాయి నిపుణులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.
*****
(Release ID: 1648899)
Visitor Counter : 169