రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
మధ్యప్రదేశ్‌లో 45 హైవే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన కేంద్ర మంత్రిశ్రీ నితిన్ గడ్కరి.
ఇందులో 11427 కోట్ల రూపాయల విలువగల 1361 కిలోమీటర్ల పొడవుగల రోడ్డు ప్రాజెక్టులు ఉన్నాయి.
మైనింగ్ పర్మిషన్లు, అటవీ అనుమతులు, భూ సేకరణ సొమ్మును త్వరితగతిన జారీచేయాల్సిందిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని కోరిన రవాణా , జాతీయరహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి
సిఆర్ఎఫ్ కింద ప్రాజెక్టులకోసం 700 కోట్ల రూపాయలు ప్రకటించిన సి.ఆర్.ఎఫ్.
రాష్ట్రంలోని మూడు ప్రధాన రోడ్డు ప్రాజెక్టులలో ఏకమొత్తం పెట్టుబడి ఆవశ్యకతను నొక్కి చెప్పిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
Posted On:
25 AUG 2020 3:42PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా ,రహదారులు, ఎం.ఎస్.ఎం.ఇల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి, మధ్యప్రదేశ్‌లో 45 రహదారుల ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపనలు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వర్చువల్ సమావేశానికి అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు శ్రీ తవర్‌చంద్ గెహ్లాట్, శ్రీ నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర సహాయ మంత్రులు శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, శ్రీ ఫాగన్ సింగ్ కులస్థే, జనరల్ (డాక్టర్) వి.కె.సింగ్ (రిటైర్డ్), రాష్ట్రానికి చెందిన మంత్రులు,ఎంపీలు, ఎం.ఎల్.ఎ.లు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగిన ఈ రోడ్ల పొడవు 1361 కిలోమీటర్లు. వీటి నిర్మాణ విలువ 11,427 కోట్ల రూపాయలు. మధ్య ప్రదేశ్ అభివృద్దికి వీలు కల్పిస్తూ , ఈ రోడ్లు రాష్ట్రం చుట్టుపక్కల మెరుగైన అనుసంధానతను , సౌకర్యాన్ని ఆర్థిక ప్రగతిని కలిగించనున్నాయి. మధ్యప్రదేశ్‌కు , అలాగే మధ్యప్రదేశ్ నుంచి ప్రజల రాకపోకలకు, సరకు రవాణా మెరుగు పడడానికి ఇది ఎంతో వీలు కల్పిస్తుంది. ప్రత్యేకించి పొరుగు రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌ఘడ్, రాష్ట్రాలతో రాకపోకలు, సరకు రవాణా మరింత మెరుగుపడతాయి. మెరుగైన రోడ్ల వల్ల సమయం ఆదా కావడంతోపాటు ఇంధనం ఆదా అవుతుంది. కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకండా ఈ ప్రాజెక్టుల కారణంగా ఈ రోడ్ల మార్గంలో గల పట్టణాలలో ట్రాఫిక్ రద్దీ తగ్గి , మెరుగైన ప్రయాణ అనుభవం కలిగే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర మంత్రి శ్రీ నితిన్‌గడ్కరి, మధ్యప్రదేశ్‌లో జాతీయ రహదారుల పొడవు ప్రస్తుతం 13,248 కిలోమీటర్లు ఉందని, 2014లో ఇది కేవలం 5, 186 కిలోమీటర్లు మాత్రమే ఉండేదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో 1,25,000 కోట్ల రూపాయల విలువగల అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే 60 నుంచి 70 శాతం పనులు పూర్తి అయ్యాయని వీటి విలువ సుమారు 30,000 కోట్ల రూపాయలవరకు ఉంటుందని చెప్పారు. ఈ రోడ్లలో చాలావరకు రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను , వెనుకబడిన ప్రాంతాలను కలుపుతున్నాయని అన్నారు.2023 నాటికి 50,000కోట్ల రూపాయల విలువగల పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు.

1260 కిలో మీటర్ల, 8 లైన్ల యాక్సెస్ నియంత్రిత ఢిల్లీ -ముంబాయి ఎక్స్‌ప్రెస్ రహదారి కి సంబంధించిన పనులు ప్రారంభమైనట్టు మంత్రి చెప్పారు. ఇందులో 244 కిలోమీటర్ల లైన్ల పొడవు గల రహదారులు 8,214 కోట్ల రూపాయల వ్యయంతో మధ్యప్రదేశ్‌లో చేపట్టనున్నట్టు తెలిపారు. మధ్యప్రదేశ్ సెక్షన్ కు సంబంధించిన ఎక్స్‌ప్రెస్‌వే పనులు ఇప్పటికే కేటాయించినట్టు మంత్రి తెలిపారు. ఇది రామ్‌గంజ్ మండి, గరోత్, జావ్రా, మాల్వా ప్రాంతానికి చెందిన రత్లాం, తండ్ల(జబువా) ప్రాంతాల గుండా పోతుందన్నారు. 173 కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్డు ఢిల్లీ-ముంబాయి ఎక్స్‌ప్రెస్ వే కి చెందిన మాల్వా ప్రాంతంతో అనుసంధానతను కల్పించనుంది. ఇది ఇండోర్, దేవాస్, ఉజ్జయిని, అగర్ నుంచి గరోత్, గుండా వెళుతుంది. ఇందుకు సంబంధించిన పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి కేటాయించడం జరుగుతుంది.
మైనింగ్‌కు వెంటనే అనుమతి మంజూరు చేయాల్సిందిగా నితిన్ గడ్కరి , మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని కోరారు. ఇది ఎక్స్‌ప్రెస్‌రహదారి నిర్మాణం ఊపందుకోవడంపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నదని చెప్పారు.అలాగే రైతులకు భూ సేకరణ మొత్తాన్ని వెంటనే పంపిణీ చేయాల్సిందిగా ఆయన కోరారు. జాతీయ రహదారుల సంస్థ ఈ మొత్తాన్ని ఇప్పటికే రాష్ట్రానికి పంపించిందన్నారు. అటవీ క్లియరెన్సులకు సంబంధించిన అనుమతులను కూడా సత్వరం జారీ అయ్యేట్టు చూడాల్సిందిగా ఆయన కోరారు. ఈ విషయంలొ ముఖ్యమంత్రి, పరిస్థితిని స్వయంగా సమీక్షించాలని కోరారు., అనుమతుల జారీలో జాప్యం ప్రాజెక్టులు పూర్తి కావడంలో ఆలస్యం అవుతుందని, ప్రజా ప్రయోజనం రీత్యా ఇది మంచిది కాదని అన్నారు.మధ్యప్రదేశ్‌లో ఉపాధి , ఆర్థిక స్థితిగతులను పెంపొందించడంలో
ఎం.ఎస్.ఎం.ఇ రంగం పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.ఎం.ఎస్.ఎం.ఇ యూనిట్ల నిర్వచనాన్ని ఇటీవల విస్తృతం చేసిన విషయాన్ని తెలియజేస్తూ ఆయన, ఈ అవకాశాన్ని వినియోగించుకుని , హస్తకళలు, చేతివృత్తులు తదితరాల ఎగుమతుల సామర్ధ్యాన్ని పెంచే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా సూచించారు. ఇది పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఇది మధ్యప్రదేశ్ ప్రగతికి ఎంతో దోహదం చేస్తుందన్నారు.

సెంట్రల్ రోడ్ ఫండ్ (సిఆర్ఎఫ్)నుంచి మధ్యప్రదేశ్‌లో రోడ్ల రంగానికి వినియోగించేందుకు 700 కోట్ల రూపాయలనుశ్రీ నితిన్ గడ్కరీ ప్రకటించారు. రాష్ట్రంనుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ ఆయన, 350 కోట్ల రూపాయల విలువగల ప్రతిపాదనలలో రోడ్డు పనులకు సంబంధించి మధ్యప్రదేశ్ కు చెందిన ఎంపీల ప్రతిపాదనలు వారి నియోజకవర్గాలకు చెందినవి ఉన్నాయన్నారు.
మధ్యప్రదేశ్‌లో ముఖ్యమైన రోడ్డు ప్రాజెక్టులను చేపట్టేందుకు చూపిన దార్శనికత, అనుకూలత వ్యక్తం చేయడం పట్ల కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందించారు. ఈ రోడ్లు మధ్యప్రదేశ్ కు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయన్నారు, ఇవి సమయం ఆదా చేయడమే కాకుండా డబ్బుకూడా ఆదా చేస్తాయన్నారు. ఇవి ప్రమాదాలు తగ్గించి ప్రాణాలు కాపాడతాయన్నారు. రాష్ట్ర యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్‌కు చెందిన ముఖ్యమైన రోడ్డు ప్రాజెక్టులైన -నర్మదా ఎక్స్‌ప్రెస్ రహదారి, చంబల్ ఎక్స్‌ప్రెస్ రహదారి (దీనినే అటల్ ప్రగతి రహదారి అంటారు) , రామవంగమన్ పథ్ ప్రాజెక్టులకు సంబంధించి తాను త్వరలోనే సవివరమైన నివేదిక యకేంద్రానికి సమర్పిస్తానని తెలిపారు.
కేంద్ర మంత్రులు శ్రీ తవర్‌చంద్ గెహ్లాట్, శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, శ్రీ ఫాగన్ సింగ్ కులస్థే, పలువురు ప్రముఖులు మధ్యప్రేదేశ్ లో చేపట్టిన వివిధ జాతీయరహదారుల ప్రాజెక్టుల చొరవను అభినందించారు.
మధ్యప్రదేశ్‌లో ఈరోజు ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల వివరాలు కింద ఇవ్వడం జరిగింది.
మధ్యప్రదేశ్ రహదారి ప్రాజెక్టుల జాబితా కోసం క్లిక్ చేయండి.
***
(Release ID: 1648614)
Visitor Counter : 205