భారత ఎన్నికల సంఘం
డీలిమిటేషన్ కమిషన్ కొత్త కార్యాలయ ప్రాంగణం ప్రారంభం
Posted On:
24 AUG 2020 3:20PM by PIB Hyderabad
డీలిమిటేషన్ కమిషన్ కొత్త కార్యాలయ ప్రాంగణాన్ని ఈ రోజు (సోమవారం) డీలిమిటేషన్ కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ శ్రీమతి రంజనా దేశాయ్ ప్రారంభించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ ఎస్. అశోక్ లావాసా, ఎన్నికల కమిషనర్ మరియు డీలిమిటేషన్ కమిషన్ సభ్యుడు ఎస్.సుశీల్ చంద్రాలు తదితరుల సమక్షంలో ఈ ప్రాంగణం ప్రారంభోత్సవం జరిగింది. న్యూఢిల్లీలోని హోటల్ అశోకా మూడవ అంతస్తులో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలతో కూడిన సమావేశపు మందిరంతో సహా.. అవసరమైన విశాల స్థలంలో దీనిని ఏర్పాటు చేశారు. మార్చి, 2020 నుండి డీలిమిటేషన్ కమిషన్ పని చేయడం మొదలు పెట్టింది. కమిషన్ ఇప్పటి వరకు నాలుగు అధికారిక సమావేశాల్ని నిర్వహించింది. సంబంధిత రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి అసోసియేట్ సభ్యులు ఇప్పటికే నామినేట్ చేయబడ్డారు. రాష్ట్రాలు / యుటీలలో పరిపాలనా జిల్లాల ఫ్రీజింగ్‌కు జూన్ 15, 2020 తేదీగా కమిషన్ నిర్ణయించింది. సమాచారపు సేకరణ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ కొత్త కార్యాలయం ప్రారంభంతో, డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి వీలుగా అసోసియేట్ సభ్యులతో అధికారిక చర్చలు త్వరలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు, సీఎండీ ఎన్‌బీసీసీ, ఐటీడీసీ అధికారులు పాల్గొన్నారు.
…

న్యూఢిల్లీలోని అశోక హోటల్‌లో నేడు (ఆగస్టు 24,2020న) డీలిమిటేషన్ కమిషన్ కార్యాలయ ప్రాంగణాన్ని ప్రారంభిస్తున్న డీలిమిటేషన్ కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ రంజనా దేశాయ్

డీలిమిటేషన్ కమిషన్ కార్యాలయ ప్రాంగణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో
డీలిమిటేషన్ కమిషన్ జస్టిస్ రంజనా దేశాయికి జ్ఞాపికను అందజేస్తున్న ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా

***
(Release ID: 1648315)
Visitor Counter : 234