రైల్వే మంత్రిత్వ శాఖ

ప్రైవేటు భాగస్వామ్యంతో సి.ఎస్.ఎం.టి. రైల్వే స్టేషన్ అభివృద్ధి

రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (ఆర్.ఎఫ్.క్యు) ప్రతిపాదనలు కోరిన భారతీయ రైల్వే స్టేషన్ల అభివృద్ధి సంస్థ

టెండర్లను ఆహ్వానిస్తూ ఆగస్టు 20న నోటీసు ప్రచురణ

ఐ.ఆర్.ఎస్.డి.సి. పోర్టల్ లో ఆర్.ఎఫ్.క్యు. పత్రం

Posted On: 24 AUG 2020 3:14PM by PIB Hyderabad

  ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మినస్ (సి.ఎస్.ఎం.టి.) రైల్వే స్టేషన్ ను మరో సారి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ఆమోద కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన అనంతరం రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (ఆర్.ఎఫ్.క్యు) ప్రతిపాదనల కింద టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. టెండర్లను ఆహ్వానిస్తూ భారతీయ రైల్వే స్టేషన్ల అభివృద్ధి సంస్థ (.ఆర్.డి.ఎస్.) 2020 ఆగస్టు 20 నోటీసును వెలువరించింది. నోటీసును .ఆర్.ఎస్.డి.సి. వెబ్ సైట్ http://irsdc.enivida.com/లో అందుబాటులో ఉంచారుప్రీ బిడ్ కాన్ఫరెన్స్ 2020 సంవత్సరం సెప్టెంబర్ 9 జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవలసిన చివరి తేదీ 2020, అక్టోబర్ 22.

  తగిన అర్హతలు కలిగిన దరఖాస్తులను బిడ్డింగ్ ప్రక్రియలో తదుపరి దశ కోసం ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. బిడ్డింగ్ ప్రక్రియను రెండు దశల్లో అంటే, రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్.ఎఫ్.పి.) దశల్లో నిర్వహిస్తారు. ఆర్.ఎఫ్.పి. దశలో ఎంపికైన బిడ్డర్ సంస్థ రైల్వే స్టేషన్ అభివృద్ధిని, చుట్టుపక్కల ఉన్న రైల్వే స్థలం వాణిజ్య అభివృద్ధిని చేపడుతుంది.. వాణిజ్య అభివృద్ధిని 60ఏళ్ల లీజు హోల్డ్ ప్రాతిపదికపైన చేపడతారు. ఎంపిక చేసిన కొన్ని ప్లాట్లను 99ఏళ్లవరకు లీజుతో నివాసయోగ్యమైనవిగా అభివృద్ధి చేస్తారురైల్వే స్టేషన్ నిర్వహణను అరవైఏళ్లపాటు రాయితీ ప్రాతిపదికన చేపడతారు. రైల్వే స్టేషన్ ను రాయితీ ప్రాతిపదికన నిర్వహించే బిడ్డింగ్ సంస్థకు యూజర్ చార్జీ మరో ఆదాయ వనరుగా ఉంటుంది. రైల్వేస్టేషన్ వాణిజ్య ప్రాతిపదికన పనిచేసే తేదీనుంచి యూజర్ చార్జీ అమలులోకి వస్తుంది.

  ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళిక ఫ్రాన్స్ కు చెందిన మెసర్స్ ఎఆఇపి సంస్థ రూపొందించింది. తర్వాత దీనిపై క్రమం తప్పకుండా భాగస్వామ్య వర్గాలన్నింటితో చర్చలు కూడా జరిగాయి. స్టేషన్ అభివృద్ధి ఖర్చును 1,642కోట్లుగా అంచనా వేశారు. రూపకల్పన, నిర్మాణం, నిధుల సరఫరా, నిర్వహణ, బదిలీ (డి.బి.ఎఫ్..టి) ప్రాతిపదికన ప్రాజెక్టులో పెట్టుబడులకు అవకాశం కల్పించారు.

ప్రాజెక్టు ముఖ్యాంశాలు ఇవి:

1. సూత్రప్రాయ ఆమోదం తెలిపిన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య కమిటీలో ఆర్థిక, న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, నీతీ ఆయోగ్, రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధులు తదితరులు సభ్యులుగా ఉన్నారుప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా కమిటీ ఆమోదం తెలిపింది

2. అర్హతా ప్రమాణాలు ఆర్.ఎఫ్.క్యు. దశలో సంస్థ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఉంటాయి. అంతకు మందు ఆర్థిక సంవత్సరంలో సంస్థ నిఖర విలువ/ .సి.. 821కోట్ల రూపాయలుగా ఉండాలి

 3. ప్రాజెక్టు మంజూరైన తర్వాత నిర్మాణ సామర్థ్యం, నిర్వహణ  అనుభవ సామర్థ్యం నిర్ణీత నిబంధనలకు తగినట్టుగా సమకూర్చుకోవాలి. అది కూడా అప్పాయింటెడ్ తేదీలోగానే జరగాలి.

4. రైల్వే స్టేషన్ల నిర్వహణ వ్యవధి: రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సేవలు, సదుపాయాల కల్పనకు రాయితీ ప్రాతిపదికన లైసెన్స్ ఇస్తారు.

5. అదనపు రెవెన్యూ : ముందుగా నిర్ణయించిన యూజర్ చార్జీల రూపంలో (రైల్వే మంత్రిత్వ శాఖ సూచించిన మేరకు) విమానాశ్రయాల్లో  లాగానే రైల్వే స్టేషన్లలో కూడా వినియోగదారులనుంచి చార్జీల వసూలు చేసే ఏర్పాటు.

6. రియల్ ఎస్టేట్ కోసం దీర్ఘకాలిక లీజు: నివాస ప్రయోజనాలకోసం వినియోగం, మిశ్రమ వినియోగంకోసం 99ఏళ్ల వరకు లీజు, రెసిడెన్షియల్ ఫార్మాట్ కోసం 60ఏళ్ల లీజు. 2.54లక్షల చదరపు మీటర్లవరకూ విస్తీర్ణాన్ని వాణిజ్య అభిృద్ధి చేయడానికి తాత్కాలికంగా అనుమతిస్తారు. అనుమతించిన నిర్మాణ విస్తీర్ణం ఎంత అన్నది ఆర్.ఎఫ్.పి. దశలోనే తెలియాల్సి ఉంటుంది.

7. భూ వినియోగంలో మార్పు అవసరం లేదు.

8. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖనుంచి ముందస్తు ఆనుమతి తీసుకోవలసిన అవసరం లేదు.

 9. మాస్టర్ ప్లాన్, నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికల ఆమోదానికి సంబంధించి .ఆర్.ఎస్.డి.సి. సింగిల్ విండో సంస్థగా వ్యవహరిస్తుంది. 1989 సంవత్సరపు రైల్వే చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం సంక్రమించిన అధికారాల మేరకు స్థానిక అధీకృత సంస్థలు, అధికారులతో సంప్రదింపుల జరిపి ప్రణాళికలను ఆమోదిస్తుంది.

10. ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (..ఎఫ్.)కి, విదేశీ పెట్టుబడి నిధి (ఎఫ్..ఎఫ్.)కి కూడా ప్రాజెక్టులో పాల్గోనేందుకు అర్హత ఉంది.

11. నిర్ణీత అర్హతలు కలిగిన దరఖాస్తుదారులందరూ ఆర్..పి. దశలో ప్రైస్ బిడ్ ను సమర్పించడానికి అర్హులుగా ఉంటారు. అంటే,..ఆర్..పి.దశలో దరఖాస్తుదారుల ఎంపికకు ఎలాంటి గరిష్ట పరిమితి లేదు.

     ప్రాజెక్టుపై తాజా సమాచారం కోసం .ఆర్.డి.సి. సోషల్ మీడియా వేదికలను సంప్రదించవచ్చు. ట్విట్టర్ లో (@irsdcinfo), ఫేస్ బుక్ లో (facebook.com/IRSDC),  లింక్డ్ ఇన్ లో (linkedin.com/company/ indian-railway-stations-developmentcorporation-limited)లను సంప్రదించవచ్చు. వివరాలకోసం మా వెబ్ సైట్: irsdc.inను కూడా సందర్శించవచ్చు.

***



(Release ID: 1648313) Visitor Counter : 184