రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ సీజన్ కోసం ఫాక్ట్ దిగుమతి చేసుకున్న రెండో ఎంవోపీ (27000 మె.ట.) ట్యుటికోరిన్ పోర్టుకు చేరిక
ఈ సీజన్‌లో వ్యవసాయ అవసరాలు తీర్చడానికి చర్యలు తీసుకుంటున్న సంస్థ
Posted On:
22 AUG 2020 5:15PM by PIB Hyderabad
కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే 'ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్‌కోర్ లిమిటెడ్' (ఫ్యాక్ట్), ఈ ఆర్థిక ఏడాది తొలి ఐదు నెలల్లో ఉత్పత్తి, మార్కెటింగ్‌లో ప్రోత్సాహక పనితీరు కనబరిచింది. ఖరీఫ్ సీజన్ కోసం, రెండో దశ కింద, ఫాక్ట్ దిగుమతి చేసుకుంటున్న 27 వేల మెట్రిక్ టన్నుల 'మ్యురేట్ ఆఫ్ పొటాష్' (ఎంవోపీ) ట్యుటికోరిన్ పోర్టుకు చేరుకుంది. సరకును నౌక నుంచి దించుతున్నారు.
ఫాక్ట్ ముఖ్య ఉత్పత్తి అయిన ఫ్యాక్టంఫాస్ (ఎన్పీ 20:20:0:13)తోపాటు, ఎంవోపీని కలిపి ఎరువుల మిశ్రమంగా దక్షిణ భారత రైతులు ఉపయోగిస్తారు. గత జూన్-జులై నెలల్లో, తొలిదశ కింద, ఎంవోపీ, ఎన్‌పీకే కాంప్లెక్స్‌ను ఈ సంస్థ దిగుమతి చేసుకుంది.
కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే సంస్థ తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రస్తుతం వ్యవసాయానికి ఊతమిచ్చేలా మంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, రైతుల అవసరాలు తీర్చేలా ఎరువులను ఫాక్ట్ దిగుమతి చేసుకుంటోంది.
***
(Release ID: 1647968)
Visitor Counter : 123