వ్యవసాయ మంత్రిత్వ శాఖ
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.56% పెరిగిన ఖరీఫ్ పంటల విస్తీర్ణం
- వరి, నూనె గింజల విత్తనాల సాగులో గణనీయమైన పెరుగుదల
Posted On:
21 AUG 2020 3:09PM by PIB Hyderabad
దేశంలో ఖరీఫ్ పంటల సాగు జోరుగా సాగుతోంది. 21.08.2020 నాటికి మొత్తం 1062.93 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఖరీఫ్ పంటలు సాగు చేయబడ్డాయి. గత ఏడాది ఇదే సమయంలో 979.15 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే నాట్లు వేయబడినాయి. దీంతో దేశంలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఖరీఫ్ పంటల విస్తీర్ణంలో 8.56 శాతం పెరుగుదల నమోదు అయింది. ఖరీఫ్ సీజన్ కింద వివిధ పంటల సాగు తీరు ఈ కింది విధంగా ఉంది.:
వరి: గత ఏడాది ఇదే కాలంలో 338.65 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయగా .. ఈ సీజన్‌లో 378.32 లక్షల హెక్టార్లకు పెరిగింది. అంటే వరి పంట సాగు విస్తీర్ణంలో దాదాపు 11.71 శాతం పెరిగినట్టయింది.
పప్పుధాన్యాలు: గత ఏడాది ఇదే కాలంలో 124.15 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయగా.. ఈ సీజన్‌లో 132.56 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. అంటే ఈ పంటల సాగు విస్తీర్ణంలో 6.77% వృద్ధి కనిపిస్తోంది.
ముతక తృణ ధాన్యాలు: గత సంవత్సరం ఇదే కాలంలో 166.80 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయగా.. ఈ ఏడాది 174.06 లక్షల హెక్టార్ల మేర విస్తీర్ణంలో సాగు చేశారు. అనగా వీటి విస్తీర్ణం 4.35% మేర పెరిగింది.
నూనె గింజలు: గత ఏడాది ఇదే కాలంలో 167.53 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవగా.. ఈ సీజన్‌లో నూనె గింజల పంటల విస్తీర్ణం 191.14 లక్షల హెక్టార్లకు పెరిగింది. సాగు విస్తీర్ణం 14.09% పెరిగింది.
చెరకు: గత ఏడాది ఇదే కాలంలో 51.62 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవగా.. ఈ సీజన్‌లో 52.19 లక్షల హెక్టార్లకు చేరింది. అనగా సాగు విస్తీర్ణం 1.10 శాతం మేర పెరిగింది.
పత్తి: గత ఏడాది ఇదే కాలంలో 123.54 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగవగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 127.69 లక్షల హెక్టార్లకు చేరింది. అనగా విస్తీర్ణం కవరేజ్ 3.36% మేర పెరిగినట్టయింది.
జనపనార & మేస్తా: గత ఏడాది ఇదే కాలంలో 6.86 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో జనము మరియు మేస్తా సాగవగా.. ఇది ప్రస్తుత సీజన్‌లో 6.97 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి పెరిగింది. అంటే దేశంలో ఈ పంటల విస్తీర్ణం 1.68 శాతం మేర పెరిగింది.
ఇప్పటి వరకు ఖరీఫ్ పంటల విస్తీర్ణం విస్తరణపై కోవిడ్-19 ప్రభావం లేదు.
దేశంలో 628.3 మి.మి. సాధారణ వర్ఫపాతంతో పోలిస్తే 20.08.2020 నాటికి వాస్తవ వర్షపాతం 663.0 మి.మి.గా నమోదు అయింది. అనగా 01.06.2020 నుండి 20.08.2020 వరకు (+) 6% వర్షపాతం నమోదు అయింది.
కేంద్ర జల కమిషన్ నివేదక ప్రకారం, దేశంలోని 123 జలాశయాలలో ప్రత్యక్ష నీటి నిల్వ లభ్యత గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే 90 శాతం గాను, గత దశాబ్దపు సగటుతో పోలిస్తే 107 శాతం గాను ఉంది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
****
(Release ID: 1647738)
Visitor Counter : 220