ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ విషయంలో తగిన ప్రవర్తనను ప్రోత్సహించడానికి ఇంటరాక్టివ్ గేమ్, ఐఇసి కంటెంట్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్
“ కోవిడ్ కు సామాజిక వాక్సిన్ ,రాకెట్ సైన్సు కాదు”
Posted On:
20 AUG 2020 7:39PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోవిడ్ -19పై కరోనా ఫైటర్స్ (www.thecoronafighters.in) పేరుతో తొలి ఇంటరాక్టివ్ సెషన్‌ను , కోవిడ్‌కు సంబంధించిన తగిన ప్రవర్తనను ప్రోత్సహించే రెండు వీడియోలను ఆవిష్కరించారు. వీటిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ ప్రత్యేక గేమ్ ను ఆవిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ డాక్టర్ హర్షవర్ధన్, కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు తగిన ఉపకరణాలు,ప్రవర్తనను తెలియజెప్పేందుకు వినూత్నంగా,అత్యంత సృజనాత్మకంగా ఈ గేమ్ ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. వాస్తవ ప్రపంచంలో ప్రజలు తగిన చర్యలు తీసుకునేలా వారిని ప్రభావితం చేసేందుకుఈ గేమ్ ఉపయోగపడుతుందని తద్వారా ఇన్‌ఫెక్షన్ బారినపడకుండా ఉండడానికి దోహదపడుతుందని అన్నారు. దీనితో పాటు రెండు ప్రమోషనల్ వీడియోలను విడుదల చేసినట్టు చెప్పారు . కోవిడ్ నియంత్రణకు సంబంధించిన సందేశాన్ని ప్రజలకు పెద్ద ఎత్తున తెలియజేయడం కోసం ఇవి ఉపయోగపడనున్నాయి.వీటిని అత్యంత సులభమైన రీతిలో , ఆనందం కలిగించే రీతిలో రూపొందించి నట్టు ఆయన తెలిపారు.
పోలియో అభియాన్ సందర్భంగా తన అనుభవాలను ఈసందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ గుర్తు చేసుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఇది సామాజిక ఉద్యమంగా మారినట్టు చెప్పారు. సినిమా రంగంలోని వారు ఇతరుల మద్దతు తో ఇది సాధ్యమైనట్టు తెలిపారు. పల్సు పోలియో కార్యక్రమం, ఐఇసి, ఔట్ రీచ్ ప్రచారాల ద్వారా చిట్టచివరి వ్యక్తి వరకూ సందేశం చేరేట్టు చేసి, పిల్లలకు వాక్సిన్ వేయించేట్టు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఇదే రకమైన కృషి ద్వారా కోవిడ్‌పై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజల అలవాట్లలో మార్పు తీసుకురావచ్చని ఆయన తెలిపారు. కాలర్ ట్యూన్‌లు, ఇతర మాధ్యమాల ద్వారా లాక్‌డౌన్ సమయంలో, ఆతర్వాతప్రచారం చేపట్టడం వల్ల కొవిడ్‌ను అరికట్టడానికి వీలు కలుగుతున్నదన్నారు. కోవిడ్ -19 కు వాక్సిన్ వచ్చే వరకు ప్రజల ప్రవర్తనలో తగిన మార్పు శక్తివంతమైన సామాజిక వాక్సిన్ గా పనిచేసి, మనల్ని సురక్షితంగా ఉంచగలుగుతుందని ఆయన అన్నారు.
ఈ గేమ్‌లు ,ప్రొమోషనల్ వీడియోలు రూపొందించిన వారిని అభినందిస్తూ శ్రీ అశ్విని కె.చౌబే, “ప్రస్తుత ప్రపంచంలో కమ్యూనికేషన్ అత్యంత కీలకమైనది, లాక్‌డౌన్ సమయంలో ఇది కోవిడ్ పై పోరాటంలో ఎంతో కీలకపాత్ర పోషించింది. కోవిడ్‌ను పకడ్బందీగా అదుపుచేసే వ్యూహం చిట్టచివరి వ్యక్తి వరకూ తెలియజేయడానికి ఇది ఉపకరిస్తుంది” ఇవాళ ప్రారంభించిన ఐఇసి వీడియోలు, గేమ్ పిల్లలపై ప్రభావాన్ని చూపగలవు. ఇది పెద్దలపైనా ,కమ్యూనిటీపైనా ప్రభావం చూపి కోవిడ్‌కు సంబంధించి అనుసరించాల్సిన పద్దతులు పెద్ద ఎత్తున ప్రచారం కావడానికి దోహదపడినట్టు ఆయన తెలిపారు.
నీతి ఆయోగ్,మెంబర్ (హెల్త్), డాక్టర్ వి.కె.పాల్ , ఆరోగ్య,కుటుంబ సంక్షేమ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, త్రాగునీరు, పారిశుధ్య శాఖ కార్యదర్శి శ్రీ పరమేశ్వరన్ అయ్యర్, ఆరోగ్య మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1647540)
Visitor Counter : 180