సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
2020 లో 44 శాతం పెరిగిన - పి.ఎమ్.ఈ.జి.పి. ప్రాజెక్టుల రికార్డుల అమలు
Posted On:
20 AUG 2020 6:43PM by PIB Hyderabad
కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దిగజారిన సమయంలో, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి) అమలు చేసిన ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం (పి.ఎమ్.ఈ.జి.పి) చాలా వేగంగా అభివృద్ధి చెందింది. పి.ఎమ్.ఈ.జి.పి. ప్రాజెక్టులను ఆమోదించడంలో నూతన వేగవంతమైన యంత్రాంగాన్ని ప్రవేశపెట్టిన ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన నిర్ణయానికి ధన్యవాదాలు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో, అనగా 2020 ఏప్రిల్, 1వ తేదీ నుండి 2020 ఆగష్టు, 18వ తేదీ వరకు ఆమోదం పొందిన ప్రోజెక్టుల సంఖ్య 44 శాతం పెరిగింది.
ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి) 1.03 లక్షల ప్రాజెక్టు దరఖాస్తులను ఆమోదించి. ఫైనాన్సింగ్ బ్యాంకులకు పంపగా, గత ఏడాది ఇదే కాలంలో 71,556 ప్రాజెక్టు దరఖాస్తులను మాత్రమే పంపింది. గత ఏడాదితో పోలిస్తే, ఈ దరఖాస్తుల సంఖ్య 44 శాతం పెరిగింది.
కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉపాధి కల్పన కార్యక్రమంగా ఉన్న పి.ఎమ్.ఈ.జి.పి.ని అమలు చేయడానికి కె.వి.ఐ.సి. నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. పి.ఎమ్.ఈ.జి.పి. ప్రాజెక్టులను ఆమోదించడంలో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ (డి.ఎల్.టి.ఎఫ్.సి) పాత్రను తొలగిస్తూ, మార్గదర్శకాలను ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన మంత్రిత్వ శాఖ సవరించింది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని డి.ఎల్.టి.ఎఫ్.సి. పాత్ర వల్ల చాలా కాలయాపన జరుగుతోంది. అందువల్ల, పి.ఎమ్.ఈ.జి.పి. మరియు కె.వి.ఐ.సి. కింద ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని ఈ ముఖ్యమైన పథకానికి ఎక్కువ ప్రాధాన్యత అవసరం కనుక వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. సవరించిన మార్గదర్శకాల ప్రకారం, పి.ఎమ్.ఈ.జి.పి. పథకాన్ని అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ అయిన కె.వి.ఐ.సి. కి కాబోయే పారిశ్రామికవేత్తల నుండి దరఖాస్తులను క్లియర్ చేసి, క్రెడిట్ నిర్ణయాలు తీసుకోవటానికి బ్యాంకులకు పంపించే పనిని అప్పగించారు.
2020 ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు, ఫైనాన్సింగ్ బ్యాంకులు 11,191 ప్రాజెక్టులను మంజూరు చేసి, దరఖాస్తుదారులకు 345.43 కోట్ల రూపాయల మార్జిన్ మనీ పంపిణీ చేశాయి. కాగా, అంతకుముందు ఏడాది అంటే 2019 మొదటి ఐదు నెలల్లో 9,161 ప్రాజెక్టులను మంజూరు చేసి, దరఖాస్తుదారులకు 276.09 కోట్ల రూపాయల మార్జిన్ మనీ పంపిణీ చేశాయి. బ్యాంకులు మంజూరు చేసిన ప్రాజెక్టుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే, 22 శాతం పెరిగింది. అదేవిధంగా కె.వి.ఐ.సి. మార్జిన్ మనీ పంపిణీ మునుపటి సంవత్సరంతో పోలిస్తే 24 శాతం పెరిగింది.
ఈ ఐదు నెలల్లో ఎక్కువ రోజులు, దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నందున ఈ సంవత్సరం పి.ఎమ్.ఈ.జి.పి. ప్రాజెక్టులను వేగంగా అమలు చేయడం ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అధిక సంఖ్యలో ప్రాజెక్టులు స్థానిక తయారీని ప్రోత్సహించడం ద్వారా ప్రజలకు స్వయం ఉపాధి మరియు స్థిరమైన జీవనోపాధిని కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కూడా ఇవి ప్రతిబింబించాయి.
కె.వి.ఐ.సి. చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ “పి.ఎమ్.ఈ.జి.పి. ప్రాజెక్టులకు ఆమోదం భారీగా పెరగడం “కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన” కోసం ప్రధానమంత్రి పిలుపు ఫలితమని పేర్కొన్నారు. "జిల్లా కలెక్టర్ల పాత్రను నిలిపివేయడం ప్రాజెక్టుల యొక్క వేగవంతమైన అమలును నిర్ధారిస్తుంది. ఏదేమైనా, గరిష్ట సంఖ్యలో దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా బ్యాంకులు నిధులను మంజూరు చేసే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలి. ప్రాజెక్టులను అమలు చేయడానికీ, దేశంలో ఉపాధి కల్పించడానికీ, సకాలంలో నిధుల పంపిణీ చాలా ముఖ్యమైనది,” అని సక్సేనా అభిప్రాయపడ్డారు.
ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్
2019 మరియు 2020 లో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆగస్టు 18వ తేదీ వరకు
పి.ఎమ్.ఈ.జి.పి. పనితీరు పోలిక
|
వివరాలు
|
2019 ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆగష్టు 18వ తేదీ వరకు
|
2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆగష్టు 18వ తేదీ వరకు
|
పెరుగుదల శాతం
|
స్వీకరించిన
దరఖాస్తుల
సంఖ్య
|
168848
|
178003
|
5%
|
కే.వి.ఐ.సి.
నుండి బ్యాంకులకు పంపిన దరఖాస్తుల
సంఖ్య
|
71556
|
103003
|
44%
|
|
బ్యాంకులు మంజూరు
చేసిన
ప్రాజెక్టుల
సంఖ్య
|
కె.వి.ఐ.సి.
పంపిణీ
చేసిన
మార్జిన్
మనీ
|
బ్యాంకులు మంజూరు
చేసిన ప్రాజెక్టుల
సంఖ్య
|
కె.వి.ఐ.సి. పంపిణీ చేసిన మార్జిన్
మనీ
|
బ్యాంకులు
మంజూరు
చేసిన
ప్రాజెక్టుల
సంఖ్య
|
కె.వి.ఐ.సి.
పంపిణీ
చేసిన
మార్జిన్
మనీ
|
|
9161
|
Rs 276.09 crore
|
11,191
|
Rs 345.43 crore
|
22%
|
24%
|
******
(Release ID: 1647453)
Visitor Counter : 184