వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2020-21 చెరకు సీజను కోసం చెరకు మిల్లులు చెల్లించదగిన చెరకు తాలూకు ఉచితమైన, ఇంకా లాభదాయక ధర కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 19 AUG 2020 4:33PM by PIB Hyderabad

వ్యావసాయిక వ్యయాలు మరియు ధరల సంఘం (సిఎసిపి) సిఫారసు చేసిన ప్రకారం 2020-21 చెరకు సీజను (అక్టోబరు-సెప్టెంబరు) కోసం చెరకు మిల్లులు చెల్లించదగిన చెరకు తాలూకు ‘యుక్తమైన, ఇంకా లాభదాయకమైనటువంటి ధర’ (ఎఫ్ఆర్ పి) నిర్ధారణ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఈ క్రింద పేర్కొన్న విధం గా ఆమోదం తెలిపింది:

i)        2020-21 చెరకు సీజను కోసం ఎఫ్ఆర్ పి 10 శాతం బేసిక్ రికవరీ రేటు ప్రాతిపదిక న ప్రతి ఒక్క క్వింటలు కు 285 రూపాయలు గా నిర్ధారించడమైంది;
ii)       రికవరీ లో 10 శాతం కంటే అధికం గా గల ప్రతి 0.1 శాతం వృద్ధి కి గాను ప్రతి ఒక్క క్వింటలు కు 2.85 రూపాయల ప్రీమియమ్ ను ప్రదానం చేయడం; అలాగే,      

iii)      ప్రతి ఒక్క రికవరీలో 0.1 శాతం క్షీణత నమోదైతే ఎఫ్ఆర్ పి లో 2.85 రూపాయల రేటు చొప్పున తక్కువ చేసే ఏర్పాటు ను చేయడమైంది-  ఈ వ్యవస్థ ఎటువంటి చెరకు మిల్లుల విషయం లో వర్తిస్తుంది అంటే- వేటి రికవరీ 10 శాతాని కంటే తక్కువ అయినప్పటికీ 9.5 శాతాని కంటే అధికం గా ఉంటుందో.  అయినప్పటికీ, ఏ మిల్లుల లో అయితే వాటి రికవరీ 9.5 శాతం గాని లేదా అంత కంటే తక్కువ గా ఉందో, ఎఫ్ఆర్ పి ని ప్రతి క్వింటలు కు 270.75 రూపాయలు గా నిర్ధారించడమైంది.

చెరకు ను పండించే రైతుల కు వారి ఉత్పాదన కు యుక్తమైన, ఇంకా లాభదాయకమైనటువంటి ధర దొరికే దృష్టికోణం లో ఎఫ్ఆర్ పి ని నిర్ధారించడం వారి కి మేలు చేసేదే అవుతుంది. 

చెరకు కు ‘యుక్తమైన, ఇంకా లాభదాయకమైనటువంటి ధర’ ను చెరకు (నియంత్రణ) ఉత్తర్వు, 1966 లో భాగం గా నిర్ధారిస్తుంటారు.  దీని ని దేశవ్యాప్తం గా ఏక రీతి న వర్తింపచేయడం జరుగుతుంది.


 

***


(Release ID: 1647062) Visitor Counter : 142