ఆయుష్

'ధన్వంతరి రథ్’ ద్వారా ఢిల్లీ పోలీసుల కుటుంబాలకు అందుబాటులో - ఆయుర్వేద వైద్య సేవలు.

ఏ.ఐ.ఐ.ఏ. మరియు ఢిల్లీ పోలీసు శాఖ మధ్య కుదిరిన - అవగాహనా ఒప్పందం.

Posted On: 18 AUG 2020 7:29PM by PIB Hyderabad

ఢిల్లీ పోలీసుల నివాస కాలనీలలో ఆయుర్వేద నివారణ మరియు ప్రోత్సాహక ఆరోగ్య సేవలను విస్తరించడానికి వీలుగా, అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏ.ఐ.ఐ.ఏ) మరియు ఢిల్లీ పోలీసు శాఖ ఈ రోజు  ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి.  కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మద్దతుతో, ‘ధన్వంతరీ రథ్’ మరియు పోలీస్ వెల్నెస్ సెంటర్ల ద్వారా, ఏ.ఐ.ఐ.ఏ. ఈ సేవలను అందిస్తుంది. 

ఢిల్లీ పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.ఎన్. శ్రీవాస్తవ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రమోద్ కుమార్ పాథక్ సంతకాలు చేసిన అవగాహన ఒప్పందాన్ని ఇచ్చి పుచ్చుకున్నారు.  ఏ.ఐ.ఐ.ఏ. డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజా నేసారీ సమక్షంలో ధన్వంతరీ రథ్ ను జండా ఊపి ప్రారంభించారు. 

ఆయుర్వేద రోగనిరోధక శక్తిని పెంచే చర్యల ద్వారా ఢిల్లీ పోలీసుల వంటి ఫ్రంట్‌లైన్ కోవిడ్ యోధుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లక్ష్యంగా, ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తున్న ఏ.ఐ.ఐ.ఏ. మరియు ఢిల్లీ పోలీసు శాఖ మధ్య జాయింట్ వెంచర్ "ఆయురక్ష" ను ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ ప్రాజెక్టు కు కొనసాగింపుగా, ఇప్పుడు, ఆయుర్వేద నివారణ, ప్రోత్సాహక ఆరోగ్య పరిరక్షణ సేవలను ఢిల్లీ పోలీసు సిబ్బంది కుటుంబాలకు విస్తరించాలని నిర్ణయించారు. 

ఈ సందర్భంగా, శ్రీ పాథక్ మాట్లాడుతూ, ఏ.ఐ.ఐ.ఏ. మరియు ఢిల్లీ పోలీసుల జాయింట్ వెంచర్ ఈ రకమైన కార్యక్రమాలలో ఇది మొట్టమొదటిది మరియు ఇది చాలా విజయవంతమైంది మరియు ఇతరులకు ఆదర్శంగా నిలిచింది.  ఫ్రంట్‌లైన్ యోధులుగా ఢిల్లీ పోలీసులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.  2 నెలల వ్యవధిలో దాదాపు 80,000 మంది పోలీసు సిబ్బందికి ఆయురక్షా కిట్లను పంపిణీ చేసిన తరువాత, ఢిల్లీ పోలీసు సిబ్బందిలో, కోవిడ్-19 యొక్క సంఘటనలు, మరణాలు గణనీయంగా తగ్గాయి.  ఈ సేవలను ఇప్పుడు ఢిల్లీ పోలీసు కుటుంబాలకు కూడా విస్తరిస్తున్నారు. ధన్వంతరీ రథ్ మరియు పోలీస్ వెల్నెస్ సెంటర్లు ఏ.ఐ.ఐ.ఏ. యొక్క ఓ.పి.డి. సేవలను నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ పోలీసు కుటుంబాలకు ఆయుర్వేద నివారణ, ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ధన్వంతరీ రథ్ - ఆయుర్వేద ఆరోగ్య సంరక్షణ సేవల మొబైల్ యూనిట్ వైద్యుల బృందాన్ని కలిగి ఉంటుంది, వారు ఢిల్లీ పోలీసు కాలనీలను క్రమం తప్పకుండా సందర్శిస్తారు.  ఈ ఆయుర్వేద ఆరోగ్య సంరక్షణ సేవలు వివిధ వ్యాధుల సంభవం / ప్రాబల్యాన్ని తగ్గిస్తాయని మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థతో పాటు రోగికి ఖర్చు తగ్గించడం ద్వారా అక్కడి ఆసుపత్రులకు రెఫరల్ సంఖ్యను తగ్గిస్తుందని భావిస్తున్నారు.

ఢిల్లీ పోలీసు సిబ్బందిలో కోవిడ్-19 వ్యాప్తిని గణనీయంగా అంచనా వేయడానికి,  సమయం మరియు శాస్త్రీయంగా నిరూపితమైన రోగనిరోధక ఆయుర్వేద మందుల గురించి ప్రొఫెసర్ తనూజా నేసరీ ప్రత్యేకంగా వివరించారు.   నివారణ ఆరోగ్య సంరక్షణతో పాటు చికిత్స మరియు ప్రోత్సాహక ఆరోగ్య సంరక్షణ సేవలకు ఆయుర్వేద వైద్యం సమాన ప్రాముఖ్యతను ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. దినచర్య, రితుచర్య పద్ధతుల వంటి ఆయుర్వేద జీవనశైలి చర్యల ద్వారా పోలీస్ వెల్నెస్ సెంటర్లలోని సేవలు జీవనశైలిని మెరుగుపర్చడానికి మరింత ప్రాధాన్యతనిస్తాయని ప్రొఫెసర్ తనూజా  తెలియజేశారు. 

ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ, ఢిల్లీ పోలీసుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఎ.ఐ.ఐ.ఏ. చేసిన కృషిని ప్రశంసించారు.  ఢిల్లీ పోలీస్ శాఖ మరియు ఏ.ఐ.ఐ.ఏ. మధ్య  జాయింట్ వెంచర్ అత్యంత విజయవంతమైందని కూడా ఆయన ప్రశంసించారు.

*****



(Release ID: 1646834) Visitor Counter : 231