సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలోని ద్వారకలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ తావర్ చంద్ గెహ్లాట్
Posted On:
14 AUG 2020 6:31PM by PIB Hyderabad
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి శ్రీ తావర్ చంద్ గెహ్లాట్ న్యూఢిల్లీలోని ద్వారాకలో సెక్టార్-10లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ (ఎన్ఐఎస్ డి) కొత్త భవనాన్ని ఎలక్ర్టానిక్ మాధ్యమం సహాయంతో వర్చువల్ గా ప్రారంభించారు. సామాజిక సమస్యలైన మాదక ద్రవ్యాల నిరోధం, వయో వృద్ధులు/ ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, యాచకత్వ నిరోధం వంటి భిన్న అంశాలపై కృషి చేసే సామాజిక కార్యకర్తల మానవ వనరుల అభివృద్ధికి ఈ సంస్థ కృషి చేస్తుందని శ్రీ గెహ్లాట్ తన ప్రారంభోపన్యాసంలో అన్నారు. కేంద్రప్రభుత్వ నిర్వహణలోని సామాజిక సంరక్షణ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందరికీ అందుబాటులో ఉంచుతుంది. అలాగే ఈ రంగంలో శిక్షణ, పరిశోధనకు సహాయపడడంతో పాటు మాదక ద్రవ్యాల డిమాండు తగ్గింపు, వయోవృద్ధుల జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద వివిధ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తుంది.
ఈ సందర్భంగా ఎన్ఐఎస్ డి డైరెక్టర్ డాక్టర్ వీరేంద్ర సింగ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కొత్త భవనం గురించి వివరించారు.
మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడం, వయో వృద్ధుల సంక్షేమానికి కృషి చేయడం, యాచకత్వం, ట్రాన్స్ జెండర్ల సంక్షేమం వంటి ఇతర సామాజిక సమస్యలపై పోరాడడం ఎన్ఐఎస్ డి ప్రధాన కార్యకలాపాలు. సామాజిక సమస్యల విభాగంలో ఈ సంస్థ పరిశోధన నిర్వహించడంతో పాటు ఆ సమస్యలకు సంబంధించిన గణాంకాలను సమీకృతం చేసి విశ్లేషిస్తుంది. ప్రాజెక్ట్ మానిటగరింగ్ విభాగం (పిఎంయు) ద్వారా ఆ సంస్థ కేంద్రప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహణలోని వివిధ స్కీమ్ ల అమలును పర్యవేక్షిస్తుంది. మాదక ద్రవ్యాల వినియోగం నిరోధించడం, యాచకత్వ నిరోధం, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమం వంటి భిన్న సామాజిక సమస్యలపై ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిర్వహణలోని సంబంధిత శాఖల అధికారులు, సర్వీస్ ప్రొవైడర్లు/ సంరక్షకులు, సామాజిక విద్యా సంస్థలు, సంబంధిత ఇతర విద్యాసంస్థల విద్యావేత్తలు, వృత్తి నిపుణులకు శిక్షణ ఇస్తుంది.
ఎన్ఐఎస్ డిలో మూడు ప్రధాన విభాగాలుంటాయి. అవి మాదక ద్రవ్యాలనిరోధక జాతీయ కేంద్రం (ఎన్ సిడిఏపి); వయోవృద్ధుల సంరక్షణ, సామాజిక రక్షణ విభాగాలు. ఎన్ సిడిఏపి సమాజాన్ని ప్రభావవంతం చేసే నాయకుల సహాయం, వివిధ రాష్ర్టాల్లో ఏర్పాటు చేసే ఔట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్ల ద్వారా జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాల డిమాండును తగ్గించడానికి కృషి చేస్తుంది. వయోవృద్ధుల సంరక్షణ విభాగం దేశంలోని వయోవృద్ధుల సంరక్షణ, సంక్షేమం కోసం కృషి చేసే వృత్తినిపుణుల కేడర్ తయారుచేయడానికి వివిధ కార్యక్రమాలు/ సర్టిఫికెట్ కోర్సులు నిర్వహిస్తుంది. ప్రాంతీయ రీసోర్స్ శిక్షణ కేంద్రాలు (ఆర్ఆర్ టిసి), ఇతర ప్రాముఖ్యతా సంస్థల సహకారంతో వివిధ కోర్సులను నిర్వహిస్తుంది. సామాజిక రక్షణ విభాగం సామాజిక రక్షణకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వాధికారులు/ ఎన్ జిఓలు/ పంచాయత్/ పోలీసు సిబ్బంది, సామాజిక సేవా వృత్తి నిపుణులకు యాచకత్వ నిరోధం, ట్రాన్స్ జెండర్ సంక్షేమం విభాగాలపై అవగాహన కల్పించడంతో పాటు జాతీయ స్థాయిలో నిర్వహించే ఒక నెల కాలపరిమితి గల శిక్షణ కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్వల్పకాల వ్యవధి కార్యక్రమాల ద్వారా శిక్షణ ఇస్తుంది. అలాగే ఎన్ఐఎస్ డి అంతర్గత విభాగాల సహాయంతో ఆర్ఆర్ టిసి, ప్రభుత్వ నిధులతో పని చేసే వివిధ సంస్థల సహకారంతో శిక్షణ, సామర్థ్యాల నిర్మాణం కార్యక్రమాలు నిర్వహించి సామాజిక రక్షణ రంగంలో కార్యకర్తల బలం పెంచేందుకు కృషి చేస్తుంది.
***
(Release ID: 1646011)
Visitor Counter : 113