సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఉపరాష్ట్రపతి మూడోసంవత్సరం పదవీకాల విశేషాలపై పుస్తకాన్ని విడుదల చేయనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీరాజ్‌నాథ్ సింగ్
పుస్తకం ఈ -వర్షన్ ను ఆవిష్కరించనున్న కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్
Posted On:
10 AUG 2020 2:27PM by PIB Hyderabad
ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు మూడో ఏడాది పదవీ కాల విశేషాలను వివరించే , ‘కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్’ పుస్తకాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 11,2020న ఉపరాష్ట్రపతి నివాసంలో ఆవిష్కరించనున్నారు. శ్రీ వెంకయ్యనాయుడు ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు.
ఈ పుస్తకం ఎలక్ట్రానిక్ వర్షన్ ను ( ఈ- బుక్ ను) కేంద్ర సమాచార ప్రసార శాఖమంత్రి శ్రీ ప్రకాశ్ జవదేకర్ విడుదల చేస్తారు. ఈ పుస్తకం సుమారు 250 పేజీలు పైగా ఉంటుంది. దీనిని సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన పబ్లికేషన్సు డివిజన్ ప్రచురించింది.
ఈ పుస్తకంలో ఉపరాష్ట్రపతి వివిధ కార్యకలాపాలకు అక్షరరూపంతో పాటు చిత్రాలు కూడా ఉన్నాయి. ఉపరాష్ట్రపతి దేశ విదేశాలలో పర్యటన విశేషాలు, రైతులు,శాస్త్రవేత్తలు, డాక్టర్లు, యువత, పాలనాయంత్రాంగం, పరిశ్రమ నాయకులు, కళాకారులు ఇలా వివిధ వర్గాల వారితో వారు జరిపిన సంభాషణలు ఇందులో ఉన్నాయి.
ఉపరాష్ట్రపతి విదేశీ పర్యటనలు, ప్రపంచ నాయకులతో వారి సమావేశాలు, వివిధ దేశాలలో భారత సంతతి నుద్దేశించి వారు చేసిన ప్రసంగాలు ఇందులో ఉన్నాయి.
రాజ్యసభ చురుకుగా పనిచేసేందుకు శ్రీ వెంకయ్యనాయుడు తీసుకువచ్చిన మార్పులు, ఫలితంగా రాజ్యసభ పనితీరులో కనిపించిన మెరుగుదల కూడా ఇందులో ప్రస్తావించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఉపరాష్ట్రపతి తమ సమయాన్ని ఎలా వెచ్చించిందీ ఈ పుస్తకం చివరి చాప్టర్‌లో ప్రస్తావించారు. ఉపరాష్ట్రపతి తన స్నేహితులు, ఉపాధ్యాయులు, చిరకాల సన్నిహితులు, పాత, కొత్త తెలిసినవారు, బంధువులు, ఎంపీలు, ఆథ్యాత్మిక వేత్తలు, జర్నలిస్టులు, ఇతరులతో మాట్లాడి వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్న విషయాలూ ఇందులో ప్రస్తావించారు. ఉపరాష్ట్రపతి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, పార్లమెంటు ఉభయ సభలలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రాజ్యసభలోని అందరు ఎంపీలతో టెలిఫొన్‌లో మాట్లాడారు.
***
(Release ID: 1644810)
Visitor Counter : 278