ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వరుసగా నాలుగో రోజు కూడా 24 గంటల్లో 6 లక్షలకు మించి పరీక్షలు

ఇప్పటిదాకా 2.27 కోట్లు పైబడ్డ పరీక్షలు

ప్రతి పదిలక్షలకూ పెరుగుతున్న పరీక్షలు, నేడు 16513

Posted On: 07 AUG 2020 7:05PM by PIB Hyderabad

పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే త్రిముఖ వ్యూహం మీద దృష్టి సారించిన భారత్ వరుసగా నాలుగో రోజు కూడా ఆరు లక్షలకు  పైబడి కోవిడ్ పరీక్షలు జరిపింది. దేశవ్యాప్తంగా అవిచ్ఛిన్నంగా విస్తరిస్తున్న లాబ్ ల నెట్ వర్క్ ఇందుకు దోహదం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,39,042  పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు భారత్ లో 2,27,88,393 పరీక్షలు జరిగాయి. ఆ విధంగా ప్రతి పదిలక్షల మందిలో 16513. మందికి పరీక్షలు చేసినట్టయింది.

రోజువారీ పరీక్షల వారం సగటు చెప్పుకోదగినంతగా మెరుగుపడుతోంది. 2020 జులై14న పరీక్షల సంఖ్య 2.69 లక్షలు కాగా 2020 ఆగస్టు6న 5.66 లక్షలకు చేరింది.

 

test.jpg


మొత్తం పరీక్షల సంఖ్య 2020 జులై14న 1.2 కోట్లు కాగా 2020 ఆగస్టు 6నాటికి 2.2 కోట్లకు చేరుకుంది. ఎక్కువ పరీక్షలు జరపటం వలన  పాజిటివ్ గా నిర్థారణ అయినవారి సంఖ్య కూడా బాగా పెరుగుతున్నట్టు మొదట్లో అనిపించినా, ఆ తరువాత తగ్గుముఖం పడుతుందనటానికి ఢిల్లీ అనుభవం ఉదాహరణగా నిలిచింది. సకాలంలో ఐసొలేషన్ కి పంపటం, సోకే అవకాశమున్నవారు ఆనవాలు పట్టటం, పాజిటివ్ గా తేలినవారికి సరైన చికిత్స లాంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయి.

positivity.jpg


పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే త్రిముఖ వ్యూహం విజయవంతంగా అమలు చేయటానికి పనికొచ్చిన అంశం దేశవ్యాప్తంగా అవిచ్ఛిన్నంగా విస్తరిస్తున్న లాబ్ ల నెట్ వర్క్. ఇప్పుడు దేశంలోని లాబ్ ల నెట్ వర్క్ లో మొత్తం 1383 లాబ్స్ ఉండగా అందులో ప్రభుత్వ రంగంలో 931, ప్రైవేట్ రంగంలో 452 ఉన్నాయి. వాటి వివరాలు ఇవి:

తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ :  701 (ప్రభుత్వ:  423 + ప్రైవేట్:  278)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 573  (ప్రభుత్వ: 476+ ప్రైవేట్: 97)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 109  (ప్రభుత్వ: 32  + ప్రైవేట్ 77 )


కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

 

****


(Release ID: 1644269) Visitor Counter : 237