ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

‘ఆత్మ నిర్భర్ భారత్ యాప్ ఆవిష్కరణ ఛాలెంజ్’ కింద తుది జాబితాకు ఎంపికైన అభ్యర్థులు రేపు జరిగే మెగా హ్యాకథాన్ ‌లో తమ యాప్ లను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు.

Posted On: 06 AUG 2020 8:45PM by PIB Hyderabad

2020 ఆగస్టు 7వ తేదీన నిర్వహించే, మెగా హాకథాన్ లో ‘ఆత్మ నిర్భర్ భారత్ యాప్ ఆవిష్కరణ ఛాలెంజ్’ కింద తుది జాబితాకు ఎంపికైన అభ్యర్థులు తాము రూపొందించిన యాప్‌లను ప్రదర్శిస్తారు.  మైగోవ్ ఇండియా మరియు డిజిటల్ ఇండియా యొక్క సోషల్ మీడియా వేదికలపై ఈ మెగా హాకథాన్ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యక్షంగా ప్రసారమవుతుంది. 

‘ఆత్మ నిర్భర్ భారత్ యాప్ ఆవిష్కరణ ఛాలెంజ్’ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 2020 జూలై 4వ తేదీన ప్రారంభించారు.  దేశవ్యాప్తంగా 6,940 మంది సాంకేతిక సంస్థల వ్యవస్థాపకులు మరియు అంకురసంస్థల ప్రతినిధులు ఈ పోటీలో పాల్గొన్నారు.  మెగా ఛాలెంజ్‌ లో వ్యాపారం, ఇ-లెర్నింగ్, వినోదం, క్రీడలు, ఆరోగ్యం, వార్తలు, కార్యాలయం, ఇంటి నుండి పని, సమాజం మరియు ఇతర అంశాలు అనే  తొమ్మిది వేర్వేరు విభాగాలలో  దరఖాస్తులను ఆహ్వానించారు. 

పారిశ్రామిక రంగం, విద్యారంగం మరియు ప్రభుత్వ నిపుణులతో కూడిన న్యాయనిర్ణేతల సంఘం సభ్యులు ఈ యాప్ లను విశ్లేషించారు.  2020 జూలై, 31వ తేదీ నుండి 2020 ఆగస్టు, 4వ తేదీ వరకు 5 రోజులపాటు ప్రదర్శించిన ఈ యాప్ లను పరిశీలించిన అనంతరం వారు తుది జాబితాను రూపొందించారు.  దేశవ్యాప్తంగా ఉన్న వర్ధమాన పారిశ్రామికవేత్తలు అన్ని విభాగాలలోనూ వినూత్న పరిష్కారాలను ప్రదర్శించడంతో, తుది జాబితాను రూపొందించడం న్యాయ నిర్ణేతలకు ఒక సవాలుగా నిలిచింది.  

అన్ని విభాగాలలో అగ్రశ్రేణిలో నిలిచిన అభ్యర్థులు, తమ యాప్ లను 2020 ఆగష్టు,  7వ తేదీన, మెగా హ్యాకథాన్ ద్వారా ప్రదర్శిస్తారు.  ఈ కార్యక్రమాన్ని, మైగోవ్ ఇండియా మరియు డిజిటల్ ఇండియా యొక్క సోషల్ మీడియా వేదికలపై, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నారు. 

ఆయా విభాగాలలో నాయకత్వ పాత్రను పోషించగలిగే అద్భుతమైన యాప్ లు ఈ పోటీ ద్వారా వెలుగులోకి రానున్నాయి.   ఈ పోటీలో మహిళా పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చేసిన అనేక యాప్ లు ఉన్నాయి.  విలువ మరియు విజయవంతమైన సంస్థలను సృష్టించడానికి ఆవిష్కరణ మరియు సాంకేతికత ఎలా సహాయపడుతుందో వారు చూపించారు.  మెట్రోపాలిటన్ నగరాలతో పాటు రెండవ, మూడవ స్థాయి పట్టణాలకు చెందిన సాంకేతికతను అభివృద్ధి చేసే ఔత్సాహికులు కూడా పాల్గొనడానికి ఈ ఆత్మ నిర్భర్ భారత్ యాప్ ఆవిష్కరణ పోటీ ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది.  ప్రపంచవ్యాప్తంగా యాప్ లను అభివృద్ధి చేస్తున్న ప్రముఖ దేశాలలో భారతదేశం ఒకటిగా ప్రదర్శించడానికి ఈ ఛాలెంజ్ దోహదపడింది. 

*****



(Release ID: 1643963) Visitor Counter : 126