శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

షేడ్ స్మార్ట్, రేడియంట్ శీతలీకరణ సాంకేతికతలు భవనాలలో సమర్థవంతమైన ఇంధన నిర్వహణ శీతలీకరణను ప్రోత్సహిస్తాయి

Posted On: 05 AUG 2020 1:08PM by PIB Hyderabad

దేశంలోని భవన నిర్మాణ రంగం ఇంధన వనరుల పొదుపు, సమర్థవంత నిర్వహణ గురించి అవగాహన వచ్చినా, ఇంకా దానిని నిర్మాణ రంగ పరిశ్రమతో సమర్థవంతంగా అనుసంధానించ లేకపోతోంది. భారతదేశంలోని వాతావరణ మండలాలు, విస్తీర్ణంగా ఉన్న నిర్మాణాల విషయంలో  గదులను చల్లగా ఉంచడానికి స్మార్ట్, డైనమిక్ షేడింగ్ పరికరాలు, ఎయిర్ కండిషనింగ్ కోసం తక్కువ ఇంధన వినియోగ సాంకేతికతలు ఇంధన పొదుపు, పురోగతికి సహాయపడతాయి.  వీటిలో ఎక్కువ భాగం అధిక-ఉష్ణోగ్రత పరిస్థితులను అనుభవిస్తుంది.

ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరి), కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భాగస్వామ్యంతో, నివాస, వాణిజ్య భవనాలలో కిటికీల కోసం వినూత్న బాహ్య షేడింగ్ పరిష్కారాన్ని అభివృద్ధి చేసింది.  ఇది హబిటాట్ మోడల్ ఫర్ ఎఫిషియెన్సీ అండ్ కంఫర్ట్ ప్రాజెక్ట్ కింద ఉంది. షేడింగ్ సిస్టమ్ ఎయిర్ కండిషనింగ్, లైటింగ్‌లో తగ్గిన విద్యుత్ వినియోగంతో ఇండోర్ సౌకర్యాన్ని సాధించడానికి వినూత్నంగాను, ఖర్చు తక్కువ గల పరిష్కారంగా 'షేడ్‌స్మార్ట్' అని పేరుతో అభివృద్ధి చేశారు.
ఆధునిక భవనాలలో బాహ్య షేడింగ్ పరికరాలు సాధారణంగా తక్కువే.  ఇవి ఎక్కువగా మెరుస్తున్నవి, కర్టెన్ వాల్స్ తో ఉన్న భవనాలు. అవి సాధారణంగా శాశ్వత నిర్మాణాలు, కానీ నిర్వహణ, వీక్షణలకు ఆటంకం, ఆర్కిటెక్చర్ పరంగా క్లయింట్ ఆకాంక్షలకు అనుగుణంగా ఉండవు. దీనికి విరుద్ధంగా, షేడ్స్‌మార్ట్ సూర్యుడి గమనం బట్టి దాని ఆకృతీకరణను మారుస్తుంది. ఉదాహరణకు, సూర్యుడు తూర్పు దిశలో ఉన్నప్పుడు, తూర్పు ముఖభాగం కిటికీలు నీడగా ఉంటాయి, మధ్యాహ్నం సమయంలో సూర్యుడు దక్షిణ దిశలో ఉన్నప్పుడు వివిధ లక్షణాల మధ్య కాంతి తళుక్కులు లేని పగటి వెలుతురును అందిస్తుంది. నివాస భవనాలకు, వాణిజ్య భవనాలకు వాటిని ఆక్రమించుకునే తీరు, జరిగే కార్యకలాపాలకు అనుగుణంగా ఆకృతి తీరులో విభిన్నంగా ఉంటుంది. అందుకు ప్రతి ఆకృతిని వాటి పనితీరును సాఫ్ట్ వేర్ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. 

షేడ్ స్మార్ట్ వ్యాపారంలోకి ప్రవేశించింది. చిన్న థర్మల్ జోన్స్ లో ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో ఎయిర్ కండిషన్ల కన్నా తక్కువ ధారలోకి అందుబాటులో ఉంటాయి. గదిలో ఉన్నవారికి ఎక్కువ కాంతి, తక్కువ ఉష్ణోగత ఉంటుంది. ఖర్చు కూడా ఎయిర్ కండిషన్ తో పోలిస్తే తక్కువ. నివాసంలో ఉన్నవారికి సౌకర్యవంతంగాను, ఆరోగ్యకరంగాను ఉంటుంది.  

అంతర్జాతీయ మార్కెట్లో, అనేక కదిలే షేడింగ్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి, అయినప్పటికీ, షేడ్‌స్మార్ట్ స్థానికంగా భారతదేశంలో ఉత్పత్తి జరగడం వల్ల, ఇది ఆర్థికంగా లాభదాయకమైన ఇంధన-నిర్వహణ పరిష్కారంగా మారుతుంది, ఇది ఇంధన పొదుపు సాధించడానికి ప్రతి భవనం సమగ్రపరచవచ్చు.
 
రెండవ సాంకేతిక పరిజ్ఞానం, రేడియంట్ శీతలీకరణ, ఇక్కడ ప్రసరణ ఉష్ణ బదిలీ ద్వారా శీతలీకరణ సాధించబడుతుంది, సాధారణ ఉష్ణప్రసరణ ఎయిర్ కండిషనింగ్ కి ప్రతిగా ఇది సమర్థవంతంగా ఉంటుంది. నేషనల్ బిల్డింగ్ కోడ్‌లో రేడియంట్ శీతలీకరణను ఏకీకృతం చేసే ప్రక్రియ జరుగుతోంది. రేడియంట్ కూల్డ్ భవనాలు ఇంధన ఆదా (60-70%) అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రజలకు రేడియంట్ శీతలీకరణ సాంకేతికత అవలంబించడం సౌకర్యంగా ఉంటుంది.
 

[For further details, Minni Sastry (9886572122, minnim@teri.res.in),Vini Halve (9168669660, vini.halve@teri.res.in), Kiriti Sahoo (9916459169, kiriti.sahoo@teri.res.in), Hara Kumar Varma N.( 8884409809, hara.varma@teri.res.in) can be contacted.]

*****



(Release ID: 1643570) Visitor Counter : 191