గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
"ఐటీ ఆధారిత స్కాలర్షిప్ పథకాల ద్వారా గిరిజనుల సాధికారత" కి గాను స్కోచ్ గోల్డ్ అవార్డు అందుకున్న గిరిజన మంత్రిత్వ శాఖ
Posted On:
31 JUL 2020 7:35PM by PIB Hyderabad
"డిజిటల్ పాలన ద్వారా కోవిడ్ ని ఎదుర్కొంటున్నభారత్" పేరుతో 66వ స్కాచ్ 2020 పోటీలలో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ పాలుపంచుకుంది. ఆ ఫలితాలు నిన్న ప్రకటించారు. "ఐటీ ఆధారిత స్కాలర్షిప్ పథకాల ద్వారా గిరిజనుల సాధికారత" కి గాను స్కోచ్ గోల్డ్ అవార్డును గిరిజన మంత్రిత్వ శాఖ సాధించింది.
డిజిటల్ ఇండియా, ఈ-గవర్నెన్స్ అనే అంశాన్ని ఎంపిక చేసుకున్న గిరిజన శాఖ కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా సంకల్పం సాకారం అయ్యేలా చేస్తున్న అనేక సేవలు అందిస్తోంది. గిరిజన మంత్రిత్వ శాఖ 5 స్కాలర్షిప్ పథకాలనూ డిబిటి పోర్టల్ తో అనుసంధానం చేసింది. 2019 జూన్ 12న కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి శ్రీ అర్జున్ ముండా, సహాయ మంత్రి శ్రీమతి రేణుక సింగ్ సరోట నేతృత్వంలో తీసుకున్న చొరవ ఇది.
2019-20లో 5 స్కాలర్షిప్ పథకాలకు చెందిన రూ.2500 కోట్లు విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 30 లక్షల మంది విదార్థులు ఇలా లబ్ది పొందారు. రాష్ట్రాలు తమ వద్ద ఉన్న లబ్ధిదారుల వివరాలను పోర్టల్ ద్వారా అందించే సౌకర్యం కలిపించారు. ప్రతిపాదనలు, యుసీలు, ఎస్ఓఈ లను ఆన్ లైన్ లోనే రాష్ట్రాలు అనుసంధానం చేయవచ్చు. ఇప్పటి వరకు బడ్జెట్ విడుదలకు అనుసరించిన కాగిత ఆధార యుసి పర్యవేక్షణ విధానం రూపు రేఖలు మారిపోయాయి. అంత ఆన్ లైన్ లో చోటు చేసుకుంది. దీనితో స్కాలర్షిప్ ల విడుదలకు జాప్యం కాకుండా ప్రవేశాలు జరిగిన విద్య సంవత్సరంలోనే అవి మంజూరు అయ్యే వ్యవస్థ ఏర్పడింది.
గిరిజన మంత్రిత్వ శాఖ సిఈడిఎ (సెంటర్ ఫర్ డేటా అనలిటిక్స్)లో కూడా ప్రవేశించింది. దీని ద్వారా రాష్ట్రాల వారీగా డేటా విశ్లేషణ నివేదికలు రూపొందించి దీని ఆధారంగా పక్క ప్రణాళిక అమలు చేయడానికి వీలవుతుంది.
(Release ID: 1642885)
Visitor Counter : 157