రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఇండియన్ నావల్ అకాడమీ కమాండెంట్‌గా వైస్ అడ్మిరల్ ఎం.ఎ. హంపిహోలి బాధ్యతలు

Posted On: 27 JUL 2020 5:45PM by PIB Hyderabad

ఇండియన్ నావల్ అకాడమీ (ఐఎన్‌ఏ) కమాండెంట్‌గా వైస్ అడ్మిరల్ ఎం.ఎ. హంపిహోలి బాధ్యతలు స్వీకరించారు. 13 నెలలపాటు ఈ బాధ్యతలు నిర్వర్తించిన వైస్‌ అడ్మిరల్‌ దినేష్‌ కె. త్రిపాఠి నుంచి బాధ్యతలు స్వీకరించారు.

    ఐఎన్‌ఏ కమాండెంట్‌గా, 2019 జూన్‌ 12వ తేదీన వైస్‌ అడ్మిరల్‌ దినేష్‌ కె. త్రిపాఠి నియమితులయ్యారు. ఆయన హయాంలో మౌలిక, శిక్షణ సదుపాయాల్లో ఐఎన్‌ఏ గణనీయ మార్పును చూసింది. భారత నౌకాదళం, తీరరక్షణ దళాలు, మిత్రదేశాల కోసం అధికారులను నాయకులుగా మలచడంలో 50 ఏళ్ల ఉత్సాహభరిత సేవలు అందించినందుకు, వైస్‌ అడ్మిరల్‌ త్రిపాఠి హయాంలోనే, 2019 నవంబర్‌ 12వ తేదీన అకాడమీకి 'ప్రెసిడెంట్స్ కలర్' లభించింది. సంప్రదాయ "పుల్లింగ్‌ ఔట్‌" వేడుక ద్వారా ఆయకు మర్యాదపూర్వక వీడ్కోలు లభించింది.

    వైస్‌ అడ్మిరల్‌ హంపిహోలి, ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ, కరంజాలోని కాలేజ్‌ ఆఫ్‌ నావల్ వార్‌ఫేర్, దిల్లీలోని ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ కాలేజీలో చదువుకున్నారు. యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌లో ఆయన నిపుణుడు. నాశక్‌, మగర్‌, తల్వార్‌ నౌకల్లో కమాండెంట్‌గా పనిచేశారు. 2003-05 మధ్యకాలంలో మారిషస్‌ నేషనల్‌ కోస్ట్‌ గార్డ్ కమాండెంట్‌గా, 2007-09 మధ్యకాలంలో గోవా నావల్‌ అకాడమీ కమాండింగ్‌ అధికారిగా విధులు నిర్వర్తించారు. తర్వాత, పదోన్నతుల ద్వారా వివిధ హోదాల్లో ఉన్నతస్థాయి సేవలు అందించారు.
    
    ఎజిమాలలోని ఇండియన్ నావల్ అకాడమీ ఎనిమిదో కమాండెంట్‌గా వైస్‌ అడ్మిరల్‌ హంపిహోలి సేవలు అందించారు. వైస్‌ ఆడ్మిరల్‌గా 2019 మార్చిలో పదోన్నతి పొంది, నావల్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా హోదాలో విధులు నిర్వర్తించారు. దేశానికి చేసిన సేవలకు గుర్తుగా 'నావో సేన పతకం', 'అతి విశిష్ఠ్‌ సేవ పతకం' అందుకున్నారు.

***
 


(Release ID: 1641726) Visitor Counter : 266