సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

కుమ్మ‌ర కుల సాధికార‌త‌ద్వారా స‌మ‌గ్ర అభివృద్ధి సాధన‌లో మేలి మ‌లుపు: శ‌్రీ అమిత్ షా

Posted On: 24 JUL 2020 6:02PM by PIB Hyderabad

వెన‌క‌బ‌డిన వ‌ర్గాల్లో ఒక‌టైన కుమ్మ‌ర కులంలో సాధికార‌త సాధన‌లో భాగంగా శిక్ష‌ణ పొందిన వంద‌మంది కుమ్మ‌ర క‌ళాకారుల‌కు వంద విద్యుత్ కుమ్మ‌రి చ‌క్రాల‌ను కేంద్ర‌మంత్రి శ్రీ అమిత్ షా పంపిణీ చేశారు. స్వ‌యం స‌మృద్ధి సాధ‌న‌కోసం భార‌త‌దేశం ప్ర‌వేశ‌పెట్టిన ఆత్మ‌నిర్భ‌ర్ కార్య‌క్ర‌మానికి అనుగుణంగా ప్ర‌భుత్వం ఈ అడుగు వేసింది. ఖాదీ మ‌రియు గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ ( కెవిఐసి) వారి స‌శ‌క్తికార‌ణ్ యోజ‌న కింద ఈ విద్యుత్ చ‌క్రాల‌ను పంపిణీ చేశారు. గాంధీన‌గ‌ర్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని క‌లోల్ తాలూకా బ‌ల్వా గ్రామంలో ఈ చ‌క్రాల‌ను పంపిణీ చేవారు. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ అమిత్ షా న్యూఢిల్లీనుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించారు. 
సంప్ర‌దాయ కుమ్మ‌రి క‌ళ‌ను పునరుద్ధ‌రించ‌డానికి, వెన‌క‌బ‌డిన కుల‌మైన కుమ్మ‌రుల‌ను ఆదుకోవ‌డానికి కుమ్హ‌ర్ స‌శ‌క్తికార‌ణ్ యోజ‌న వుప‌యోగ‌ప‌డుతుంద‌ని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఐదుగురు కుమ్మ‌రుల‌తో సంభాషించారు. 
మ‌న కుమ్మ‌రుల జీవితాల్లో వ‌స్తున్న మార్పు ఎంతో సంతోష‌దాయ‌క‌మైన‌ద‌ని, ప్ర‌జాప‌తి క‌మ్యూనిటీకి మెరుగైన ఉపాధి ల‌భించ‌డానికిగాను కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోంద‌ని కేంద్ర మంత్రి అన్నారు. విద్యుత్ చ‌క్రాల‌నేవి గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని అందిస్తున్న బ‌హుమ‌తి అని ఆయ‌న అన్నారు. 
కుమ్మ‌రుల ఉత్ప‌త్తులు మార్కెట్ కావ‌డానికి వీలుగా రైల్వేతో ప్ర‌త్యేక ఒప్పందం చేసుకోవ‌డం జ‌రిగింద‌ని..అలాగే ఒక స‌రైన మార్కెటింగ్ వేదిక‌ను క‌ల్పిస్తామ‌ని అన్నారు. బ‌ల‌హీన వ‌ర్గాల‌ను ఆదుకోవ‌డానికి కెవిఐసి త‌న ప‌థ‌కాల‌ద్వారా విశేష‌మైన కృషి చేస్తోంద‌ని ఈ సంద‌ర్భంగా శ్రీ అమిత్ షా ప్ర‌శంసించారు. 
ఈ సంద‌ర్భంగా కెవిఐసి అధ్య‌క్షులు శ్రీ వినయ్ కుమార్ స‌క్సేనా మాట్లాడుతూ ఇంత‌వ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా 17వేల విద్యుత్ కుమ్మ‌రి చ‌క్రాల‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మం కుమ్మ‌రుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని కుమ్మ‌రి ఉత్ప‌త్తుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని అన్నారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి రోజూ 2 కోట్ల తేనీరు పాత్ర‌లు త‌యార‌వుతున్నాయ‌ని వాటిని దేశ‌వ్యాప్తంగాగ‌ల 400 రైల్వే స్టేష‌న్ల‌లో వినియోగిస్తున్నార‌ని, రైల్వే స్టేష‌న్ల‌నేవి వాటికి స‌రైన మార్కెట్ వేదిక‌లుగా మారాయ‌ని ఆయ‌న అన్నారు. 
గుజ‌రాత్ లోని ప‌లు ప్రాంతాల్లో ముఖ్యంగా కుఛ్‌, సౌరాష్ట్రా ప్రాంతాల్లో సంప్ర‌దాయ కుమ్మ‌రి క‌ళకు జ‌నాద‌ర‌ణ వున్న విష‌యం తెలిసిందే. 2018లో కుమ్హ‌ర్ స‌శ‌క్తికార‌ణ యోజ‌న ప్రారంభ‌మైన త‌ర్వాత గుజార‌త్ లోని ప‌లు గ్రామాల‌కు చెందిన 750 మంది కుమ్మ‌రుల‌కు శిక్ష‌ణ ఇచ్చారు. వారికి శిక్ష‌ణ ఇవ్వ‌డ‌మే కాకుండా విద్యుత్ చ‌క్రాల‌ను, ఇత‌ర యంత్రాల‌ను , ప‌రికరాల‌ను ఉచితంగా అందించారు. వీటి కార‌ణంగా కుమ్మ‌రులు చాలా సులువుగా ప‌లు ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేస్తున్నారు. వారికి ఆదాయం కూడా 3-4 రెట్లు పెరిగింది. 

***
 



(Release ID: 1641054) Visitor Counter : 155