శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సరసమైన ధరకు ఫావిపిరవిర్‌ను అందుబాటులోకి తెచ్చేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన సీఎస్ఐఆర్
- దీనిని వినియోగించి ఔషధ ఉత్పత్తి చేపట్టనున్న మెస్సర్స్ సిప్లా సంస్థ
- త్వరలోనే పునర్నిర్మించిన ఔషధపు తయారీ పెంచడంతో పాటు ఆవిష్కరణ
Posted On:
23 JUL 2020 8:13PM by PIB Hyderabad
కోవిడ్ -19 రోగులకు ముఖ్యంగా తేలికపాటి మరియు మితమైన రోగ లక్షణాలు కలిగిని వారి చికిత్స కోసం జపాన్‌లోని ఫుజి చేత ఆవిష్కరించబడిన ఆఫ్ పేటెంట్ యాంటీ-వైరల్ ఔషధం ఫావిపిరవిర్ క్లినికల్ ట్రయల్స్‌లో ఆశాజనకంగా నిలిచింది. ఈ ఔషధం తయారీకి గాను అవసరమైన చురుకైన ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్(ఏపీఐ) సంశ్లేషణకు మన వద్ద స్థానికంగా లభించే రసాయనాల్ని ఉపయోగించి సీఎస్ఐఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్-ఐఐసీటీ) తక్కువ ఖర్చుతో కూడుకున్న ఒక ప్రక్రియను అభివృద్ధి చేసింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సంస్థ ప్రముఖ ఔషధ పరిశ్రమ మెస్సర్స్ సిప్లా లిమిటెడ్‌కు బదిలీ చేసింది. సిప్లా ఔషధ సంస్థ తమ ఉత్పాదక కేంద్రంలో ఈ ప్రక్రియను మరింతగా పెంచేందుకు, మరియు భారత దేశంలో ఉత్పత్తిని ప్రారంభించడానికి డీసీజీఐ అనుమతి కోరింది. మన దేశంలో ఈ ఫావిపిరవిర్ వాడకంనకు డీసీజీఐ పరిమితం చేయబడిన అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చినందున, సిప్లా సంస్థ ఇప్పుడు కోవిడ్ -19 తో బాధపడుతున్న రోగులకు సహాయపడేందుకు గాను ఉత్పత్తిని ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. ఈ ఏపీఐ అభివృద్ధిపై సీఎస్ఐఆర్-ఐఐసీఆర్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సీఎస్ఐఆర్- ఐఐసీటీ అందించిన సాంకేతిక పరిజ్ఞానం చాలా సమర్థవంతంగా పని చేస్తుందని, ఇది సరసమైనదని, తక్కువ వ్యవధిలో సిప్లా పెద్ద మొత్తంలో ఔషధాన్ని ఉత్పత్తి చేసేందుకు గాను వీలు కల్పిస్తోందని అన్నారు. కోవిడ్-19ను తగ్గించడానికి వేగవతంమైన పరిష్కారాలు మరియు ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో సీఎస్‌ఐఆర్ పరిశ్రమతో కలిసి పనిచేస్తోందని సీఎస్‌ఐఆర్ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మాండే అభిప్రాయపడ్డారు. పునర్నిర్మించిన ఔషధాలను వేగంగా ట్రాక్ చేయడంలో సీఎస్‌ఐఆర్ ఎలా కట్టుబడి ఉందో చెప్పడానికి సిప్లాతో తమ భాగస్వామ్యం ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు.
# కోవిడ్19తో సీఎస్ఐఆర్ పోరు
(Release ID: 1640816)
Visitor Counter : 212