బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు మంత్రిత్వ శాఖలో మొక్కలునాటే ప్రచార కార్యక్రమం -2020 ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషి సమక్షంలో పర్యావరణపార్కులు/పర్యాటక ప్రదేశాలకు శంకుస్థాపన చేసిన శ్రీ అమిత్ షా
వాతావరణ మార్పు ప్రపంచంపై పెను ప్రభావం చూపుతోంది , ఈ సంక్షోభానికి పచ్చదనమే పరిష్కారం : శ్రీ అమిత్ షా
ప్రధానమంత్రి పిలుపు ఇచ్చిన ఆత్మనిర్భర భారత్ సాకారం చేయడానికి బొగ్గు దిగుమతులపై ఏ మాత్రం ఆధారపడకుండా భారత్ ముందుకు వెళ్లడమే లక్ష్యం : కేంద్ర హోం మంత్రి
లోకమాన్య బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి రోజునే చెట్ల పెంపకం ప్రచార కార్యక్రమం కూడా జరుగుతున్న నేడు ముఖ్యమైన రోజని, అందువల్ల లోకమాన్య తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జ్ఞాపకార్థం ఎకోపార్కులు, టూరిజం ప్రదేశాలకు వారి పేర్లు పెట్టాలని బొగ్గు మంత్రిత్వ శాఖకు సూచించిన శ్రీ అమిత్ షా.
"10 రాష్ట్రాల్లో 38 జిల్లాల్లో 130కి పైగా ప్రదేశాలలో 6 లక్షల చెట్ల పెంపకం చేపట్టిన బొగ్గు మంత్రిత్వ శాఖను అభినందిస్తున్నాను": కేంద్ర మంత్రి
Posted On:
23 JUL 2020 6:19PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషి సమక్షంలో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన "వృక్షారోపణ్ అభియాన్" ను ప్రారంభించారు. తన నివాసం నుండి జరిగిన కార్యక్రమంలో, కేంద్ర హోంమంత్రి 6 ఎకోపార్కులు/ టూరిజం సైట్లకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శంకుస్థాపన చేశారు. బొగ్గు / లిగ్నైట్ కలిగిన 10 రాష్ట్రాల 38 జిల్లాల్లో 130 కి పైగా ప్రదేశాలలో చెట్ల పెంపకం ప్రచారం ప్రారంభం అయింది. శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, "10 రాష్ట్రాల 38 జిల్లాల్లో విస్తరించి ఉన్న 130 కి పైగా ప్రదేశాలలో 6 లక్షల చెట్లను నాటినందుకు బొగ్గు మంత్రిత్వ శాఖను అభినందిస్తున్నాను." అని అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి మాట్లాడుతూ వాతావరణ మార్పు ప్రపంచాన్ని ప్రభావితం చేసిందని, ఈ సంక్షోభానికి పచ్చదనం మాత్రమే పరిష్కారం అని అన్నారు. "ప్రకృతిని దోపిడీ చేయకూడదని, బదులుగా ప్రకృతికి మద్దతు ఇవ్వాలి అని మన సంస్కృతి నొక్కి చెప్పింది. భారతీయ వారసత్వ మూల మంత్రం ఏమిటంటే మనం సహజ వనరులను ఉపయోగించుకోవాలి, వాటిని దోపిడీ చేయకూడదు. ఈ సూత్రాన్ని స్వప్రయోజనాల కోసం విస్మరించాము, ఇది ఓజోన్ పొర క్షీణతకు దారితీసింది ఓజోన్ పొర రంధ్రం ఏర్పడింది, దీని ఫలితంగా గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులకు దారితీసింది. చెట్లు మానవాళికి స్నేహితులు వంటివి. పచ్చదనం మాత్రమే ఈ సంక్షోభం నుండి బయటపడించగలదు అని మన ఋషులు పురాణాలలో పేర్కొన్నారు. చెట్లు మనకు ప్రాణవాయువును ఇస్తాయి, ”అని శ్రీ అమిత్ షా అన్నారు.
“100-150 సంవత్సరాలు మానవాళికి సేవ చేయగల అనేక వృక్ష జాతులు ఉన్నాయి. 100% ఆక్సిజన్ ఇచ్చే చెట్లలో రావి చెట్టు ఒకటి; అందుకే శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు... చెట్లలో తాను రావి చెట్టు అని చెప్పాడు; తనను తాను రావి చెట్టుతో సమానంగా వర్ణించుకోవడం ద్వారా రావి చెట్టు ప్రాముఖ్యతను చాటాడు” అని శ్రీ అమిత్ షా అన్నారు. ఇది మన పురాణ గ్రంథాలలో ఇలా చెప్పారు అని శ్రీ అమిత్ షా చెప్పారు:
దశకృప సమావాపీ, దశవాపీ సమోహృదః
దశహృద సమోపుత్రో, దశపుత్ర సమోదృమః
[ఒక చెరువు 10 బావులకు సమానం, పది చెరువులకు సమానమైనడి ఒక సరస్సు;
ఒక కొడుకు పది సరస్సులకు సమానమైనవాడు, ఒక చెట్టు పది మంది కుమారుల మిన్నగా భూమిని పరిరక్షించడానికి దోహదం చేస్తుంది]
బొగ్గు కోసం పెరుగుతున్న డిమాండ్‌ను నెరవేర్చడానికి బొగ్గు రంగం నేడు సిద్ధంగా ఉండటమే కాకుండా పర్యావరణ స్థిరత్వం పట్ల సమానంగా సున్నితంగా ఉందని హోం మంత్రి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం వివిధ బొగ్గు ప్రాంతాల పునరుద్ధరణ, అటవీకరణను ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. మైనింగ్ ప్రాంతాల అభివృద్ధి కోసం రూ .39,000 కోట్ల కార్పస్‌తో జిల్లా ఖనిజ నిధిని ప్రధాని ఏర్పాటు చేశారని, 35,000 చిన్న ప్రాజెక్టులు పూర్తయ్యాయని శ్రీ అమిత్ షా తెలిపారు. బొగ్గు రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన స్తంభం అని, రాబోయే కాలంలో దాని ప్రాముఖ్యతను నిలుపుకుంటుందని ఆయన అన్నారు
ప్రధానమంత్రి నాయకత్వంలో బొగ్గు మంత్రిత్వ శాఖ ‘సులభతర వాణిజ్యం’, ఆత్మీనిర్భర్ భారత్ వైపు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. పిఎం ఆత్మనీర్భర్ ప్రచారాన్ని అనుసరించి, బొగ్గు దిగుమతులను సున్నాకి తగ్గించే దిశగా భారత్ కదులుతోంది. 2023-24 నాటికి బొగ్గు ఉత్పత్తి ఒక బిలియన్ టన్నుల (వార్షిక) లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది.
"బొగ్గు పిఎస్‌యులు, వాటితో కలిపి పనిచేస్తున్న గనుల నిర్వాహకులు కూడా ఉత్పత్తిని పెంచడానికి చర్యలు ప్రారంభించారు, 2020-24 మధ్య కాలంలో మౌలిక సదుపాయాల పెట్టుబడి పథకం కింద రూ .1,25,000 కోట్ల పెట్టుబడిని 534 ప్రాజెక్టులు గుర్తించాయి" అని ఆయన చెప్పారు.
*****
(Release ID: 1640773)
Visitor Counter : 293