రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఉరాన్‌లోని నావల్‌ స్టేషన్‌ కరంజాలో రెండు మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంటు ప్రారంభం

Posted On: 21 JUL 2020 7:50PM by PIB Hyderabad

పశ్చిమ నౌకాదళ స్థావరంలో తొలిసారిగా రెండు మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్‌ ప్లాంటును వైస్‌ అడ్మిరల్‌ అజిత్‌ కుమార్‌ ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. 

    ఈ సౌర విద్యుత్‌ ప్లాంటును నావల్‌ స్టేషన్‌ కరంజాలో నిర్మించారు. ఈ ప్రాంతంలోనే ఇది అతి పెద్దది. 100 శాతం దేశీయంగా తయారైన సౌర ఫలకాలు, ట్రాకింగ్‌ టేబుళ్లు, ఇన్వర్టర్లతో ఈ ప్లాంటును ఏర్పాటు చేసి, గ్రిడ్‌కు అనుసంధానించారు. దీనిపై కంప్యూటర్ల ద్వారా పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. 'సింగిల్ యాక్సిస్ సన్ ట్రాకింగ్ టెక్నాలజీ'ని ప్లాంటు నిర్మాణంలో ఉపయోగించారు.

    నౌకాదళ స్థావరానికి కావలసిన విద్యుత్‌ అవసరాలు తీర్చడానికి.., సౌరశక్తిని, పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించుకోవటానికి భారత నౌకాదళం వేసిన కీలక అడుగు ఈ ప్రాజెక్టు. 

***



(Release ID: 1640306) Visitor Counter : 205