యు పి ఎస్ సి
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సీఎస్ఈ-2019 అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) నిర్వహించనున్న యూపీఎస్‌సీ
Posted On:
20 JUL 2020 3:11PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్ష -2019, పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) నిర్వహించేందుకు గాను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సన్నద్ధమైంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2019 (సీఎస్ఈ- 2019) ఎంపికల కోసం కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2,304 మంది అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్‌లు (పీటీ) / ఇంటర్వ్యూలు నిర్వహించే సమయంలో కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కమిషన్ కూడా ఈ విషయాన్ని సమీక్షించి సీఎస్ఈ -2019కి సంబంధించి మిగిలిపోయిన 623 అభ్యర్థులకు పీటీ బోర్డులను 23.03.2020వ తేదీ నుండి వాయిదా వేయాలని నిర్ణయించింది. కోవిడ్ లాక్‌డౌన్ దశల వారీగా ఎత్తివేయడంతో ఈ నెల 20 నుండి 30వ తేదీ వరకు మిగిలిన అభ్యర్థుల కోసం పీటీలను నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆయా అభ్యర్థులందరికీ ముందుగానే తగిన సమాచారం ఇచ్చింది. కమిషన్ అభ్యర్థులు, నిపుణులైన సలహాదారులు మరియు సిబ్బంది యొక్క భద్రత మరియు ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. రైలు సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో పీటీల కోసం వచ్చే అభ్యర్థులకు అతి తక్కువ మొత్తంలో రానుపోను విమాన ఛార్జీలను చెల్లించాలని కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా నిర్ణయించింది. కోవిడ్ నియంత్రితమైన లేదా ఇతర పరిమితం చేయబడిన ప్రాంతాలలో నివసిస్తున్న పీటీల నిమిత్తం ఈ-సమన్ లెటర్స్ జారీ చేసింది. ఈ లెటర్స్ కలిగి ఉన్న అభ్యర్థులు పీటీల నిమిత్తం బయట వెళ్లడానికి అనుమతించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలను కమిషన్ అభ్యర్థించింది. కమిషన్ అభ్యర్థులకు వారి బస మరియు రవాణా అవసరాలకు తగిన విధంగా సహాయం చేయనుంది. వీరు కమిషన్‌కు చేరుకున్న తర్వాత, అభ్యర్థులందరికీ ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డ్, ఒక బాటిల్ శానిటైజర్ మరియు హ్యాండ్ గ్లోవ్స్‌తో కూడిన ‘సీల్డ్ కిట్’ అందించనున్నారు. ఇంటర్వ్యూ బోర్డులు సాధారణంగా సీనియర్ సలహాదారుల్ని కలిగి ఉంటాయి కాబట్టి, ఇంటర్వ్యూ చేసేవారిని సముచితంగా రక్షించడానికి కమిషన్ కాంటాక్ట్‌లెస్ పీటీల నిమిత్తం అన్ని ముందు జాగ్రత్త మరియు భద్రతా చర్యలను తీసుకుంది. పీటీలను నిర్వహించడంలో పాల్గొనే కమిషన్ సిబ్బందికి కూడా తగిన రక్షణ సామగ్రి ఉంటుంది. అన్ని గదులను, హాళ్లను , ఫర్నిచర్ మరియు సామగ్రిని క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా తగిన ఏర్పాట్లు చేశారు. అన్ని వేదికలలో పీటీ అభ్యర్థుల కోసం సీటింగ్ ఏర్పాట్లు సురక్షితమైన శారీరక దూరాన్ని ఏర్పాటు చేశారు. ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి గాను అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రోటోకాల్ /మార్గదర్శకలు సంబంధిత అభ్యర్థలకు ఇప్పటికే తెలియజేయబడ్డాయి. తన పరీక్షల ద్వారా అత్యంత సమర్థులైన అభ్యర్థులను ఎన్నుకోవాలనే రాజ్యాంగబద్ధమైన ఆదేశాన్ని నెరవేర్చడంతో పాటుగా వారి ఆరోగ్య భద్రత యొక్క అత్యున్నత ప్రమాణాలను నిర్ధారించడానికి కమిషన్ కట్టుబడి ముందుకు సాగుతోంది.
*****
(Release ID: 1640046)
Visitor Counter : 236