శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ నియంత్రిణ‌కు 16 టెక్నాల‌జీల అభివృద్ధి, ధ్రువీకరణ‌ల‌కు ఎన్ఆర్‌డీసీ నిధులు

Posted On: 17 JUL 2020 2:07PM by PIB Hyderabad

భార‌త ప్రభుత్వపు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డీఎస్ఐఆర్ కింద ప‌ని చేస్తున్న
'నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌'‌ (ఎన్‌ఆర్‌డీసీ) డీఎస్‌ఐఆర్ గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ ప్రమోషనల్ ప్రోగ్రాం కింద ఆవిష్కర్తల నుండి ప్రతిపాదనలను ఆహ్వానించింది. కోవిడ్ -19 సంబంధిత సాంకేతికతలను అభివృద్ధి చేయ‌డంతో పాటుగా వాణిజ్యీకరణ కోసం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి(పీడీటీసీ) విష‌య‌మై ఎన్‌ఆర్‌డీసీ ఈ ప్రతిపాదనలను ఆహ్వానించింది. కోవిడ్ -19కు సంబంధించి ట్రాకింగ్, టెస్టింగ్ & చికిత్స విభాగంలో టెక్నాలజీల అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో పాటు ప్రాసెస్ స్కేల్ అప్, పైలట్ ప్లాంట్ స్టడీస్, ఉత్పత్తి ధ్రువీకరణ / ప్రామాణీకరణ, రెగ్యులేటరీ అధికారుల వ‌ద్ద‌ ఉత్పత్తిని నమోదు చేయడం, ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించడం, టాక్సికాలజీ డేటా ఉత్పత్తి ప్రయోగశాల స్థాయి అభివృద్ధి మరియు పారిశ్రామిక అవసరాల మధ్య అంతరాల‌ను తగ్గించడం, తద్వారా వాణిజ్య ఉత్పత్తి మరియు ఉత్పత్తి యొక్క మార్కెటింగ్ త‌గిన విధంగా విజయవంతం చేసేందుకు గాను త‌గిన విధంగా ఆర్థిక స‌హాయం అందించ‌బ‌డుతుంది. ఈ ప్ర‌క‌ట‌న‌కు గాను దాదాపు ఎన్‌ఆర్‌డీసీ నుంచి నిధుల‌ను కోరుతూ దాదాపు 65 ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో మేటి ప్రాజెక్టుల‌ను ఎంపిక చేసేందుకు గాను ముగ్గురు సభ్యుల బాహ్య సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీ సాంకేతికంగా అనుబంధంగాను, మేటిగాను ఉన్న 16 ప్రాజెక్టులకు నిధుల మంజూరీని సిఫారసు చేసింది. నిధులు సమకూర్చే  ప్రాజెక్టుల‌లో.. కోవిడ్-19 యొక్క పరీక్ష, రోగం గుర్తింపు మరియు చికిత్స మరియు త‌గిన మద్దతు కోసం ఎంచుకున్న సాంకేతికతలు టెస్ట్ కిట్లు, శానిటైజర్స్, వెంటిలేటర్లు, పీపీఈలు, మాస్క్‌లు, కోవిడ్ హాస్పిటల్ ఎఫ్లూయెంట్స్ ట్రీట్‌మెంట్ త‌దిత‌ర అంశాలు ఉన్నాయి. నిధులు స‌మ‌కూర్చేందుకు గాను ఎంపికైన కొన్ని సంస్థ‌లు మరియు కంపెనీల‌లో ఐఐటీ ఢిల్లీ, సూర‌త్ న‌గ‌రానికి చెందిన స‌హ‌జానంద్ టెక్నాల‌జీస్ ప్రైయివేట్ లిమిటెడ్‌, ముంబ‌యి న‌గ‌రానికి చెందిన ఐడీఈఎంఐ, ముంబ‌యిలోని ఇండియ‌న్ నేవీకి చేందిన ఐఎన్ఎం, బెంగ‌ళూరుకు చెందిన ఓమిక్స్ రీస‌ర్చ్ అండ్ డ‌యోగ్నాస్టిక్స్ ల్యాబొరేట‌రీస్‌, న్యూఢిల్లీకి చెందిన వీబీఆర్ఐ ఇన్నోవేష‌న్స్ ప్ర‌యివేట్ లిమిటెడ్‌, ఎఫ్ఎఫ్‌డీసీ క‌నౌజ్‌, న్యూఢిల్లీకి చెందిన సీఐబీఏఆర్‌టీ, రుద్రానీ హాస్పిటాలిటీ సొల్యూష‌న్స్-ఢిల్లీ, భువ‌నేశ్వ‌ర్‌కు చెందిన ఎల్ఎన్ ఇండిటెక్ స‌ర్వీసెస్ ప్ర‌యివేట్ లిమిటెడ్‌తో పాటుగా.. కొన్ని విద్యా సంస్థ‌లు, కొందరు వ్య‌క్తిగ‌త ఆవిష్క‌ర్త‌ల ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.
కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు..
సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్.పురుషోత్తం మాట్లాడుతూ “వినూత్న సాంకేతిక పరిజ్ఞానాల‌ స్కేల్ అప్ మరియు ప్రోటోటైపింగ్ కోసం గ్రాంట్ ఫండ్ల లభ్యతలో భారీ అంతరం ఉంది. జాతీయ అత్యవసర ప‌రిస్థితులతో పాటుగా కోవిడ్-19ను ఎదుర్కోవటానికి త‌గిన‌ శక్తిని అందించడానికి ఎన్ఆర్‌డీసీ బృందం ఈ పథకాన్ని వేగంగా రూపొందించింది. ఈ ఆర్థిక సహకారం సాంకేతిక అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడంలో దేశీయ‌ ఆవిష్కర్తలు మరియు స్టార్టప్‌లకు సహాయపడి రాబోయే ఏడాది లోపు వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు దోహ‌దం చేస్తుంది.” అని అన్నారు. కోవిడ్-19 ను ఎదుర్కోవటానికి గాను ఎన్ఆర్‌డీసీ ఇండియన్ టెక్నాలజీస్‌తో కూడిన ఒక కాంపెడియంను అందుబాటులోకి తెచ్చింది అని ఆయ‌న అన్నారు. ఇందులో భారత సంస్థలు మరియు అంకుర సంస్థ‌లు అభివృద్ధి చేసిన 200 టెక్నాలజీలతో ఒక‌ జాబితాను రూపొందించిన‌ట్టుగా ఆయ‌న పేర్కొన్నారు. దేశంలో కోవిడ్‌-19 నియంత్ర‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఎన్‌ఆర్‌డీసీ తొమ్మిది టెక్నాలజీలను వివిధ అంకుర సంస్థ‌ల‌కు, ఎంఎస్‌ఎంఈలకు బ‌దిలీ చేసింది.

***



(Release ID: 1639382) Visitor Counter : 194