భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
స్వచ్ఛ పక్వాడాను పాటించిన హైదరాబాద్ లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(ఐఎన్‌సిఒఐఎస్)
Posted On:
15 JUL 2020 6:03PM by PIB Hyderabad
భారత ప్రభుత్వానికి చెందిన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన స్వతంత్ర సంస్థ హైదరాబాద్‌లోని,ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్ సి ఒ ఐ ఎస్). ఈ సంస్థ భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ కింద పనిచేస్తోంది. ఇది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన సమాచారం ఆధారంగా దేశానికి సముద్రానికి సంబంధించి ప్రత్యేక సమాచారాన్ని అందజేస్తున్నది. దీనివల్ల సముద్ర ప్రాంత భద్రత పెంపు ,లాభాలు గడించడానికి వీలు కలుగుతున్నది. ఈ సంస్థ అందించే మూడు ప్రధాన సేవలలో సునామీ ముందస్తు హెచ్చరిక సేవలు, సముద్ర స్థితిగతుల ముందస్తు సమాచారం, మత్స్య సంపద అధికంగా దొరికే అవకాశం ఉన్న జోన్లకు సంబంధించిన సూచనల వంటివి ఉన్నాయి.
హైదరాబాద్ లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌లో 2020 జూలై 15 వరకు స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాలు చేపట్టారు.ఇందుకు సంబంధించిన లక్ష్యాలకు అనుగుణంగా పలు అవగాహనా కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహించింది. అందులో ముఖ్యమంగా బహిరంగ మల విసర్జనను నిర్మూలించడం, ఘన, ద్రవ వ్యర్ధాల సమర్ధ నిర్వహణ,పర్యావరణ హితకరమైన , సుస్థిర పారిశుధ్యానికి సంబంధించి తగిన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై అవగాహన కల్పించడం, మొత్తంగా పరిశుభ్రత గురించిన అంశాలపై పలు కార్యక్రమాలు నిర్వహించింది. అలాగే ఐటిసి ఒషన్ క్యాంపస్‌లో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం హరిత హారం కింద అందజేసిన మొక్కలను నాటారు. ఐఎన్ సి ఒ ఐ ఎస్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి (హౌసి కీపింగ్, గార్డెనింగ్, సెక్యూరిటీ, ఎలక్ట్రికల్ తదితర విభాగాలవారికి) వ్యక్తిగత పరిశుభ్రత మెటీరియల్‌ను అందజేశారు. ఒకసారి మాత్రమే వాడకానికి పనికివచ్చే ప్లాస్టిక్ వాడబోమన్న ప్రతిజ్ఞ చేయడంతోపాటు క్యాంపస్‌లో పరిశుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు.
ప్రత్యేక ఈ -పోటీలు: పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన (వ్యక్తిగత పరిశుభ్రతపై), వ్యాసరచన (ఇంట్లో వ్యర్థాల నిర్వహణపైన)పోటీలు నిర్వహించారు. సముద్రాలపై స్వచ్ఛత ఏ రకంగా ప్రభావం చూపుతుందన్న అంశంపై ఈ -పోస్టర్ పోటీని ఉద్యోగులకు నిర్వహించారు. బహిరంగ మల విసర్జన రహిత భారత్: ఆంద్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా పై అధ్యయనం అంశంపై వెబినార్ తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ రిజిస్ట్రార్ శ్రీమతి జె.కిరణ్మయి 2020 జూలై 1న స్వచ్ఛపక్వాడా ప్రారంభించారు.మరో ప్రత్యేక వెబినార్ , స్వచ్ఛ సముద్ర ను ఐఎన్‌సిఒఐఎస్ శాస్త్రవేత్త డాక్టర్ నిమిత్ కుమార్ 2020 జూలై 13న నిర్వహించారు. ఈరోజు మరొక ప్రత్యేక వెబినార్ ను స్వచ్ఛ పక్వాడా ముగింపు సెషన్ సందర్భంగా, కొవిడ్ -19: సముద్రాలకు రక్షణా లేక కాలుష్యమా అనే అంశంపై ఐఎన్‌సిఒఐఎస్ శాస్త్రవేత్త శ్రీ శివయ్య బొర్రా నిర్వహించారు. ఈ పోటీలలో విజేతల పేర్లను కూడా ప్రకటించారు.
అన్ని వెబినార్లను ఐఎన్‌సిఒఐఎస్ యూట్యూబ్ ఛానల్ @INCOISofficial Hyderabad లో ఉచితంగా చూడవచ్చు.
****
(Release ID: 1638964)
Visitor Counter : 217