రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

10 సంవత్సరాల కన్నా తక్కువ సేవా అర్హత క‌లిగిన సాయుధ దళాల సిబ్బందికి 'ఇన్‌వాల్యూడ్ పెన్ష‌న్‌‌'ను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

Posted On: 15 JUL 2020 5:41PM by PIB Hyderabad

10 సంవత్సరాల కన్నా తక్కువ సేవా అర్హత క‌లిగిన సాయుధ దళాల సిబ్బందికి
'ఇన్‌వాల్యూడ్ పెన్ష‌న్‌‌'‌ను అందించేందుకు అనుమతించాలని కేంద్ర‌ ప్రభుత్వం ఒక కీల‌క నిర్ణయం తీసు‌కుంది. మిలిటరీ సర్వీస్ వారి చేత అట్రిబ్యూటబుల్ టు నార్ అగ్ర‌వేటెడ్‌గా (నానా) ఆమోదించ‌బ‌డిన‌ వైకల్యం కార‌ణంగా చ‌ట్ట‌బ‌ద్ద‌త ప‌రిధిలోకి రాని సేవ‌లను అందించిన సాయుధ దళాల సిబ్బందికి కూడా ఇక‌పై 'ఇన్‌వాల్యూడ్ పెన్ష‌న్‌‌'‌ అందించేందుకు గాను కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న  తాజా నిర్ణ‌యం దోహ‌దం చేయ‌నుంది. ఈ ప్రతిపాదనకు ర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ త‌న ఆమోదం తెలియ‌జేశారు. తాజా నిర్ణయం ప్రయోజనం 04.01.2019న లేదా తరువాత సేవలో ఉన్న సాయుధ దళాల సిబ్బంది వారికి అందుబాటులో ఉంటుంది. ఇంత‌కు ముందు 'ఇన్‌వాల్యూడ్ పెన్ష‌న్'‌‌‌ను అందుకొనేందుకు గాను క‌నీస అర్హత పొందిన సేవ యొక్క కనీస స‌ర్వీసు ప‌ది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండేది. 10 సంవత్సరాల కన్నా తక్కువ అర్హతతో త‌మ సేవలందించ‌న వారికి 'ఇన్‌వాల్యూడ్ గ్రాట్యుటీ'ని యోగ‌మైన‌దిగా నిర్ణ‌యించారు. సాయుధ దళాల సిబ్బంది పదేండ్ల సేవా కాలం లోపు నానా విధానం ప్ర‌కారం శారీరక లేదా మానసిక బలహీనతతో సేవలు అందించేందుకు అన‌ర్హులుగా మారినా/ అన‌ర్హులుగా ప్ర‌క‌టించబ‌డినా, మరియు మిల‌ట‌రీ స‌ర్వీసు నుంచి శాశ్వతంగా అశ‌క్తులుగా/ అశ‌క్త‌త‌తులుగాను మారిన వారు సివిల్‌ రీ-ఎంప్లాయిమెంట్ పొందిన వారికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యంతో ల‌బ్ధి క‌లుగనుంది. కేంద్ర ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం ఇలాంటి వారికి త‌గు ఆర్థిక ద‌న్నును అందించ‌నుంది. 

***


(Release ID: 1638916)