నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

స్కిల్ ఇండియా మిషన్ 5 అద్భుతమైన సంవత్సరాలు, ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా డిజిటల్ కాంక్లేవ్ నిర్వహణ;

స్కిల్ ఇండియా 5 సంవత్సరాల చారిత్రక ప్రయాణం నైపుణ్య శిక్షణ విస్తరణ, ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తిని నింపింది

Posted On: 15 JUL 2020 5:43PM by PIB Hyderabad

ఘనమైన అయిదేళ్ల ప్రస్థానం సాగించిన స్కిల్ ఇండియా మిషన్, ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డిజిటల్ కాంక్లేవ్ ని నిర్వహించారు. 

ప్రస్తుతం అత్యంత చురుకుగా మారుతున్న వ్యాపార, పారిశ్రామిక రంగ వాతావరణం, మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో యువత నైపుణ్యాన్ని పెంచుకోవడమే కాకుండా, వాటిలో కొత్త మార్గాలను అన్వేషించాలని ప్రధాన మంత్రి ఈ సందర్భాంగా కాంక్లేవ్ కి సందేశం ఇచ్చారు.  ఎప్పుడు కొత్త నైపుణ్యాలను రంగరించుకుంటున్న యువతదే ప్రస్తుత ప్రపంచమని అన్నారు. అయిదేళ్ల క్రితం ఇదే రోజున ప్రారంభమైన స్కిల్ ఇండియా మిషన్ వల్ల నైపుణ్య సామర్థ్యాలను, అత్యున్నత నైపుణ్యాలను వినియోగించి దేశ మౌలిక స్థితిగతుల్లోనే సమూలమైన మార్పులు తీసుకురాగలిగారని యువతను అభినందించారు ప్రధాని.  

ప్రధాన మంత్రి సందేశం పూర్తి పాఠాన్ని ఈ లింక్ ద్వారా చూడవచ్చు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638689

ఈ సందర్బంగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ దేశ ఆర్థిక వృద్ధి, సామజిక అభివృద్హిలో యువతదే కీలక పాత్ర అని అన్నారు. విభిన్న నైపుణ్యాల బహుముఖ ప్రజ్ఞను పెంచడం, జాతీయ, ప్రపంచవ్యాప్తంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానాల మద్దతుతో పరిశ్రమ డిమాండ్లను తీర్చడానికి వాటిని అనుకూలంగా మార్చడంపై తాము శక్తిని కేంద్రీకరిస్తామని ఆయన తెలిపారు. 

విద్యుత్, పునరుత్పాదక ఇంధన, స్కిప్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (స్వతంత్ర ఛార్జి) శ్రీ ఆర్.కె.సింగ్ డిజిటల్ స్కిల్స్ కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా, శిక్షణ విభాగం డైరెక్టరేట్ జనరల్  రెండు ప్రాంతీయ కార్యాలయాలను ఆన్ లైన్ లో ప్రారంభించింది. ఒకటి ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ వద్ద, మరొకటి లేహ్ కేంద్ర పాలిత ప్రాంతం వద్ద. వీటిలో లెహ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ఆర్కె మాథుర్ లేహ్ శాఖను ప్రారంభించారు. కొద్దిమంది రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి మంత్రులు కూడా వీడియో సందేశాల ద్వారా డిజిటల్ స్కిల్స్ కాంక్లేవ్ ‌ను ఉద్దేశించి ప్రసంగించారు. వీరిలో గుజరాత్, కర్ణాటక, అస్సాం, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ మంత్రి ఉన్నారు.

ఎంఎస్‌డిఇ కార్యదర్శి శ్రీ ప్రవీణ్ కుమార్ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఎ.ఎం.నాయక్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించారులక్షల్లో ఉన్న ట్రైనీల విస్తృతమైన నెట్‌వర్క్‌తో సహా వ్యవస్థలోని అన్ని వాటాదారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్-19 సమయంలో నైపుణ్య శిక్షణ పొందినవారు వినూత్న పరిష్కారాల గురించి ఆడియో-విజువల్ చూపించగాస్కిల్ మ్యాపింగ్‌లో మరో ఆడియో-విజువల్ కూడా ప్రదర్శించారు.

స్కిల్ ఇండియా మిషన్: నైపుణ్యం కలిగిన కార్మికుల డిమాండ్‌ను తీర్చడానికి నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖ మంత్రిత్వ శాఖల ద్వారా  ప్రతి సంవత్సరం స్కిల్ ఇండియా మిషన్‌లో కోటి మంది చేరడం జరుగుతోంది.

ఐటిఐ సామర్థ్యంలో పెరుగుదల: ఐటిఐ పర్యావరణ వ్యవస్థ పరిమాణంలో గణనీయమైన పెరుగుదల ఉంది, గత 5 సంవత్సరాల్లో 5000 ఐటిఐలు స్థాపించబడ్డాయి, మొత్తం సంస్థల సంఖ్య 15,000 కి దగ్గరగా ఉంది. నమోదు చేసుకున్న అభ్యర్థులు గత 5 సంవత్సరాల్లో ఈ ఐటిఐలలో 27.56 లక్షలకు పెరిగాయి. ఐటిఐ సామర్థ్యాన్ని 34.63 లక్షలకు పెంచారు, ఇది 2015 తో పోలిస్తే 85.5% పెరిగింది. పరిశ్రమల సంప్రదింపులు, 35 కొత్త ట్రేడ్‌లు, 11 ఇండస్ట్రీ 4.0 కోర్సులు ప్రవేశపెట్టిన 63 కోర్సు పాఠ్యాంశాల ద్వారా ఐటిఐల అప్‌గ్రేడ్ చేపట్టారు

వీటితో పాటు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవివై) కింద 37 రంగాలలో 92 లక్షల మంది శిక్షణ పొందారు. ప్రత్యేక వ్యవసాయ విధానాల శిక్షణలో 3.42 లక్షల మంది పాల్గొన్నారు. 

స్వల్పకాల వ్యవధి శిక్షణను మరింత నాణ్యతతో నిర్వహించేలా 720 కి పైగా ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాలను 704 జిల్లాల్లో ప్రారంభించారు. సింగపూర్, అరబ్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, వంటి దేశాల్లో నైపుణ్య అభివృద్ధికి చేపడుతున్న శిక్షణ తో కలిసి పని చేయడం ద్వారా మన దేశ కార్మికుల నైపుణ్య ప్రమాణాలు పెంచడం జరిగింది. 

అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లలో పెరిగిన భాగస్వామ్యం: అప్రెంటిస్‌షిప్ ప్రమేయాన్ని ఇంకా పెంచుతూ తీసుకున్న వివిధ కార్యక్రమాల వల్ల అప్రెంటిస్‌ల నమోదులో 44% పెరుగుదల, అప్రెంటిస్‌షిప్ శిక్షణలో పాల్గొనే సంస్థలలో 10% పెరుగుదల కనిపించింది. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (నాప్స్) కింద మొత్తం 8.61 లక్షల మంది పాల్గొన్నారు. సుమారు 85,000 సంస్థలు అప్రెంటిస్‌లను నియమించుకున్నాయి.

జన శిక్షణ్ సంస్థాన్ (జెఎస్‌ఎస్) పథకం: గత ఆర్థిక సంవత్సరంలో, జెఎస్‌ఎస్ పథకం కింద శిక్షణ పొందిన మొత్తం 4.10 లక్షల మంది లబ్ధిదారులు 2018-19లో శిక్షణ పొందిన 1.67 లక్షలతో పోలిస్తే, ఆరు నెలల కాలంలో 2.5 రెట్లు పెరుగుదల చోటుచేసుకుంది.

ఈ-స్కిల్ ఇండియా ప్లాట్‌ఫామ్: టెక్నాలజీ ఆధారిత వాతావరణంలో, భారతీయ యువతకు నైపుణ్య అవకాశాలను మరింతగా పెంచడంలో ఈ-లెర్నింగ్ కీలకమైనది. భారతీయ యువతకు ఈ-స్కిల్లింగ్ అవకాశాలను కల్పిస్తూ బహుభాషా ఈ-లెర్నింగ్ అగ్రిగేటర్ పోర్టల్ అయిన ఈ-స్కిల్ ఇండియాను ఎన్‌ఎస్‌డిసి రూపొందించింది. భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలనే ఎన్‌ఎస్‌డిసి నిబద్ధతను పంచుకునే ప్రముఖ నైపుణ్య సంస్థలచే నిర్వహించే ఆన్‌లైన్ కోర్సులను ఏకీకృతం చేయడం ద్వారా ఆన్‌లైన్ అభ్యాసంలో భారతీయ, ప్రపంచ నాయకుల నుండి నైపుణ్య అవకాశాలను ఈ-స్కిల్ ఇండియా ప్రభావితం చేస్తుంది. కోర్సులు ఇంగ్లీష్, హిందీ మరియు 9 ప్రాంతీయ భాషలలో లభిస్తాయి. అభ్యాసకులు స్వీయ-వేగ ఇంటరాక్టివ్ వీడియోలు, క్విజ్‌ల ద్వారా మార్గనిర్దేశం చేస్తారు. ఈ పోర్టల్‌లో 500 కి పైగా కోర్సులు ఉన్నాయి, 2.5 లక్షల మంది విద్యార్థులు తమను తాము నమోదు చేసుకున్నారు.

విజన్ రిపోర్ట్ 2025: వివిధ వాటాదారులతో సంప్రదించి ఎంఎస్‌డిఇ తన విజన్ రిపోర్ట్ 2025 ను సిద్ధం చేసింది. ముసాయిదా విజన్ రిపోర్ట్ 2025, ఎంఎస్‌డిఇ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశాలలో మంత్రిత్వ శాఖ వివిధ విభాగాల అధిపతులు, వాటితో అనుసంధానమై ఉన్న సంస్థలతో చర్చించారు. 

మహిళల కోసం తీసుకున్న చర్యలు: 2020, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ (ఎంజిఎన్ఎఫ్) అనే రెండు సంవత్సరాల కార్యక్రమాన్ని కర్ణాటకలోని ఐఐఎం బెంగళూరులో ఎంఎస్‌డిఇ ప్రారంభించింది. ఫెలోషిప్ ప్రోగ్రాం ప్రపంచ బ్యాంక్ రుణ సహాయంతో స్కిల్స్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్‌నెస్ ఫర్ లైవ్‌లిహుడ్ ప్రమోషన్ (సంకల్ప్) కార్యక్రమం కింద రూపొందించడం జరిగిందిఎంపికైన మొత్తం 75 మందిలో 32 మంది మహిళా అభ్యర్థులు (మొత్తం 43%) ఉన్నారు.

కోవిడ్-19 కోసం తీసుకున్న చర్యలు:

కోవిడ్ నేపథ్యంలో వ్యూహాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖ టాస్క్ ఫోర్స్, 16/4/20 న తన నివేదికను సమర్పించింది, ఈ రంగం అభివృద్ధికి అత్యవసరంగా తీసుకోవలసిన చర్యలతో సహా వివిధ రంగాలలో సిఫారసులతో ముందుకు వచ్చింది. అడ్డంకులను సమర్థంగా ఎదుర్కొనేలా విధానాల తయారీ వ్యూహాలు, వివిధ రంగాల్లో కీలక పాత్ర పోషించే వారు పని ప్రారంభించడానికి వ్యాపార ప్రణాళికను తయారు చేయడం, మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడానికి, ప్రపంచ ఎగుమతుల్లో భారతదేశ వాటాను పెంచడానికి మంత్రిత్వ శాఖలు తీసుకోగల చర్యలపై టాస్క్ ఫోర్స్ కొన్ని సూచనలు చేసింది.

వివిధ దేశాలకు వలస వెళ్లి తిరిగి వచ్చేసిన వారి నైపుణ్యాల ఆధారంగా తగు మార్గాలను వారికి చూపే కార్యక్రమానికి కూడా నైపుణ్యాభివృద్ధి శాఖ- పౌరవిమానయాన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో కలిసి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా  స్వదేశ్ అనే కార్యక్రమం ద్వారా  నైపుణ్య వ్యక్తుల డేటా ను సేకరిస్తున్నారు.  

ఆత్మనిర్భర స్కిల్డ్ ఎంప్లాయ్ ఎంప్లాయర్ మ్యాపింగ్ (అసీమ్) పథకం కింద నైపుణ్యం ఉన్న వ్యక్తులకు జీవనోపాధి కల్పించడంలో అండగా ఉండడానికి ఒక కార్యక్రమం ప్రారంభించారు. పరిశ్రమ అవసరాలు, అందుబాటులో ఉన్న వారు, ఈ రెంటి మధ్య దూరాన్ని తగ్గించి పరిశ్రమ వాణిజ్య అవసరాలకు కావలసిన నైపుణ్య వ్యక్తులకు తగు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించడమే ఈ పథకం లక్ష్యం. దాదాపు 24 లక్షల మంది ఇటువంటి అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందిన వారు తగు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందడానికి సిద్ధంగా ఉన్నారు. 

*****



(Release ID: 1638914) Visitor Counter : 195


Read this release in: English , Urdu , Hindi , Tamil