భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ఎస్కార్ట్స్ లిమిటెడ్‌లో (ఎస్కార్ట్స్) వాటాను కుబోటా కార్పొరేషన్ (కుబోటా) కొనుగోలు చేయడానికి, కుబోటా అగ్రికల్చరల్ మెషినరీ ఇండియాలో (కేఏఐ) వాటాను ఎస్కార్ట్స్ కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం
Posted On:
10 JUL 2020 7:25PM by PIB Hyderabad
ఎస్కార్ట్స్ లిమిటెడ్‌లో (ఎస్కార్ట్స్) 9.09 శాతానికి పైగా వాటాను కుబోటా కార్పొరేషన్ (కుబోటా) కొనుగోలు చేయడానికి, కుబోటా అగ్రికల్చరల్ మెషినరీ ఇండియాలో (కేఏఐ) 40 శాతం వాటాను ఎస్కార్ట్స్ కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) శుక్రవారం ఆమోదం తెలిపింది. సీసీఐ సెక్షన్ 31 (1) ప్రకారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తన ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత కాంబినేషన్‌లో ఎస్కార్ట్స్ లిమిటెడ్ చేత జారీ చేసిన పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్‌లో 9.09 శాతం వాటా కుబోటా కోనుగోలుకు సంబంధించి ఉంది. ఎస్కార్ట్స్ చేత మూలధన తగ్గింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఇది మొత్తం ఇష్యూడ్, సబ్‌స్క్రైబడ్ మరియు పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో 10 శాతంగా ఉంటుంది. అటుపై ఎస్కార్ట్స్ కేఏఐ సంస్థలో 40 శాతం మేర వాటాను కొనుగోలు చేయనుంది. దీని ప్రకారం కుబోటా మరియు ఎస్కార్ట్స్ సంస్థలు కేఏఐలో నందు వరుసగా 60-40 శాతం మేర వాటాను కలిగి ఉండనున్నాయి. కుబోటా అనేది జపాన్ చట్టాల ప్రకారం ఏర్పాటు చేయబడిన
సంస్థ. కుబోటా సమగ్ర వ్యవసాయ ఉత్పత్తి తయారీదారు మరియు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు మరియు బియ్యం నూర్పిడి చేసే వివిధ యంత్రాలను అందిస్తుంది.
కుబోటా దీనికి తోడు ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణం, నిర్వహణతో పాటు నీటి భద్రత మరియు సురక్షతకు దోహదం చేసేలా వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎస్కార్ట్స్ అనేది భారత్‌లో ఏర్పాటు చేయబడిన పబ్లిక్ లిమిటెడ్ సంస్థ. ఎస్కార్ట్స్ సంస్థ షేర్లు బీఎస్ఈ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియాలో నమోదు చేయబడ్డాయి. భారతదేశంలో వ్యవసాయ యంత్రాలు, నిర్మాణ సామగ్రి, రైల్వే పరికరాల తయారీ మరియు అమ్మకం వ్యాపారంలో ఎస్కార్ట్స్ సంస్థ నిమగ్నమై ఉంది.
ఈ వాటా విక్రయానికి సంబంధించి సీసీఐ అనుమతులతో కూడిన వివరణాత్మక ఆర్డర్ వెలువడాల్సి ఉంది.
****
(Release ID: 1637893)
Visitor Counter : 149