శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

లక్సాయ్ సైన్సెస్ భాగస్వామ్యంతో యాంటీవైరల్ మరియు హోస్ట్-డైరెక్ట్ థెరపీల స‌మ్మేళ‌నంగా కోవిడ్ -19 రోగులపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు రెగ్యులేటరీ అనుమతుల్ని కోర‌నున్న సీఎస్ఐఆర్


Posted On: 07 JUL 2020 6:31PM by PIB Hyderabad

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), హైద‌రాబాద్‌కు చెందిన లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజ‌న్యంతో ఫోర్‌-ఆర్మ్ రాండమైజ్డ్ కంట్రోల్డ్ ఫేజ్-III క్లినికల్ ట్రయల్స్‌ చేపట్టేందుకు గాను రెగ్యులేటరీ అనుమతి కోరనుంది. యాంటీ వైరల్స్ (వైరల్ - ఎంట్రీ మరియు రెప్లికేషన్ ఇన్హిబిటర్స్) ను హేతుబద్ధంగా స‌మిళితం చేయడంతో పాటుగా వాటిని తిరిగి పునరావృతం చేయుటే రూపకల్పన‌ సూత్రంగా ఈ అధ్య‌యనం చేప‌ట్ట‌నున్నారు.

వ్యాధి-వ్యాప్తి మరియు పాథాలజీని పరిష్కరించేందుకు విభిన్న‌మైన హోస్ట్-డైరెక్ట్ థెరపీలు (హెచ్‌డీటీలు) మరియు మూడు ఔషధాల (ఫావిపిరవిర్ + కొల్చిసిన్, ఉమిఫెనోవిర్ + కొల్చిసిన్ మరియు నాఫామోస్టాట్ + 5-ఏఎల్ఏ) యొక్క భద్రత మరియు సామర్థ్యాన్ని నిర్ణయించేలా మ‌రియు కోవిడ్ -19 రోగుల సంరక్షణ నిమిత్తం ప్రమాణంతో నియంత్రణకు వీలుగా ఈ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్ అధ్య‌య‌నం జ‌రుగ‌నుంది.

మెకాంటా మెడిసిటీ భాగస్వామ్యంతో నిర్వహించబోయే 'ముకోవిన్' అనే ఔష‌ధపు క్లినికల్ ట్రయల్స్ నిర్వ‌హించ‌నున్నారు. 75 మంది రోగులతో కూడిన నాలుగు వేర్వేరు సమూహాలను క‌లుపుకొని మొత్తం 300 మంది రోగులపై ఈ ట్ర‌య‌ల్స్‌ను నిర్వ‌హించ‌నున్నారు. స్క్రీనింగ్ మరియు చికిత్స‌తో స‌హా 17 నుండి 21 రోజుల పాటు వీటిని నిర్వహించనున్నారు.

కోవిడ్ -19 చికిత్సకు చికిత్సా ఎంపికలను పెంచడానికి మరియు రోగులు వేగంగా కోలుకోవడానికి సహాయపడేందుకు గాను పునర్వినియోగపరచబడిన ఔషధాలతో ఈ ప్రత్యేకమైన కాంబినేటోరియల్ స్ట్రాటజీ (యాంటీవైరల్స్ మరియు హెచ్‌డీటీలు) విధానాన్ని అవలంబిస్తున్న‌ట్టుగా సీఎస్ఐఆర్ డీజీ డాక్టర్ శేఖర్ సి.మాండే  ప్ర‌ధానంగా తెలియ‌చేశారు. ఈ కీల‌క‌ క్లినికల్ ట్రయల్‌లో భాగస్వాములుగా హైద‌రాబాద్‌కు చెందిన సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మరియు జ‌మ్ములోని సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లు వ్య‌వహ‌రిం‌చనున్నాయి. వైర‌స్ ప్రతి రూపణకు అవసరంగా నిలుస్తున్న‌ వైరల్ ప్రోటీన్లను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా వైరల్ జీవిత చక్రంలో కీలక పాత్ర పోషిస్తున్న హోస్ట్ కారకాలు మరియు సైటోకిన్ స్ట్రోమ్ దోహ‌ద‌త వంటి అంశాలే ల‌క్ష్యంగా  ఈ అధ్య‌యనం జ‌రుపుతున్న‌ట్టుగా  లక్సాయ్ లైఫ్ సైన్సెస్ సంస్థ సీఈఓ డాక్టర్ రామ్ ఎస్. ఉపాధ్యాయ తెలిపారు.

"లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ఈ అధ్యయనం యొక్క స‌హ‌-ప్ర‌యోజితగా ఉండ‌డం ద్వారా మానవాళి సేవలో ప్రాణాలను రక్షించే చికిత్సలను తీసుకురావడంలో.. మా సంస్థ యొక్క నిబద్ధత ను హైలైట్ చేస్తుంది" అని లక్సాయ్ లైఫ్ సైన్సెస్ సంస్థ ఎండీ వంశీ మ‌ద్దిప‌ట్ల అన్నారు. మ‌హ‌మ్మారి వ్యాప్తి స‌మ‌యంలో సీఎస్ఐఆర్ చేసిన వివిధ ర‌కాల ప‌రిశోధ‌నాత్మ‌క స‌హ‌కారాల‌కు ఈ క్లినికల్ ట్రయల్స్ ఎంత‌గానో తోడ్పడ‌నున్నాయి. ఈ ట్రయల్స్‌ విజయవంతమైతే.. ఇది కోవిడ్-19 చికిత్సకు మ‌రిన్ని ఎంపికలను అందుబాటులోకి తెచ్చినట్ట‌వ‌నుంది.

*****


(Release ID: 1637065) Visitor Counter : 234