ఆర్థిక మంత్రిత్వ శాఖ
గంగా పునరుజ్జీవానికి మద్దతు మరింత పెంచేందుకు 400 మిలియన్ డాలర్లు అందించనున్న ప్రపంచబ్యాంక్
గంగగా నదిని పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నదిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సంస్థలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఈ ప్రాజెక్టు సహాయపడుతుంది
Posted On:
07 JUL 2020 5:07PM by PIB Hyderabad
గంగానది పునరుజ్జీవానికి ఉద్దేశించిన నమామి గంగే కార్యక్రమానికి మద్దతును మరింత పెంచేందుకు ప్రపంచబ్యాంకు, భారత ప్రభుత్వం ఈరోజు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. రెండవ జాతీయ గంగా రివర్ బేసిన్ ప్రాజెక్టు , ప్రతిష్ఠాత్మక గంగా నదిలో కాలుష్యాన్ని తొలగించేందుకు, 500 మిలియన్ల మంది ప్రజలకు ఆవాసమైన ఈ నదీ పరివాహక ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుంది.
ఈ 400 మిలియన్ డాలర్లలో 381 మిలియన్ డాలర్లు రుణం కాగా 19 మిలియన్ డాలర్లు ప్రతిపాదిత గ్యారంటీ. 381 మిలియన్ డాలర్లకు సంబంధించిన ఒప్పందంపై ఈ రోజు భారత ప్రభుత్వం తరఫున, ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఆర్ధిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ ఖరే, ప్రపంచ బ్యాంకు తరఫున యాక్టింగ్ కంట్రీ డైరక్టర్ (ఇండియా) శ్రీకైసర్ ఖాన్ సంతకాలు చేశారు. గ్యారంటీ పత్రాన్ని వేరుగా ప్రాసెస్ చేస్తారు.
గంగా నది భారతదేశపు అత్యంత ప్రముఖ సాంస్కృతిక, ఆర్థిక, పర్యావరణ వనరు అని, నమామి గంగే కార్యక్రమం ఈ నదిని తిరిగి కాలుష్య రహితంగా, పర్యావరణ పరంగా ఆరోగ్యవంతమైన స్థాయికి తీసుకువెళుతుందని శ్రీ ఖరే చెప్పారు. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా, గంగా నదిని పరిశుభ్రమైన,ఆరోగ్యకరమైన నదిగా తీర్చిదిద్దే కీలక జాతీయ కార్యక్రమానికి భారత ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకుల మద్దతు మరింత కొనసాగేలా చేస్తుంది.
ప్రస్తుతం కొనసాగుతున్న, నేషనల్ గంగా రివర్ బేసిన్ ప్రాజెక్టు ద్వారా భారత ప్రభుత్వం చేపడుతున్న కృషికి ప్రపంచ బ్యాంకు 2011 నుంచి మద్దతుగా ఉంటున్నది. ఈనది నిర్వహణకు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసిజి) నోడల్ ఏజెన్సీ ఏర్పాటుకు ఇది సహకరించింది. అలాగే గంగా నది పక్కన గల పట్టణాలు, నగరాలలో మురుగునీటి శుద్ధి కి సంబంధించిన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రపంచబ్యాంకు ఫైనాన్సు చేసింది.
నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కు చెందిన డైరక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ, రెండవ జాతీయ గంగా రివర్ బేసిన్ ప్రాజెక్టు ద్వారా, ఈ ప్రాజెక్టు కొనసాగింపు వల్ల ప్రపంచబ్యాంకు తొలి ప్రాజెక్టులో సాధించిన ప్రగతి మరింత పుంజుకోవడానికి అవకాశం కలిగిస్తుందన్నారు. ఆ రకంగా ఎన్.ఎం.సి.జి నదుల పునరుజ్జీవనానికి సంబంధించి మరిన్ని వినూత్న కార్యకలాపాలను ప్రపంచ స్థాయి అత్యుత్తమ ప్రమాణాలతో చేపట్టడానికి అవకాశం కలిగిస్తుందని చెప్పారు.
ప్రస్తుతం కొనసాగుతున్న గంగా రివర్ బేసిన్ ప్రాజెక్టు:
- నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏర్పాటుకు సహాయం అందించడం జరిగింది.
- గంగా నది ప్రధాన మార్గం వెంట 20 పట్టణాలలో మురుగు సేకరణ, శుద్దికి సంబంధించి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాయం
- 1,275 ఎం.ఎల్.డి మురుగునీటి శుద్ధి సామర్ధ్యం ఏర్పాటు
- 3,632 కిలోమీటర్ల మురుగు నీటిపారుదల నెట్‌వర్కు నిర్మాణం
- గంగానది పునరుద్ధరణకు ప్రజలను సత్వరం సమాయత్తం చేసేందుకు సహాయం
“ప్రభుత్వం ప్రారంభించిన నమామి గంగే కార్యక్రమం గంగానది పునరుజ్జీవనానికి భారతదేశ కృషికి ప్రాణం పోసింది” అని ఇండియాలో ప్రపంచబ్యాంక్ కంట్రీ డైరక్టర్ జునైద్ అహ్మద్ అన్నారు . “ గంగా నదివెంట కాలుష్యం ఎక్కువగా ఉన్న ముఖ్యమైన 20 ప్రాంతాలలో కీలకమైన మురుగునీటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రపంచబ్యాంకు తొలి ప్రాజెక్టు సహాయపడింది. ఈ ప్రాజెక్టును దీని ఉపనదుల కు కూడా విస్తరింప చేయడానికి ఉపకరిస్తుంది. నదీ పరివాహక ప్రాంత నిర్వహణకు , అందులోనూ గంగా నది పరివాహక ప్రాంతం వంటి క్లిష్టమైన , పెద్ద ప్రాంత నిర్వహణకు అవసరమైన సంస్థలను బలోపేతం చేయడానికి ఇది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది.”
విస్తారమైన గంగా పరివాహక ప్రాంతం దేశంలోని మూడింట రెండు వంతుల ఉపరితల జలాలను అందిస్తుంది. అలాగే దేశంలో అత్యంత భారీ నీటిపారుదల ప్రాంతాన్ని కలిగి ఉంది. గంగా నది భారత దేశ నీటి, ఆహార భద్రతకు ఎంతో కీలకమైనది. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) లో 40 శాతం, అత్యంత ఎక్కువ జనాభా కలిగిన ఈ బేసిన్ ప్రాంతం నుంచే వస్తుంది. అయితే ప్రస్తుతం గంగానది మానవాళి నుంచి ,ఆర్థిక కార్యకలాపాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. అది గంగా నది నీటి నాణ్యతపైన, ప్రవాహంపైన ప్రభావం చూపుతున్నది.
“ గంగా బేసిన్‌లో మరిన్ని పట్టణాలలో మురుగునీటి శుద్ధికి సంబంధించిన మౌలిక సదుపాయాలను విస్తరింప చేసేందుకు ఈ ప్రాజెక్టు సహాయపడుతుంది. అలాగే ఈ మౌలికసదుపాయాలను సమర్ధంగా దీర్ఘకాలికంగా నిర్వహించి వాటిని ఉపయోగించడంపై దృష్టిపెట్టడం జరుగుతుంద”ని లీడ్ వాటర్,శానిటేషన్ స్పెషలిస్ట్ జేవియర్ చావూట్ డి బ్యూచెనీ , అలాగే వాటర్, శానిటేషన్ స్పెషలిస్ట్ శ్రీ ఉపనీత్ సింగ్ తెలిపారు. ఈ ఇరువురూ ఎస్.ఎన్.జి.ఆర్.బి.పి కి, సహ టాస్కు టీమ్ లీడర్లు(టిటిఎల్). “ ఈ ప్రాజెక్టు , గంగా నది పరివాహక ప్రాంతాన్ని మరింత సమర్దంగా నిర్వహించేందుకు అవసరమైన అధునాతన ఉపకరణాలను అభివృద్ధి చేయడానికి ఎన్.ఎం.సి.జి కి ఉపయోగపడుతుంది.”
గంగా నదిలో 80శాతం పైగా కాలుష్యం, గంగానది, దాని ఉపనదుల వెంట ఉన్న నగరాలు, పట్టణాలలోని ఇళ్ళనుంచి వచ్చే శుద్ది చేయని నీటి నుంచి వస్తోంది. ఎస్.ఎన్.జి.ఆర్.బి.పి ఎంపిక చేసిన నగర ప్రాంతాలలో కాలుష్యకారకాల విడుదలను నియంత్రించడంలో సహాయపడడానికి మురుగుశుద్ధి ప్లాంట్లను , మురుగు నీటి నెట్‌వర్కుల ఏర్పాటుకు పైనాన్సు చేస్తుంది.
ఈ మౌలికసదుపాయాల పెట్టుబడులు , వీటి ద్వారా ఏర్పడే ఉద్యోగాలు కోవిడ్ -19( కరోనా వైరస్ ) సంక్షోభం నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థను కోలుకునేలా చేసేందుకు సహాయపడనున్నాయి.
ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఆస్తులు సమర్ధంగా పనిచేసేలా చేయడానికి, వాటి సక్రమ నిర్వహణకు ఈ ప్రాజెక్టును వినూత్న హైబ్రిడ్ యాన్యుటీ నమూనా (హెచ్.ఎ.ఎం) కింద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపడతారు. ప్రస్తుతం ఎన్.జి.ఆర్.బి.పి కింద దీనిని ప్రవేశపెడుతున్నారు. ఇది గంగా బేసిన్‌లో మురుగునీటి శుద్ధి పెట్టుబడులకు ఒక సరైన పరిష్కారం గా మారుతుంది. ఈ నమూనా కింద , మురుగునీటి ట్రీట్ మెంట్ ప్లాంటు నిర్మాణానికి, ప్లాంటు నిర్మాణ పెట్టుబడి వ్యయంలో 40శాతం మొత్తాన్ని ప్రైవేటు ఆపరేటర్‌కు , వీటి నిర్మాణ సమయంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన 60శాతం మొత్తాన్ని 15 సంవత్సరాలపాటు వాటి పనితీరుతో ముడిపడిన చెల్లింపుల కింద చేస్తుంది. దీనితో ఆపరేటర్ ప్లాంటును సమర్ధంగా నడపడంతోపాటు, సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది.
400 మిలియన్ డాలర్ల మొత్తంలో ప్రతిపాదిత 19 మిలియన్ డాలర్ల గ్యారంటీ కూడా ఇమిడి ఉంది. గంగానది ఉపనదులపై చేపట్టే మూడు హైబ్రిడ్ -యాన్యుటి- మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (హెచ్ఎఎం-పిపిపి) పెట్టుబడులకు ప్రభుత్వ చెల్లింపుల హామీకి బ్యాక్‌స్టాప్‌గా ఇది ఉంటుంంది.“ వ్యర్థజలాల శుద్ధికి ఐబిఆర్‌డి గ్యారంటీ ఇచ్చిన కార్యక్రమం ఇది.దేశంలో జల రంగంలో ఐబిఆర్‌డి తొలి గ్యారంటీ ఇది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులలో ప్రభుత్వ వనరులు అందుబాటులో ఉండేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ” అని సీనియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ స్పెషలిస్ట్, గ్యారంటీకి సహ టిటిఎల్ అయిన శ్రీ సతీష్ సౌందర్ రాజన్ అన్నారు.
381 మిలియన్ డాలర్ల వేరియబుల్ స్ప్రెడ్ రుణం 18.5 సంవత్సరాల మెచూరిటీ కాలన్ని కలిగి ఉంది. ఇందులో 5 సంవత్సరాలు గ్రేస్ పిరియడ్. 19 మిలియన్ డాలర్ల గ్యారంటీ గడువు తీరే తేదీ, గ్యారంటీ అమలులోకి వచ్చిన తేదీ నుంచి 18 సంవత్సరాలుగా ఉంటుంది.
****
(Release ID: 1637062)
Visitor Counter : 275