వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

పీఎంజీకేఏ కింద ఉచిత రేషన్ పథకాన్ని నవంబర్ వరకు పొడిగించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్


అదన‌పు 10% ఆహార ధాన్యాలు రాష్ట్రాలు / యుటీలకు కేటాయించబడ్డాయి, అవసరమైనప్పుడు మ‌రిన్ని ఆహార ధాన్యాలు అందించబడతాయి: శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్

గ‌త‌ నెలల్లో ఆహార ధాన్యాలను తీసుకొని లబ్ధిదారులకు వాటి పంపిణీని ‌ వేగవంతం చేయాలని రాష్ట్రాలు / యుటీలను కోరిన శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్

Posted On: 01 JUL 2020 5:57PM by PIB Hyderabad

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ‌ శాఖ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మీడియా సమావేశాన్ని నిర్వ‌హించారు. ఎన్ఎఫ్ఎస్ఏ ప్రొవిజ‌న్ మేర‌కు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (టీపీడీఎస్‌) పరిధిలోని ల‌బ్ధిదారులంద‌రికీ (ఏఏవై మరియు పీహెచ్‌హెచ్‌) నెల‌కు ఒక్క వ్య‌క్తికి 5 కిలోల మేర‌ ఉచితంగా ఆహార ధాన్యాల‌ను అందించాల‌న్న తాజా నిర్ణ‌యం మేర‌కు కేంద్ర మంత్రిత్వ శాఖ స‌న్న‌ద్ధ‌త, మ‌రియు చేప‌ట్టిన అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లను గురించి మంత్రి పాశ్వాన్‌ వివ‌రించారు. ఎన్ఎఫ్ఎస్ఏ ప్రొవిజ‌న్ మేర‌కు డీబీటీ ప‌రిధిలో చేరిన వారికి కూడా ఉచిన రేష‌న్‌ అందించ‌నున్నారు.


80 కోట్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులకు మేలు ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలోనూ వర్షాకాలం మరియు రాబోయే పండుగల‌ సీజన్లలో నిరు పేదలు, అన్నార్థులు ఆకలితో ఉండకూడ‌ద‌నే మేటి ఉద్దేశంతో వారు ఉచిత రేష‌న్ పొందేలా.. ఈ ప‌థ‌కాన్ని నవంబర్ చివరి వరకు పొడిగించినందుకు మం‌త్రి శ్రీ పాశ్వాన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ అన్నా యోజన రెండవ దశ జూలై 01 నుండి ఈ ఏడాది నవంబర్ ముగిసేంత వరకు అమలులో ఉంటుంద‌ని శ్రీ పాశ్వాన్‌ మీడియాకు తెలియజేశారు. ఈ కాలంలో 80 కోట్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులకు మొత్తం 200 ఎల్‌ఎమ్‌టీల‌ ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేయబడతాయ‌ని తెలిపారు. దీనికి తోడుగా మొత్తం 20 కోట్ల కుటుంబాలకు మొత్తం 9.78 ఎల్‌ఎమ్‌టీల మేర ప‌ప్పు ధాన్యాలు పంపిణీ చేయబడతాయ‌ని అన్నారు.


మొత్తం రూ.1.5 ల‌క్ష‌ల కోట్ల వ్య‌యం పీఎంజీకేఏవై-1, పీఎంజీకేఏవై-2 రెండు పథకాలను కలిపితే స‌ర్కారు మొత్తం వ్యయం సుమారు రూ.1.5 లక్షల కోట్ల మేర ఉంటుందని తెలియజేశారు. ఈ పథకం కింద దేశంలో 80 కోట్లకు పైగా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారుల‌కు నెలవారీ రేష‌న్‌తో పాటుగా ప్రతి కుటుంబానికి వ్యక్తికి నెల‌కు 5 కిలోల ఆహార ధాన్యాలు, మరియు 1 కిలో ప‌ప్పు ధాన్యాలు అందుతాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ఇది ల‌బ్ధిదారులు‌ నెల ‌వారీగా అందుకునే రేష‌న్‌కు అద‌నం అని ఆయ‌న శ్రీ పాశ్వాన్ తెలిపారు. దీనికి సంబంధించి జూన్ 30న అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్ర‌భుత్వాల‌కు ఉత్తర్వులు జారీ చేసిన‌ట్టుగా వివ‌రించారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా వచ్చే 5 నెలల వరకు ఆహార ధాన్యాల పంపిణీని ప్రారంభించాలని వారిని కోరిన‌ట్ట‌గా మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాలు / యుటీలకు అదనంగా 10 శాతం అదనపు ఆహార ధాన్యాలు కేటాయించబడ్డాయ‌ని వివ‌రించారు. వీటి‌ని రాష్ట్రాలు/ ‌కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు అవసరమైనప్పుడు తాము ఈ అదనపు కేటాయింపుల్ని అందిస్తామని ఆయన చెప్పారు.

పీఎంజీకేఏవై కింద ఆహార ధాన్యాలు

బియ్యం/ ‌గోధుమ‌లు

ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పీఎంజీకేఏ పథకం యొక్క స్థితి గురించి మంత్రి మీడియాకు వివరించారు. మొత్తం 119.82 ఎల్‌ఎమ్‌టీల మేర‌ ఆహార ధాన్యాల కేటాయింపులో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీలు మినహా అన్ని రాష్ట్రాలు / యుటీలు ఇప్పటివరకు 116.52 ఎల్‌ఎమ్‌టీల మేర ధాన్యాలను తీసుకున్న‌ట్టుగా ఆయ‌న తెలిపారు. ఆహార ధాన్యాల పంపిణీకి సంబంధించి మంత్రి వివ‌రిస్తూ ఏప్రిల్‌లో 93% ఆహార ధాన్యాలు, మే మాసంలో 93% ఆహార ధాన్యాలు, 75% ఆహార ధాన్యాలు జూన్ మాసంలో పంపిణీ చేయబడ్డాయ‌ని తెలిపారు. జూన్ నెల పంపిణీ ఇంకా కొనసాగుతోంద‌‌ని అన్నారు.

పీఎంజీకేఏవై క్రింద ఏప్రిల్, మే మరియు జూన్ నెలల్లో 90 శాతం కంటే తక్కువ ఆహార ధాన్యాలను పంపిణీ చేసిన రాష్ట్రాలు/ ‌కేంద్ర పాలిత ప్రాంతాల‌ జాబితా:

రాష్ట్రం

మొత్తం కేటాయింపు 3 నెలలు (ఎంటీ)

మూడు నెలల్లో మొత్తం పంపిణీ (ఎంటీ)

పంపిణీ శాతం

దాద్రా, నగర్ హవేలి మరియు డామన్ & డ‌య్యు

4,284

3,729

87%

మ‌హారాష్ట్ర

10,50,255

9,09,556

87%

జార్ఖండ్‌

3,95,550

3,41,555

86%

ఢిల్లీ

1,09,101

91,743

84%

మ‌ణిపూర్‌

36,852

29,442

80%

బీహార్‌

12,96,744

9,74,410

75%

మ‌ధ్య ప్ర‌దేశ్‌

8,19,630

5,58,808

68%

సిక్కిం

5,682

3,841

68%

ప‌శ్చిమ బెంగాల్‌

9,02,757

531,,887

59%

పప్పులు

పప్పుధాన్యాలకు సంబంధించి శ్రీ పాశ్వాన్‌ వివ‌ర‌ణ‌నిస్తూ మూడు నెలలు అంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు మొత్తం అవసరం 5.87 ఎల్ఎంటీల ప‌ప్పుధాన్యాలు అవ‌స‌ర‌మ‌ని అంచనా వేశామ‌ని అన్నారు. ఇందులో ఇప్పటి వరకు 5.80 ఎల్‌ఎమ్‌టీల‌ పప్పు ధాన్యాలు రాష్ట్రాలు / యుటీలకు పంపించబడ్డాయ‌న్నారు. వీటిలో 5.61 ఎల్‌ఎమ్‌టీలు రాష్ట్రాలు / యుటీలకు చేరుకోగా, 4.49 ఎల్‌ఎమ్‌టీ పప్పులు పంపిణీ చేయబడ్డాయ‌ని వివ‌రించారు. 18.6.2020 నాటికి మొత్తం 08.76 ఎల్‌ఎమ్‌టీల‌ పప్పు ధాన్యాల‌ (కందిప‌ప్పు-3.77 ఎల్‌ఎమ్‌టీ, పెస‌ర‌ప‌ప్పు -1.14 ఎల్‌ఎమ్‌టీ, మిన‌ప ప‌ప్పు -2.28 ఎల్‌ఎమ్‌టీ, శ‌న‌గ ప‌ప్పు - 1.30 ఎల్‌ఎమ్‌టీ, మసూర్ దాల్‌-0.27 ఎల్‌ఎమ్‌టీ) నిల్వ ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. ఈ పథకం కింద భారత ప్రభుత్వం 100 శాతం మేర సుమారు రూ.5 వేల కోట్ల ఆర్థిక భారాన్ని భ‌రిస్తోంద‌ని అన్నారు.

ఏప్రిల్ నెలలో 90% కంటే తక్కువ పప్పుధాన్యాలు పంపిణీ చేసిన రాష్ట్రాలు / యుటీలు ఇలా ఉన్నాయి..

ప‌శ్చిమ బెంగాల్‌

87.48%

మ‌హారాష్ట్ర

82.49%

బీహార్‌

81.54%

మ‌ధ్య ప్ర‌దేశ్‌

66.60%

మే నెలలో 90% కంటే తక్కువగా పప్పుధాన్యాలు పంపిణీ చేసిన రాష్ట్రాలు / యుటీలు..

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌

85.98%

త్రిపుర‌

84.30%

మ‌హారాష్ట్ర

74.22%

మ‌ణిపూర్‌

62.11%

మ‌ధ్య ప్ర‌దేశ్‌

50.70%

మిజోరాం

45.40%

బీహార్‌

31.45%

ప‌శ్చిమ బెంగాల్‌

0.00%

జూన్ నెలలో 90% కంటే తక్కువ పప్పుధాన్యాలు పంపిణీ చేసిన రాష్ట్రాలు / యుటీలు..

జార్ఖండ్‌

87.05%

మేఘాల‌యా

89.34%

హిమాచ‌ల్ ప్ర‌దేశ్

85.99%

పంజాబ్‌

81.78%

హ‌ర్యానా

80.35%

క‌ర్ణాట‌క

75.19%

ఒడిషా

71.96%

గుజ‌రాత్‌

63.67%

రాజ‌స్థాన్‌

66.39%

లద్ధాఖ్‌

62.65%

సిక్కిం

61.64%

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌

59.77%

మిజోరాం

46.59%

మ‌హారా‌ష్ట్ర

40.30%

మ‌ణిపూర్‌

21.05%

తెలంగాణ‌

10.55%

బీహార్

0%

త్రిపుర‌

0%

మ‌ధ్య ప్ర‌దేశ్

0%

ప‌శ్చిమ బెంగాల్‌

0%

పంపిణీకి సంబంధించి అన్ని రాష్ట్రాలు / యుటీల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్లు మంత్రి తెలియజేశారు. వారివారి రాష్ట్రాలు / యుటీలలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్ల‌ను వేగం చేయాలని అభ్యర్థించిన‌ట్టుగా వివ‌రించారు. ఇంటర్నెట్ నెమ్మ‌దిగా ఉండ‌డం లేదా పరిమిత కనెక్టివిటీకి సంబంధించిన వంటి సవాళ్లను చాలా రాష్ట్రాలు హైలైట్ చేశాయని ఆయ‌న తెలిపారు. దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమ‌లునకు తగిన విధంగా పరిష్కారం చూపేలా మరియు సజావుగా అమలు చేయడానికి గాను అవ‌రోధంగా ఉన్న సమస్యలను డీఓటితో చ‌ర్చించి త‌గిన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయన హామీ ఇచ్చారు.


ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీ పాశ్వాన్‌ మంత్రిత్వ శాఖ యొక్క రెండు విభాగాల అధికారులను అభినందించారు. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలోనూ ఆహార పంపిణీ యొక్క సవాలు పనిని పూర్తి చేసినందుకు భారతదేశ ఫుడ్ కార్పొరేషన్ మరియు నాఫెడ్ కార్మికుల సేవ‌ల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు. ఈ కీల‌క సవాలు సమయంలో ఆహార ధాన్యాల పంపిణీకి స‌హకరించినందుకు గాను రైల్వేకు కూడా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

****

 



(Release ID: 1636040) Visitor Counter : 250