వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

భారత ఆహార సంస్థ వద్ద తగినంత ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి; జూన్ వరకు ఎఫ్.‌సి.ఐ. మొత్తం 388.34 ఎల్.‌ఎమ్.‌టి.ల గోధుమలు, 745.66 ఎల్‌.ఎమ్.‌టి.ల బియ్యాన్ని కొనుగోలు చేసింది


ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద మొత్తం 99,207 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు, పి.ఎమ్.‌జి.కె.ఎ.వై. కింద 101.90 ఎల్.‌ఎమ్.‌టి.ల ఆహార ధాన్యాలు లబ్ధిదారులకు పంపిణీ చేయబడ్డాయి

మిగిలిన రాష్ట్రాలలో ఎక్కువ భాగం 2020 డిసెంబర్ నాటికి "వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్" పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నాయి

Posted On: 29 JUN 2020 5:03PM by PIB Hyderabad

 

మొత్తం ఆహార ధాన్యాల నిల్వ: 

 28.06.2020 తేదీ నాటి,  భారత ఆహార సంస్థ నివేదిక ప్రకారం, ఎఫ్.‌సి.ఐ. వద్ద ప్రస్తుతం 266.29 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 550.31 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు స్టాక్ లో ఉన్నాయి.  దీంతో, మొత్తం 816.60 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం నిల్వ అందుబాటులో ఉంది (ప్రస్తుతం కొనుగోలులో ఉన్న గోధుమలు మరియు వరి మినహాయించి, ఇవి ఇంకా గోడౌన్‌కు చేరుకోలేదు).  ఎన్.‌ఎఫ్.‌ఎస్.‌ఏ. మరియు ఇతర సంక్షేమ పథకాల కింద నెలకు సుమారు 55 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతాయి. 

లాక్ డౌన్ ప్రారంభమైన రోజు  నుండి, సుమారు 138.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాలు 4,944 రైలు గూడ్స్ పెట్టెల ద్వారా రవాణా చేయబడ్డాయి. రైలు మార్గంతో పాటు, రోడ్లు మరియు జలమార్గాల ద్వారా కూడా రవాణా జరిగింది.  మొత్తం 277.73 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఆహార ధాన్యాలు రవాణా చేయడం జరిగింది.  వీటిలో 21,724 మెట్రిక్ టన్నుల ధాన్యాలు 14 నౌకల ద్వారా రవాణా చేయబడ్డాయి.  మొత్తం 13.47 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఈశాన్య రాష్ట్రాలకు రవాణా చేయబడ్డాయి.

వలస కూలీలకు ఆహార ధాన్యాల సరఫరా: (ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ)

 ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద, ఎన్.‌ఎఫ్.‌ఎస్.‌ఏ. లేదా రాష్ట్రాల పధకం పి.డి.ఎస్. కార్డుల పరిధిలోకి రాని 8 కోట్ల మంది వలస కూలీలు, చిక్కుకు పోయిన మరియు అవసరమైన కుటుంబాలకు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను మే మరియు జూన్ నెలలకు ఉచితంగా పంపిణీ చేయబడుతోంది.  రాష్ట్రాలు మరియు కేంద్రపాలితప్రాంతాలు  6.39 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను తీసుకున్నాయి.   రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు మొత్తం 209.96 లక్షల లబ్ధిదారులకు (మే నెలలో 120.08 లక్షల మందికి మరియు జూన్ నెలలో 89.88 లక్షల మందికి)  99,207 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ చేశాయి.

1.96 కోట్ల వలస కుటుంబాలకు 39,000 మెట్రిక్ టన్నుల పప్పులను కూడా భారత ప్రభుత్వం ఆమోదించింది.  ఎన్.‌ఎఫ్.‌ఎస్.‌ఏ. లేదా రాష్ట్ర పధకం పి.డి.ఎస్. కార్డుల పరిధిలోకి రాని 8 కోట్ల మంది వలస కూలీలు, చిక్కుకుపోయిన మరియు నిరుపేద కుటుంబాలకు మే మరియు జూన్ నెలలకు ఒక కుటుంబానికి 1 కిలో  కంది పప్పును ఉచితంగా ఇస్తారు.  రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఈ కంది పప్పు కేటాయింపు జరుగుతోంది.   సుమారు 33,968 మెట్రిక్ టన్నుల కంది పప్పు రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు పంపించబడ్డాయి.  మొత్తం 31,868 మెట్రిక్ టన్నుల కంది పప్పును వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు తీసుకువెళ్ళాయి. 4,702 మెట్రిక్ టన్నుల కంది పప్పును రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు పంపిణీ చేశాయి.  ఈ పథకం కింద ఆహార ధాన్యాల కోసం 3,109 కోట్ల రూపాయలు, కంది పప్పు కోసం 280 కోట్ల రూపాయల మేర 100 శాతం ఆర్ధిక భారాన్ని భారత ప్రభుత్వం భరిస్తోంది.  

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన:

ఆహార ధాన్యాలు (బియ్యం/గోధుమలు)

పి.ఎమ్.జి.కే.ఏ.వై. కింద, ఏప్రిల్-జూన్ 3 నెలలకు మొత్తం 104.3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మరియు 15.2 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు అవసరమవుతాయి, వీటిలో 101.02 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మరియు 15.00 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు తీసుకువెళ్ళాయి.   మొత్తం 116.02 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు తీసుకున్నాయి.  2020 ఏప్రిల్ నెలలో 74.05 కోట్ల మంది లబ్ధిదారులకు 37.02 లక్షల మెట్రిక్ టన్నుల (93%) ఆహార ధాన్యాలు పంపిణీ చేయబడ్డాయి,  2020 మే నెలలో, మొత్తం 36.49 లక్షల మెట్రిక్ టన్నుల (91%) ఆహార ధాన్యాలు 72.99 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేయబడ్డాయి.  2020 జూన్ నెలలో, 28.41 లక్షల మెట్రిక్ టన్నుల  (71%) ఆహార ధాన్యాలు 56.81 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేయబడ్డాయి.  ఈ పథకం కింద 46,000 కోట్ల రూపాయల మేర 100 శాతం ఆర్థిక భారాన్ని భారత ప్రభుత్వం భరిస్తోంది.  6 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు - పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీగఢ్, ఢిల్లీ మరియు గుజరాత్ లకు గోధుమలు కేటాయించబడ్డాయి, మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు బియ్యం అందించబడ్డాయి.

పప్పుధాన్యాలు: 

 పప్పుధాన్యాల విషయానికి వస్తే, మూడు నెలలకు మొత్తం 5.87 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు అవసరమవుతాయి.  ఈ పథకం కింద సుమారు 5 వేల కోట్ల రూపాయల మేర  100 శాతం ఆర్థిక భారాన్ని భారత ప్రభుత్వం భరిస్తోంది. ఇంతవరకు, 5.79 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించగా, 5.58 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేరాయి. వీటిలో 4.40 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలను పంపిణీ చేయడం జరిగింది.  18.6.2020 తేదీ నాటికి మొత్తం 08.76 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు (కందిపప్పు- 3.77 ఎల్‌ఎమ్‌టి, పెసర పప్పు- 1.14 ఎల్‌ఎమ్‌టి, మినప పప్పు- 2.28 ఎల్‌ఎమ్‌టి, శనగ పప్పు- 1.30 ఎల్‌ఎమ్‌టి, ఎర్ర కంది పప్పు(మసూర్)-0.27 ఎల్‌ఎమ్‌టి) స్టాక్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఆహార ధాన్యాల సేకరణ: 

28.06.2020 తేదీ నాటికి మొత్తం 388.34 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు (ఆర్.‌ఎం.ఎస్. 2020-21) మరియు , 745.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (కె.ఎం.ఎస్. 2019-20) సేకరించడం జరిగింది. 

బహిరంగ మార్కెట్ కొనుగోలు పధకం (ఓ.ఎమ్.ఎస్.ఎస్.):

ఓ.ఎమ్.ఎస్.ఎస్. కింద, బియ్యం ధర కిలోకు 22 రూపాయలు, గోధుమలు ధర కిలోకు 21 రూపాయలుగా నిర్ణయించారు.  లాక్ డౌన్ సమయంలో భారత ఆహార సంస్థ 5.71 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు మరియు 10.07 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఓ.ఎమ్.ఎస్.ఎస్. ద్వారా విక్రయించింది.

 

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు :

 2020 జూన్ 1వ తేదీ నాటికి, 20 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో, "వన్ నేషన్ వన్ కార్డ్" పథకం ప్రారంభించబడింది, అవి - ఆంధ్రప్రదేశ్, బీహార్, డామన్ & డయ్యూ (దాద్రా మరియు నగర్ హవేలి), గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ మరియు త్రిపుర.

2021 మార్చి 31వ తేదీ నాటికి మిగిలిన అన్ని రాష్ట్రాలు "వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్" పధకంలో చేరనున్నాయి. దీంతో ఈ పథకం భారతదేశం అంతటా పనిచేస్తున్నట్లు అవుతుంది. 

"వన్ నేషన్ వన్ రేషన్ కార్డు" పధకం క్రింద మిగిలిన రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం యొక్క వివరాలు మరియు స్థితి క్రింది విధంగా ఉంది: -

  

క్రమ సంఖ్య 

 

రాష్ట్రం 

 

ఈ.పి. ఓ.ఎస్. శాతం 

రేషన్ కార్డుల ఆధార్ సీడింగ్

(%)

 

ఈ పథకంలో 

చేరే 

అంచనా 

తేదీ

1

ఛత్తీస్ గఢ్ 

98%

98%

1  ఆగష్టు, 2020

2

అండమాన్, నికోబార్ 

96%

98%

1 ఆగష్టు, 2020

3

మణిపూర్ 

61%

83%

1 ఆగష్టు, 2020

4

నాగాలాండ్ 

96%

73%

1 ఆగష్టు, 2020

5

జమ్మూ, కశ్మీర్ 

99%

100%

ఈ పథకం కొన్ని జిల్లాల్లో 

2020 ఆగస్టు 1వ తేదీన మరియు మిగిలిన జిల్లాల్లో 2020 నవంబర్

 1వ తేదీ నుండి అమలు అవుతుంది

6

ఉత్తరాఖండ్ 

77%

95%

1సెప్టెంబర్, 2020

7

తమిళనాడు 

100%

100%

1 అక్టోబర్, 2020

8

లడాఖ్ 

100%

91%

1 అక్టోబర్, 2020

9

ఢిల్లీ 

0%

100%

1 అక్టోబర్,  2020

10

మేఘాలయ 

0%

1%

1డిసెంబర్, 2020

11

పశ్చిమ బెంగాల్ 

96%

80%

1 జనవరి, 2021

12

అరుణాచల్ ప్రదేశ్ 

1%

57%

1 జనవరి, 2021

13

అస్సామ్ 

0%

0%

 

14

లక్షద్వీప్ 

100%

100%

 

15

పుదుచ్చేరి 

0%

100%(డి.బి.టి)

డి.బి.టి. 

16

చండీగఢ్ 

0%

99

(డి.బి.టి)

డి.బి.టి. 

 

  

****


(Release ID: 1635257) Visitor Counter : 360