వ్యవసాయ మంత్రిత్వ శాఖ
అజ్మీర్, బికనీర్ లలో మిడతల దండును అదుపు చేయడానికి దేశీయంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద తయారుచేసిన తొలి యుఎల్ వి స్ర్పేయర్ ప్రయోగాత్మక పరీక్ష; వాణిజ్యపరంగా విడుదల చేసేందుకు అనుమతులు అవసరం
రాజస్తాన్ లోని బార్మార్, జైసల్మీర్, బికనీర్, నాగోల్, జోథ్ పూర్ జిల్లాల్లో అందుబాటులో ఉండని పొడవైన చెట్లపై ఉండే మిడతలు నాశనం చేసేందుకు డ్రోన్ల ద్వారా క్రిమినాశనుల స్ర్పే
డ్రోన్ల ద్వారా ఎడారి మిడతలను నాశనం చేసిన తొలి దేశం భారత్ అని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ ప్రశంస
Posted On:
23 JUN 2020 6:22PM by PIB Hyderabad
మిడతలను అదుపు చేసే పరికరాల దిగుమతికి గల పరిమితులను అధిగమించేందుకు వ్యవసాయం, సహకారం, రైతు సంక్షేమ శాఖ (డిఏసి & ఎఫ్ డబ్ల్యు) మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద వాహనాలకు బిగించి ప్రయోగించ యుఎల్ వి స్ర్పేయర్ ను తయారుచేసే సవాలును స్వీకరించింది. డిఏసి & ఎఫ్ డబ్ల్యు శాఖకు అనుబంధంగా ఉన్న యంత్రికీకరణ, టెక్నాలజీ విభాగం ఒక భారతీయ కంపెనీ సహాయంతో ఈ స్ర్పేయర్ నమూనాను సిద్ధం చేసింది. రాజస్తాన్ లోని అజ్మీర్, బికనీర్ జిల్లాల్లో ఈ స్ర్పేయర్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. దీన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఇతర అనుమతులు పొందే ప్రక్రియను కూడా ప్రారంభించారు. మిడతల దండును అదుపు చేసేందుకు అత్యంత కీలకమైన ఈ పరికరాల దిగుమతి ఆధారనీయతను ఇది తగ్గిస్తుంది.
ప్రస్తుతం యుకెకు చెందిన మెసర్స్ మైక్రాన్ స్ర్పేయర్స్ ఒక్కటే వాహనాలకు బిగించి ప్రయోగించే స్ప్రేయర్ల సరఫరాదారుగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇలాంటివి 60 స్ర్పేయర్ల సరఫరాకు ఆ సంస్థకు ఆర్డర్ పెట్టారు. కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వీటి సరఫరా వేగంగా జరిగేలా కృషి చేస్తున్నాయి. భారత్ లోని యుకె హై కమిషన్ ఆ సంస్థతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ స్ర్పేయర్ల సత్వర సరఫరాకు కృషి చేస్తున్నాయి. ఇప్పటి వరకు 15 స్ర్పేయర్ల సరఫరా జరిగింది. నెల రోజుల వ్యవధిలో మిగతా 45 స్ర్పేయర్ల సరఫరా పూర్తవుతుంది.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న భూమి పై నుంచి కీటకనాశనులను స్ర్పే చేసే వాహన స్ర్పేయర్లు 25-30 అడుగుల ఎత్తు వరకే వాటిని చల్లగలుగుతాయి. ట్రాక్టర్లకు బిగించి ప్రయోగించే స్ర్పేయర్లకు కూడా పొడవైన వృక్షాలు, ఇతరత్రా అందుబాటులో లేని ప్రదేశాలకు చేరే విషయంలో పరిమితులున్నాయి. అందుకే గగనతలం నుంచి క్రిమినాశనులు చల్లే పరికరాల కోసం అన్వేషణ జరపడం తప్పనిసరి అయింది.
మిడతల దండును అదుపు చేసే కార్యక్రమాలపై సమీక్షించిన కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్రసింగ్ తోమర్ డ్రోన్ల ద్వారా క్రిమినాశనులు చల్లడానికి గల అవకాశాలు అన్వేషించాలని ఆదేశించారు. పౌర విమానయాన శాఖ (ఎంఓసిఏ) ప్రస్తుత మార్గదర్శకాలు క్రిమినాశనులను బిగించి డ్రోన్లను ప్రయోగించడాన్ని అనుమతించడంలేదు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న డిఏసి & ఎఫ్ డబ్ల్యు గగనతలం నుంచి డ్రోన్ల ద్వారా క్రిమినాశనుల ప్రయోగాన్ని అనుమతించాలని ఎంఓసిఏను కోరింది. ఆ అభ్యర్థనను పురస్కరించుకుని ఎంఓసిఏ డ్రోన్ల ద్వారా కీటకనాశనుల ప్రయోగానికి ఫరీదాబాద్ కు చెందిన మొక్కల సంరక్షణ, క్వారంటైన్, స్టోరేజి డైరెక్టరేట్ కు మే 21న పరిమిత అనుమతి మంజూరు చేసింది. ఆ తర్వాత మే 22న డ్రోన్లు, విమానాలు, హెలీకాప్టర్ల ద్వారా గగనతలం నుంచి కీటకనాశనుల ప్రయోగానికి సెంట్రల్ ఇన్ సెక్టిసైడ్స్ బోర్డు ప్రామాణిక విధివిధానాలను అనుమతించింది.
ఎంఓసిఏ ఇచ్చిన ఈ పరిమిత అనుమతిని పరిగణనలోకి తీసుకుని మిడతల అదుపు నిమిత్తం గగనతలం నుంచి కీటక నాశనులు స్ర్పే చేసేందుకు రెండు సంస్థలను ఎంపిక చేశారు. ఈ రెండు సంస్థలు జైపూర్ (రాజస్తాన్), శివ్ పురి (మధ్యప్రదేశ్) నగరాల్లో ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించాయి. ఆ తర్వాత మే 27వ తేదీన కేబినెట్ కార్యదర్శి స్థాయిలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం అదే రోజున వ్యవసాయం, సహకారం, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి, పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ఎన్ డిఎంఏ, పవన్ హాన్స్ ప్రతినిధుల జరిగింది. గగనతలం నుంచి కీటకనాశనులు స్ర్పే చేసే పరికరాలు బిగించిన హెలీకాప్టర్లు/ విమానాల అందుబాటు, గరిష్ఠ స్థాయిలో డ్రోన్ల ప్రయోగానికి వ్యూహంపై చర్చించారు. డ్రోన్లు, విమానాలు, హెలీకాప్టర్ల ద్వారా గగనతలం నుంచి కీటకనాశనులు స్ర్పే చేసే పరికరాలను సమకూర్చుకునేందుకు డిఏసిఎఫ్ డబ్ల్యు అదనపు కార్యదర్శి అధ్యక్షతన ఎంఓసిఏ, పవన్ హాన్స్, డిజిసిఏ, ఎయిరిండియా, డిఏసి&ఎఫ్ డబ్ల్యు సభ్యులుగా ఒక సాధికార కమిటీని ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత సాధికార కమిటీ సిఫారసుల మేరకు 5 డ్రోన్ కంపెనీలకు వర్క్ ఆర్డర్లు మంజూరు జారీ చేశారు. ఆ తర్వాత ఆ ఐదు కంపెనీలు బార్మార్, జైసల్మీర్, బికనీర్, నాగోల్, ఫలోడి (జోధ్ పూర్) జిల్లాల్లో ఇప్పటి వరకు దశలవారీగా 12 డ్రోన్లను ప్రయోగించాయి. అందుబాటులో ఉండని అతి పొడవైన వృక్షాలపై కీటకనాశనులు సమర్థవంతంగా అదుపు చేయడంలో డ్రోన్ల వినియోగం సంతృప్తికరమైన ఫలితాలు అందించింది. ఎడారి మిడతల అదుపులో సామర్థ్యాలకు డ్రోన్ల ప్రయోగం లోకస్ట్ సర్కిల్ కార్యాలయానికి అదనపు బలం అందించింది. ప్రపంచంలో డ్రోన్ల ద్వారా ఎడారి మిడతలు అదుపు చేసిన తొలి దేశం భారత్ అని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రశంసించింది.
*******
(Release ID: 1633831)
Visitor Counter : 228